నారద భక్తి సూత్రాలు - 93

🌹.  నారద భక్తి సూత్రాలు - 93  🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్ధాధ్యాయం - సూత్రము - 64

🌻 64. అభిమాన దంభాదికం త్యాజ్యమ్‌ ॥ 🌻

నేను, నాది అనె స్వార్ధంతో కూడిన అభిమానాన్ని వదలాలి. గర్వం, దురహంకారం, దంభం, దర్పం, ఇవన్నీ భక్తి పెరగడానికి అద్దు వసాయి. దానికి బదులుగా వినయ, విధేయతలతో కూడిన క్షీణించిన అహంకారాన్ని ఆశ్రయించాలి.

నమత భావం, ఇతరుల యెడ గౌరవ భావం, ప్రవర్తనలో సభ్యత సంస్కారాలు, ఇటువంటి వాటిని అలవర్చుకోవాలి. ఇతరులలో ఉచ్చనీచాలను చూడరాదు. అందరి కంటె తానె తక్కువ అని అన్ని విషయాలలో తగ్గి ఉండాలి.

"హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. తనను తాను తగ్గించుకొను వాడు 'హెచ్చింపబడును” అని బైబిల్‌ వాక్యం.

లోక కల్యాణం కోసం చెసే సేవలోను, కించిత్‌ అహంకారం జనించ వచ్చును. “నేను ఈ మంచి పని చేశాను” అని కర్తృ భావం రావచ్చును. అప్పుడు భగవంతుడు నాకి అవకాశం ఇచ్చాడు గనుక అది నా భాగ్యం అని భావిస్తే అభిమాన దంభాలు వోతాయి.

భక్తుడు చెసే సేవ ప్రాచుర్యం కావచ్చును గాని, భక్తుడు మాత్రం తన పేరుకు ప్రాచుర్యం రావాలని కోరుకోకూడదు. తన ప్రమేయం లేకుండా తన కీర్తి వ్యాపిస్తే నిర్లిప్తంగా ఉండాలి. దీనులకు చేసే సేవ భగవత్యెంకర్యంగా ఉండాలి. ముఖ్యభక్తుడైన పిదప ఈ చెప్పినవేమీ పట్టవు. కాని సాధన దశలో ఇటువంటి జాగ్రత్తలు చాలా తీసుకోవాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

13 Sep 2020

No comments:

Post a Comment