భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 106



🌹.  భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 106  🌹

🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. పిప్పలాద మహర్షి - 8 🌻

46. ప్రతి జీవుడికి కూడా భగవంతుడి అనుగ్రహంతో ఎప్పుడో ఒకప్పుడు ఈ తీవ్రమైన వైముఖ్యం దైవికంగా కలుగుతూనే ఉంది. తల్లిగర్భమ్నుంచి బయటకు వచ్చి పెరుగుతున్న సమయంలో, ఆ నరకాన్ని గురించి మరచిపోయి వాడు పాపపుణ్యాలు చేస్తున్నాడు.

47. తీవ్రమైన ఎదో గొప్ప సంఘటన దైవికంగా జరిగినప్పుడు, గర్భనరకలో ఉన్నపుడు తాను ఎట్టి వేదనకు గురి అయినాడో అది మళ్ళీ స్మృతి పథానికివచ్చి మోక్షేఛ్ఛకు హేతువవుతుంది. దానికోసం అన్వేషించి ఉత్తీర్ణుడవుతాడు.

48. అయితే అలాంటి ఘటనలు దైవయోగంవలన మాత్రమే జరుగుతాయి. అజ్ఞానం ఎంత దారుణమైనదో అని లోపల ఉండగా అనుకుంటాడట. “కామక్రోధ సంకటాలు ఎంత బాధాకరమైన విషయాలు! నేను బయటపడగానే వీటినిజయిస్తాను.

49. ఈ సంసారమనే సంకెళ్ళను పిండిపిండి చేస్తాను” అని ఇలాంటి విషయాలు అనేకంగా అనుకుంటూ ఉంటాడు. కాని భూమిమీద పడగానే మరచిపోతాడు.

50. ‘గర్భవాసమ్నుంచీ బయటకురాగానే శివస్మరణ చేస్తాను. లయక్రియకు హేతువు, జగత్తునంతా తనలోనికి తీసుకునేవాడు రుద్రుడు. సర్వశక్తి మయుడు, చిదాత్ముడు సర్వకారణకారణుడు, భర్గుడు, పశుపతి, మహాదేవుడు, జగద్గురువు అయినటువంటి ఈశ్వరుడిని నేను శరణు వేడుతాను. మహా తపస్సు చేస్తాను. శాశ్వతంగా ముక్తిని పొందుతాను” అని ఇన్నీ అనుకుంటాడట జీవుడు. ఇవతలికి రాగానే అన్నీ మరచిపోతాడు. అవన్నీ చెప్పాడు పిప్పలాదుడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద

09.Sep.2020

No comments:

Post a Comment