శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 14 / Sri Lalitha Chaitanya Vijnanam - 14

🌹. శ్రీ లలితా సహస్ర స్తోత్రము - 9 🌹


🌹.   శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 14 / Sri Lalitha Chaitanya Vijnanam - 14   🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

4. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీర మండిత

🌻 14. 'కురువిందమణిశ్రేణీ కనత్కోటీరమండితా' 🌻

పద్మరాగ మణులతో గూడి ప్రకాశించు కిరీటముచే నొప్పునది శ్రీ లలిత- అని భావము. ఈ మణుల కాంతి భక్తుల భక్తిప్రపత్తులను వృద్ధి గావించునని తెలియవలెను. గాయత్రి ప్రార్థనమున కూడ ఇట్టి మణుల కాంతిని ఆరాధించు సంప్రదాయము కలదు. గాయత్రి జపము చేయుటకు ముందు

“ముక్తా, విద్రుమ, హేమ, నీల, ధవళ, ఛాయ” వర్ణములను ధ్యానించుట ఇందులకే. ఇట్లు ధ్యానించుటచే భక్తి ప్రపత్తులు వృద్ధిపొంది, మంత్ర జపమున మనస్సు కాంతుల కాకర్షింపబడి రక్తి చెందును.

కురవింద శిలలనుండి పద్మరాగ మణులు పుట్టును. కురువింద స్ఫటికములు నది లోపలనుండు శిలలు. ఆ శిలల గర్భమునుండి మణులుద్భవించును. ఈ మణుల కాంతి సూర్యకాంతి వలెను,

చంద్రకాంతి వలెను, కెంపు, నీలము, పచ్చల కాంతుల వలెను మెరయు చుండును.

ఈ కాంతి అనురాగప్రదము. మనస్సున కాహ్లాదము కలిగించి బుద్ధి యనెడి వెలుగు లోకములలోకి అవి మనస్సు నాకర్షింప గలవు. ఇది కారణముగ దేవతా శిరస్సులను అలంకరించు మణిమయ కిరీటములను ధ్యానించు సత్సాంప్రదాయ మేర్పడినది. మణుల కాంతి స్ఫటిక శిలలనుండి పుట్టుటచే శుభమైన అనురాగము కలిగించును.

కామగుణము వానికి లేదు. వానిని స్మరించుట వలన భక్తి వృద్ధియగును. ఇట్టి మణుల పంక్తిచే ప్రకాశించు కిరీటముతో శ్రీదేవి అలంకరింపబడి యున్నదని ఈ నామము తెలుపుచున్నది.

శుద్ధమైన స్పటికముల నుండి వ్యక్తమగునది సప్త వర్ణములు కలిగిన సూర్యకాంతియే. స్ఫటికమునకు గల స్పష్టత వలన వాని నుండి కాంతి ప్రకాశము కలుగుచున్నది. సాధకుడు నిర్మలమైన మనస్సుతో కాంతిని ధ్యానము చేయుటచే తన నుండి కూడ అట్టి కాంతులు ప్రకాశితము లగును. సూర్యుడు ఆత్మకు ప్రతీక.

ఆత్మ శుద్ధమగు మనసేంద్రియ శరీరముల నుండి ప్రకాశించుటయే స్ఫటిక శిలల నుండి వికసించు కాంతులుగ తెలియవలెను. ఈ నామమున వర్ణముల (రంగుల) ధ్యానము ప్రత్యేకముగ ప్రతిపాదింపబడినది. ఈ ధ్యానము మనస్సును భక్తియందుంచి రక్తి కలిగించును.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹   Sri Lalitha Chaitanya Vijnanam - 14   🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Kuruvinda- maṇiśreṇī- kanat- koṭīra-maṇḍitā कुरुविन्द-मणिश्रेणी-कनत्-कोटीर-मण्डिता (14) 🌻

Kuruvinda is a rare type of ruby, which is red in colour. This particular type of ruby is said to enhance love, wealth and devotion for Viṣṇu (Viṣṇu is Her brother).

These rubies adorn Her crown. When She is meditated upon with this red crown, spirituality and prosperity will increase.

Saundarya Laharī (verse 42) says, “Why will not he, who extols your golden crown, closely stud with the twelve Suns (twelve āditya-s - dvādasa āditya-s, each āditya representing one solar month ) transformed into gems, form the idea that the digit of the (crescent) Moon, variegated by enveloping lustre of the inlaid gems, is but the bow of Indra (rainbow)?” Śrī Śaktī Mahimnaḥ (verse 42) also describes Her crown.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi


WhatsApp, Telegram, Facebook groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/



01 Oct 2020

No comments:

Post a Comment