**అష్టావక్రగీత అధ్యాయము 6*
జనక ఉవాచ
6.1
*ఆకాశవదనంతోఽహం ఘటవత్ ప్రాకృతం జగత్*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
జనక ఉవాచ
6.1
*ఆకాశవదనంతోఽహం ఘటవత్ ప్రాకృతం జగత్*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
నేను ఆకాశమువలె అనంతము. జగత్తు కుండవలె ప్రకృతికి సంబందించినది – అని
జ్ఞానము. కనుక, దానిని జగత్తును వదులుట లేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు
లేదు.
జ్ఞానము. కనుక, దానిని జగత్తును వదులుట లేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు
లేదు.
6.2
*మహోదదివాహం స ప్రపంచో వీచ్చసన్నిభః*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
*మహోదదివాహం స ప్రపంచో వీచ్చసన్నిభః*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
నేను మహాసముద్రమువలెను, ప్రపంచము అలవలెను ఉన్నవి - అని జ్ఞానము. కనుక,
దానిని జగత్తును వదులుటలేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు లేదు.
దానిని జగత్తును వదులుటలేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు లేదు.
6.3
*అహం స శుక్తిసంకాశో రూప్యవద్విశ్వకల్పనా*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
*అహం స శుక్తిసంకాశో రూప్యవద్విశ్వకల్పనా*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
నేను ఆలుచిప్పవలెను, విశ్వము అనునది కల్పింపబడి-తోచిన వెండివలెను ఉన్నవి - అని
జ్ఞానము. కనుక, దానిని జగత్తును వదులుట లేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు
లేదు.
జ్ఞానము. కనుక, దానిని జగత్తును వదులుట లేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు
లేదు.
6.4
*అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యథో మయి*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
*అహం వా సర్వభూతేషు సర్వభూతాన్యథో మయి*|
*ఇతి జ్ఞానం తథైతస్య న త్యాగో న గ్రహో లయః*||
సర్వభూతములయందు నేను, నాయందు సర్వభూతములు ఉన్నవి - అని జ్ఞానము.
కనుక, దానిని జగత్తును వదులుట లేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు లేదు.
కనుక, దానిని జగత్తును వదులుట లేదు, పూనుట లేదు, మనసును ఆపుటయు లేదు.
6వ అద్యయము సమాప్తం
_*మనసు సత్వంతో ఉండటమే... సామాన్య జీవనం ! సత్యానికి సోపానం !!*_
_*సామాన్యమైన జీవనంలోనే జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది. సామాన్యంగా అంటే అది అదేదో ప్రత్యేక పరిస్థితని, మన భౌతిక పరిస్థితులు అలా మార్చుకోవాలని కాదు. ఉన్న స్థితిని, ఏర్పడిన పరిస్థితిని అర్ధం చేసుకుంటూ వివేకంతో మనసును సత్వగుణంలో ఉంచటమే సామాన్య జీవనం. అదే సత్యానికి సోపానం. ఆశ ఎంతపెద్దదైనా దానికి శాశ్వతత్వం లేదు. శాశ్వతమైనదాన్ని తెలుసుకోవడానికి ఆశతో పనిలేదు. ఇది అర్ధం చేసుకుంటే మనసు సత్వంతో సామాన్యంగా ఉంటుంది. మనసులో ఆశ, కోరిక, ఇచ్ఛ, ఆకాంక్షలు ఏవీ లేకుండా ఉన్నప్పుడు వ్యక్తమయ్యే జ్ఞానమే శాశ్వతంగా నిలిచి ఉండేది !*_
_*(నిర్వేదాష్టకాము మరియూ ఉపశమాష్టకము అను 9, 10 ప్రకరణలు సమాప్తము).*_ 6*
No comments:
Post a Comment