శివగీత - 61 / The Siva-Gita - 61


🌹.   శివగీత - 61 / The Siva-Gita - 61   🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴

📚. ప్రసాద్ భరద్వాజ

ఎనిమిదో అధ్యాయము

🌻. గర్భో త్పత్త్యాది కథనము - 7 🌻

అకించిత్క స్త దాలో కై - ర్మాం స పేశీ వ దా స్థితః
శ్వమార్జా రాంది దంష్ట్రి భ్యో - రాక్షతే దండ పాణిభి 41

పితృవ ద్రాక్ష సంవేత్తి - మాతృవ ద్డాకినీ మపి,
పూయం పయోవద జ్ఞానా - ద్దీర్ఘ కష్టంతు శైశవమ్ 42

శ్లేష్మణా పిహితా నాడీ - సుషుమ్నా యావ దేవ హి,
వ్యక్త వర్ణం చ వచనం - తవద్వక్తుం న శక్యతే 43

అత ఏవ హి గర్భేపి - రోది తుం నైవ శక్యతే,
దృస్తోథ యౌవనం ప్రాప్య మన్మథ జ్వర విహ్వలః 44

గాయత్య క స్మాదు చ్చైస్తు - త థాక స్మా చ్చ వల్గతి
అరోమితి తరూన్వే గాచ్చాంతాను ద్వేజయత్యపి 45

(అట్లు జన్మించినతడు పరి బాల్యాద్య వస్థలను వివరించుచున్నాడు) అథో (క్రిందు) ముఖము కలవాడై శోకించును మిగుల దుఃఖముతో బీడింపబడినవాడై యోనియంత్రము నుండి బయలుదేరి (విడువబడి -జారి) క్రిందపడి మరల వెల్లకిలాబడును. కేవలము మాంసపుముద్ద మాదిరిగా నుండి యేమియు చేయుటకు శక్తి లేక తనవారి చేత కుక్కపిల్ల మొదలగు క్రూర ప్రాణులబారి నుండి రక్షింప బడుచున్నాడు. బాల్యావస్థలోన జ్ఞానిగాయుండుట వలన తండ్రిని రాక్షసునిగాను, తల్లిని రాక్షసిని (రాక్షసాంగవలె), పాలను పూయముగాను చూచును. కావున బాల్యావస్థ బహుకష్ట భూయిష్టమైనది.

సుషుమ్ననాడి యగు బ్రహ్మనాడి యెంతవరకైతే శ్లేష్మముచేత చుట్టబడి యుండునో అంతవరకు నోటినుండి మాటరాదు. (ఇక యౌవనావస్థను వివరించు చున్నాడు) యౌవ్వనవంతుడై కామ పరవశుడై సంగీతములు(రాగములు) నాలపించును. అకస్మాత్తుగా దన శక్తి సంపదపై గర్వించును. వృక్షముల పైకి ప్రాకును. శాంతులను కష్టపెట్టును. కామ - క్రోధ - మద - మాత్సర్యములతో యుక్తుడై ఒక్కరిని కూడా లెక్కచేయడు.


🌹  The Siva-Gita - 61  🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj


Chapter 08 :
🌻 Pindotpatti Kathanam - 7
🌻

The infant remains in Adhomukha form (having head downwards), and remains sorrowful after falling out of the vagina on its back.

Thereafter because of lack of strength or self sufficiency in self protection from dogs or any other dangers, it remains under the protection of its caretakers.

Because of ignorance [it loses its knowledge after few seconds of falling into this world] the child sees its father as a demon and the mother as a demoness and milk as the pious drink. Therefore the childhood is a difficult path.

Till the time the Sushumna nerve remains covered with sleshma (pleghm), till that time the child remains unable to speak. Next stage is adult age in which the child falls prey to lust and anger kind of negative qualities and becomes bound under attachments.

He also becomes proud of his strengths and wealth and soars high in the same. he doesn't leave anyone unaffected by his lust, anger, infatuation, etc. negative qualities

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివగీత #SivaGita

13 Sep 2020

No comments:

Post a Comment