*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
ద్వితీయాధ్యాయము
*🌻. వైరాగ్య యోగము - 4 🌻*
శ్రీ రామ ఉవాచ :-
మునే! దేహస్య ణో దుఃఖం - నైవ చేత్పర మాత్మనః,
సీతా వియోగ దుఃఖాగ్ని - ర్మాం భస్మీ కురుతే కధమ్ ? 23
సదాను భూయతే యోర్త - స్సనా స్తీతి త్వయే రితః,
జాయతాం తత్ర విశ్వాసః - కధం మే ముని పుంగవ ! 24
రాముడు నివేదించు కొను చున్నాడు: ఓయీ ముని పుంగవా!
పరమాత్మకును శరీరమునకు వ్యధ లేదని మీరాదేశించితిరి.
అటులైన యెడల సీత ఎడబాటుతో నుప్పతిలు దుఃఖము మదన బాణాగ్ని నన్ను గాల్చి భస్మావ శేషము గావించు చున్నది. నిరంతర మేది యనుభవింప బడుచున్నదో ఆ విధమైనది మిధ్యయని నిరూపించితిరి,
అద్దానిని గురించి నాకు విశ్వాస మెట్లు కలుగును? నాకు తెలియ పరచుము.
అన్యిస్తి నాస్తికో భోక్తా - యేన జన్తు: ప్రతప్యాతే,
సుఖస్య వాపి దుఃఖస్య - తద్బ్రూహి ముని సత్తమ! 25
ఎట్టి. దుఃఖము వలన మనుష్యుడు బాధ చెందునో అట్టి దుఃఖము
ననుభవించుటకు గాని, ఎట్టి సుఖము వలన సుఖము ననుభవించునో అట్టి సుఖ దుఃఖముల ననుభవించు వాడొక్కడే బాధ్యుడు గాని యితరులు భోక్త లెట్లగుదురు నాకు వివరింపుమో మనివర్యా !
దుర్జే యా శాంభవీ మాయా తయా సమ్మో హ్యతే జగత్,
మాయాంతు ప్రకృతిం విద్ధి - మాయినం తు మహేవ్వర మ్ 26
తస్యా వయ భూతైస్తు - వ్యాసం సర్వ మిదం జగత్,
సత్య జ్ఞానాత్మ కోనన్తో- విభూరాత్మా మహేశ్వరః 27
అగస్త్యుడు చెప్పుచున్నాడు: ఆ మహేశ్వరుడు పన్నిన మాయను
తెలిసి కొనుటకు ఎవరికి సాధ్య పడును.? ఆ మహేశ్వర మాయ
వలన ఈ ప్రపంచ మంతయు మోహింప బడినది.
అట్టి మాయను ప్రకృతి గను, మాయామయుడు మహేశ్వరుడని యెరుంగుము. ఆ మహేశ్వరు డెటువంటి వాడనగా సాక్షాత్తుగా సత్య జ్ఞాన స్వరూపుడు. నాశము నభః పుష్పము వంటివాడు. (అనగా మృత్యుంజయుడు ).
సకల లోక సంరక్షకుండు, ఆత్మ స్వరూపుడు అతని యుపాంగ భూతములైన (అవయములైన ) చేతనాచేతన ప్రాణి కోటి చేత నీ ప్రపంచమును నిండా
ఆవరించు కొని యున్నది.
తస్యై వాంశో జీవ లోకే - ప్రాణి నాం హృదయే స్థితః 28
విస్పులింగా యధా వహ్నే - ర్జాయన్తే కాష్ట యోగతః,
అనాది కర్మ సంబందా - త్తద్వ దంశా మహేశితు: 29
రాపిడి కలిగిన కర్రల నుండి యగ్ని బుట్టి దాని కణములు వ్యాపించి నట్లుగా మానవుని యనాది సంచిత మగు కర్మ వాసన చేత మహేశ్వరాంశము ప్రపంచ మందలి ప్రాణి కోటి హృదయము లందు ఇమిడి యున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 13 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 02 :
*🌻 Vairagya Yoga - 4 🌻*
23. 24. Sri Rama said: Hey Saint! You discoursed that Paramatma doesn't suffer from agonies caused due to the body.
In that case why the pain of love and separation from Sita is burning me?
Whatever (suffering) is being experienced by me continuously, you said that's all illusion. How to believe those words? Kindly explain.
The sorrow which torments a man, to experience that sorrow;
Or, the pleasure which pleases a man, to experience such pleasure that man himself is responsible but how come someone else is the doer? Please explain that in detail O Sage!
26. 27. Agastya said: Who can understand the Maya of that Maheshwara?
This entire universe is illusioned by the Shambhavi Maya of that Maheshwara.
Know that Maya as Prakriti and that illusionist as Maheshwara.
That Maheshwara is himself the form of Truth and knowledge, eternal, imperishable, protector of all the worlds, the supreme soul.
He pervades in the entire universe as manifest & unmanifest, living & nonliving things.
28. 29. The way two firesticks produces sparks when rubbed with each other and those sparks spread further (forest fire),
similarly, due to the accumulation of Sanchita Karma (accumulated Karmas) that Maheshwaransham (portion of Maheshwara) lives in the hearts of all these millions of living beings.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment