నారద భక్తి సూత్రాలు - 89


🌹.   నారద భక్తి సూత్రాలు - 89   🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. చలాచలభోధ

చతుర్ధాధ్యాయం - సూత్రము - 60

🌻 60. శాంతిరూవాత్‌ పరమానందరూవాశ్చ ॥ 🌻

ముఖ్యభక్తి శాంతరూపం, ముఖ్యరూపం. ఇది కేవలం భక్తునిలో ఆంతరిక అనుభూతి. అతడిలో అది పరమానందరూపమై ఉంటుంది.

బయటి ప్రపంచంతో బంధం లేనప్పటికి లోకాన్ని చూచినప్పుడు భక్తుడికి కరుణ కలుగుతుంది. శిక్షించడం, రక్షించడం భగవంతుని పనేనని తెలిసి కూడా, దీనుల కొరకు సేవచెసే భాగ్యం భగవంతుడు తనకు కల్పించాదని, అందుకు భగవంతునిపై కృతజ్ఞత, విశ్వాసాలతో ఉంటాడు.

అయినప్పటికి అతడు దీనులకు సేవ చెద్దామని సంకల్పించడంలో భగవత్రేరణ ఉంటుంది. అతడికి లోక దుఃఖంతో స్పర్శ ఉండదు. అందువలన ఆ ముఖ్యభక్తుడికి లభించిన శాంతి, పరమానందాలకు విఘ్నం ఉండదు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

09.Sep.2020

No comments:

Post a Comment