🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయము 17
🌻. పూజావిధానము - 1 🌻
శ్రీరామ ఉవాచ :-
భగవనత్ పూజితః కుత్ర - కుత్ర వాత్వం పరసీ దసీ,
తద్భ్రూమి మామ జిజ్ఞాసా - వర్తతే మహితీ విభో. 1
మ్రుదావాగో మయే నాపి - భస్మ నాచం దనే నవా ,
సికతాభి ర్దా రుణావా - పాషా ణే నాపి నిర్మితా 2
లోహేన వాధ రంగేణ -కాంస్య కర్పూర పిత్తలై:,
తామ్ర రౌష్య సువర్ధైర్వా - రత్నైర్నావి ధైరపి 3
అధవా పారదే నైన - కర్పూరే ణాద వా కృతా,
ప్రతిమా శివలింగం వా - ద్రవ్యై రేతై: కృతం తు యత్ 4
తత్ర మాం పూజయే త్తేషు - ఫలం కోటి గుణోత్తరమ్ ,
మృద్దారు కాంస్య లో హైశ్చ -పాషాణే నాపి నిర్మితా .5
గృహిణా ప్రతిమా కార్యా - శివం శశ్వ దభీ ప్సతా,
ఆయుశ్శ్రియం కులం ధర్మం -పుత్రానాప్నోతి తై: క్రమాత్ 6
బిల్వ వృక్షే తత్ఫలె వా - యోమాం పూజయతే నరః,
పరాం శ్రియ మిహ ప్రాప్య - మను లోకే మహీయతే 7
బిల్వ వృక్షం సమాశ్రిత్య - యో మంత్రా న్విధి నా జపేత్,
ఏకేన దివసే నైవ - తత్పు రశ్చ రణం భవేత్ 8
యస్తు బిల్వ వనే నిత్యం -కుటీం కృత్వా వసేన్నరః,
సర్వే మంత్రా: ప్రసిధ్యంతి - జప మాత్రేణ కేవలమ్ 9
పర్వ తాగ్రే నదీ తీరే - బిల్వ మూలే శివాలయే,
అగ్ని హొత్రే కేశవస్య - సన్నిధౌ చ జపేత్తు యః 10
శ్రీరాముడు ప్రశ్నించు చున్నాడు. పరమ పూజ్యుడవైన ఓం శివా ! నీవు ఏయే పూజా స్థలములలో మేము భక్తితో చేయు పూజలందు కొనుటకు ఇష్ట పడెదవో సెలవిమ్మని యడిగెను.
అది విని శివుడు ఇలా ఆదేశించెను. మట్టి గోమయము భస్మము, చందనము, ఇసుక ,కర్ర ,రాయి, రత్నము పాదరసము తగరము వెండి బంగారము ఇత్తడి రాగి కర్పూరము కంచు మొదలగు వాటితో నాయాకారమును గాని లేదా లింగా కృతిని కాని చేసికొని పూజించినట్లైతే అట్టి భక్తునకు కోటి రెట్లు ప్రతి ఫలము లభించును.
గృహస్తునకు మాత్రము మృత్తు (మట్టి ) కంచు దారువు లోహము పాషాణము (రాయిశిల ) వీనితో చేయబడిన శివుని పూజ బహు శ్రేష్టమైనది. ఫలితముగా ఆయువు సంపద వంశము ధర్మము పుత్రులు క్రమముగా పై యాకృతులతో చేయబడిన శివుని భక్తి మీరగా పూజించిన ఫలించును.
బిల్వ వృక్షము నందు కాని, తత్ఫలము నందు గాని నన్ను పూజించిన వాడి హమందు గొప్ప సంపదను పొంది యంత్య కాలమున కైలాసమును చేరును. బిల్వ వృక్షము సమీపమున మంత్రములను జపించిన ఒక దినము నందే పురశ్చరణ పూర్తి ఫలము లభించును.
బిల్వ వనమున గుడిసె వేసుకొని నివసించినచో మంత్రములు జపించినంత మాత్రమున సిద్దించును. పర్వతాగ్రంబున, నది యొడ్డున మారేడు మూలమున, శివాలయంబు నను, అగ్ని సన్నిధిని హరి సన్నిధిని, జపించిన దానవ యక్ష రాక్షసులు మంత్ర జపమునకు
విఘ్నము చేయలేరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 The Siva-Gita - 125 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴
✍️ Ayala somayajula.
📚. Prasad Bharadwaj
Chapter 17
🌻 Puja Vidhanam - 1 🌻
Sri Rama said:
O venerable Lord! Kindly let me know which all places if you are worshiped by a devotee you get pleased.
Sri Bhagawan said: With soil, cow dung, holy ash, sandalwood paste, sand, wood, stone, gem, mercury, silver, gold, peetal (metal which resembles gold in color), bronze, karpooram, copper etc substances either my idol or Linga symbol when prepared and worshiped, for such a devotee billion times higher fruition would be given.
For a householder person, soil, bronze, iron, stone substances are the best ones for worshiping me.
As the consequent fruits, he gains long life, wealth, lineage (progeny), righteousness, and sons. If i am worshipped under a Bilva tree of in the bilva fruit, the devotee gains huge amount of wealth in the life and reaches Kailasham after his death.
If Mantras are chanted in front of a Bilva tree, in one day itself one gains the fruition of Purascharana Poorti. If one creates a hut in a grove of bilva trees and lives therein, he gains siddhi by just chanting the mantras.
On top of a hill, on the river bank, under a bilva tree, in a shiva temple, in the place of fire, in the place of vishnu, if someone chants my mantra, danavas, Yakshas, rakshasas kind of demons would not be able to bring any harm to the chanting being done, and that person remains untouched by sins and attains Shiva Sayujyam.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
27 Nov 2020
No comments:
Post a Comment