🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
నవమాధ్యాయము
🌻. శరీర నిరూపణము - 1 🌻
శ్రీ భగవానువాచ :-
దేహ స్వరూపం వక్ష్యామి - శృణుష్వాన హితో నృప,
మత్తో హి జాయతే విశ్వం - మయై వైత త్ప్రధార్యతే 1
మయ్యేవేద మదిష్టానే - లీయ తే శుక్తి రౌప్యవత్;
అహం తు నిర్మలః - పూర్ణ స్సచ చిదానంద విగ్రహః 2
అ సంగో నిరహంకార - స్శుద్ధం బ్రహ్మ సనాతనమ్,
అనాద్య విద్యా యుక్త స్సన్ - జగత్కారణతాం వ్రజే 3
అనిర్వాచ్యా మహావిద్యా - త్రిగుణా రి ణామినీ,
రజ స్సత్వం తమ శ్చేతి - తద్గుణాః పరికీర్తితాః 4
సత్త్వం శుక్లం సమాది ష్టం - సుఖాజ్ఞానా స్పదం నృణామ్,
దుఃఖాస్పదం రక్త వర్ణం - చంచలం చ రజో మతమ్ 5
ఓ రామా! దేహ స్వరూపమును గురించి చెప్పుచున్నాను.
అవధాన మనస్కుడవై వినుము.
ఈ ప్రపంచ మంతయు నానుండి సృష్టింపబడుచున్నది. నానుండే రక్షింపబడుచున్నది. బ్రాంతికల్పిత మైన వెండి ముత్యపు చిప్పవలె ఈ ప్రపంచం మంతయు సర్వమునకు నాధారభూతుడవైన నాలోనే లయమగుచున్నది.
అయినను నేను నిర్మలుడను పరిపూర్ణుండను సచ్చిదానంద స్వరూపుడను, సాంగత్యము లేనివాడను అహంకారము లేనివాడను, సనాతనమగు బ్రహ్మమును, అనాదియగు అవిద్యతో కూడియున్న వాడనై ఈ ప్రపంచమంతటికి కారణభూతుడు నగుచున్నాను.
ఇట్టిదని చెప్పుటకు కూడా వీలుపడని గోప్పదగున విద్య త్రిగుణాత్మకము, పరిణామ స్వరూపము కలిగినది.
1 . తమోగుణము 2 . రజోగుణము 3 .
సత్వగుణ హులనియు ఈ మూడు మాయా గుణములని చెప్పబడినవి.
ఈ మూడింటిలో ౧. సత్వ గుణహు తెలుపు వర్ణము కలది.
ఇది మానవులకు సుఖమును, జ్ఞానమును కలుగచేయుచున్నది. రజో గుణహు ఎరుపు రంగు కలది, ఇది చంచలమైనది, దుఃఖమును కలుగ చేయును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 67 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 09 :
🌻 Deha Svarupa Nirnayam - 1 🌻
Sri Bhagawan said:
O Rama! Now I would explain you the Deha Swaroopam (form of the bodies), listen carefully! This entire universe is being created from me.
It's being protected by me, This entire universe is getting dissolved in me since I'm the support of this entire creation. Still then I'm pure, blemishless, selfdependent, truth, consciousness and complete.
I'm devoid of any duality, devoid of ego, I'm the eternal Brahman, and united with the eternal Avidya I'm becoming the cause for this entire universe.
Difficult of being defined in words, the great Vidya is composed of three qualities viz. Tamoguna, Rajoguna, and Satwaguna. These three are the qualities of Maya. Among these three Satva quality is of white color. It gives happiness and wisdom.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment