Theosophy / దివ్య జ్ఞానము - తలాలు (dimensions) - 1 :
శక్తి పదార్థంలోని అవతరణ చెందినప్పుడు, ఏడు రకాలుగా సాంద్రతలను పెంచుకుంటూ... ఏడు తలాలు గా (dimensions) ఆవిర్భవిస్తుంది.
1. ఆది తలం
2.అనుపాదక తలం
3.ఆనంద(ఆత్మ) తలం
4.విజ్ఞాన తలం
5.మనస్సు - (అరూపా మరియూ సరూపా మనస్సు)
6.కామ తలం
7.భౌతిక తలం
మొదట శక్తి మాత్రమే ఉన్నది. ఈ ఘనీభవిస్తే పదార్థం అవుతుంది. అత్యంత సూక్ష్మ సాంద్రత ఉంటే... ఆత్మ అవుతుంది. ఈ శక్తి మొదట ఆదిశక్తిగా(the primary force)ఉన్నది. అది "ఆది తలం". ఆదిలో కేవలం ఒకే రకమైన శక్తి ఉన్నది.
ఆరు క్రమ క్రమంగా పెరుగుతున్న సాంద్రత గల తలాల నుంచి క్రిందికి దిగి భౌతిక తలంగా మారింది. యోగులు ఏం చెబుతున్నారంటే... పై ఆరింటి గురించి మనకు ఏమీ తెలియదు. మనకు తెలిసింది ఏమిటంటే... భౌతిక జగత్తులో ఏడు ఉప తలాలు. మనము చెప్పుకుంటున్న ఈ ఏడు తలాలు, భౌతిక తలం లోని ఏడు ఉపతలాలు మాత్రమే. అవేమిటంటే.....
.(7.1)--భౌతిక - ఆది
(7.2)--భౌతిక - అనుపాదక
(7.3)--భౌతిక - ఆత్మ
(7.4)--భౌతిక - విజ్ఞాన
(7.5)--భౌతిక - మనస్సు (అరూపా మరియూ సరూపా)
(7.6)--భౌతిక - కామ
(7.7)--భౌతిక - భౌతిక తలాలు.
మనం ఆత్మ గురించి మాట్లాడుతున్నా, ఆది గురించి మాట్లాడుతున్నా... మనకి అసలు ఆత్మ గురించి గానీ ఆ ఆది తలం గురించి గానీ ఏమీ అర్థం కాదు. అర్థమైన వారు మహా యోగులు అవుతారు. మనం దేని గురించి మాట్లాడుతున్నా, భౌతిక తలంలోని, ఏడవ తలంలోని... ఆ ఉప భాగమై ఉంటుంది. నిజానికి మనం ఎక్కడున్నాము అంటే..... భౌతిక జగత్తులోని మనోమయ సరూపా తలం లో ఉన్నాము. (7.5 తలం). నామము, రూపము లేకపోతే మనకు ఏది అర్థం కాదు .యోగులు మానసిక తలం లోని "అరూపా స్థితి" లో జీవిస్తున్నారు. వారు ఎవరైనా సరే..... శ్రీరామ శర్మ ఆచార్య కావచ్చు, మాస్టర్ సి.వి.వి కావచ్చు, మహావతార్ బాబాజీ కావచ్చు. భౌతిక శరీర ధారి ఎవరైనా ఇది దాటి వెళ్ళలేరు.
ఈ స్థితిని శ్రీ అరవింద ఘోష్ supramental descent అన్నారు. కానీ గురువులందరూ ఎక్కడున్నారంటే గాయత్రీ మంత్రం లోని "స్వః తలం" లోనే ఉన్నారు. కానీ మనకి చెప్పడానికి క్రిందికి దిగివచ్చారు. మానవ జాతి ఇంకా ఆధ్యాత్మిక విద్య లోకి ప్రవేశించి ఉన్నది తప్ప .....ఇంకా మానవజాతికి, ఆధ్యాత్మిక విద్య ఏమీ తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? జ్వాలా కూలుడు వ్రాసిన పుస్తకం "the externalisation of hierarchy" మనం మొదలు పెట్టినప్పుడు. సప్త ఋషులు బాహ్య అభివ్యక్తీకరణ జరిగినప్పుడు ఆధ్యాత్మిక విద్య భూమిమీద స్థిరపడుతుంది.(సశేషం)

No comments:
Post a Comment