✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని ఐదవ పాత్ర - పరిణామము - 10 🌻
165. పరిణామములో ఆత్మ యొక్క చైతన్యము ఒక స్థూల రూపము ద్వారా కొన్ని యుగముల పాటు భౌతిక ప్రపంచానుభావమును పొంది,యుగములనంతరము ఆ రూపమును విడచిపెట్టి, ఇంకను హెచ్చు చైతన్యమును, హెచ్చు అనుభవమును సంపదించుటకై తాను విడిచిపెట్టిన రూపము కంటె మరియొక హెచ్చు రూపమును తీసుకొనుచున్నది.
ఇట్లు:
శిల నుండి లోహమునకు
లోహము నుండి వృక్షసంతతి కి
వృక్షముల నుండి క్రిమి,కీటకాదులకు
క్రిమి కీటకముల నుండి మత్స్యములకు
మత్స్యముల నుండి పక్షులకు
పక్షుల నుండి జంతువులకు
జంతువుల నుండి మానవుల వరకు
రూపములను తీసికొన్నది. మానవ రూపముతో పరిణామము ఆగిపోయినది.
166.అభావము యొక్క అత్యంత పరిమితమైన 'తొలిసంస్కారము' కారణముగా -
అనంతుడు,
సంస్కారములు లేనివాడు,
నిరాకారుడు,
శాశ్వతుడు
అయిన పరమాత్ముడు - తనను
పరిమితుడననియు,
అణుమాత్రుడననియు,
ప్రాణిననియు,
జడముననియు
అనుభూతినొందుచున్నాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్ధర్శిని #అవతారమెహర్
13 Sep 2020
No comments:
Post a Comment