శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 46 / Sri Devi Mahatyam - Durga Saptasati - 46


🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 46 / Sri Devi Mahatyam - Durga Saptasati - 46 🌹

✍️. మల్లికార్జున శర్మ
📚. ప్రసాద్ భరద్వాజ


అధ్యాయము 12

🌻. ఫలశ్రుతి - 4 🌻


31–32. ఋషి పలికెను : ఇలా చెప్పి మహా పరాక్రమశాలిని అయిన చండికాదేవి అచటనే, దేవతలు చూస్తుండగనే, అంతర్జాన మొందెను.

33. శత్రువులు సంహరింపబడడంతో దేవతలు నిర్భయులై, వారందరూ తమ అధికారాలను గైకొని, తమ యజ్ఞ భాగాలు పాల్గొన్నారు.

34–35. అత్యంత భయంకరులు, అసమాన పరాక్రమశాలురు, మహాశూరులు, లోకాన్ని ధ్వంసం చేసినవారు అయిన దేవవైరులను, శుంభనిశుంభాసురులను -దేవి యుద్ధంలో వధించిన పిదప తక్కిన రాక్షసులు పాతాళానికి పారిపోయారు.

36. ఓ రాజా! మహాత్మురాలైన దేవి నిత్య (కలకాలపు ఉనికి గలది) అయినప్పటికీ, లోకసంరక్షణార్థం ఇలా పదే పదే అవతరిస్తుంది.

37. ఈ విశ్వం ఆమెచే సమ్మోహితం (అజ్ఞానంలో పడినది) అవుతుంది. ఆమెచేతనే ఇది సృజించబడుతుంది. ఆమె సంతుష్టి చెందితే తనును యాచించిన వారికి సమృద్ధిని ప్రసాదిస్తుంది, విజ్ఞానాన్ని (బ్రహ్మ జ్ఞానాన్ని) ఇస్తుంది.

38. ఓ రాజా! కాలపు చివరలో మహామారీ (ప్రళయకారిణీ) స్వరూపాన్ని పొంది ఆ మహాకాళి చేతనే ఈ బ్రహ్మాండమంతా నిండి ఉంటుంది.

39. పుట్టుకలేని ఆ నిత్యయైన దేవియే సకాలంలో మహామారి అవుతుంది; సకాలంలో సృష్టి రూపం చెందుతుంది; సకాలంలో భూతాలను పోషించే స్థితికారిణి అవుతుంది.

40. మంచికాలంలో మానవ గృహాలకు అభ్యుదయం ప్రసాదించే లక్ష్మి ఆమెయే. చెడుకాలంలో వినాశం కలిగించే అలక్ష్మి కూడా ఆమెయే.

41. స్తుతించబడి, పుష్పధూప గంధాదులతో చక్కగా పూజింప బడినప్పుడు ఆమె ద్రవ్యాన్ని, పుత్రులను, ధర్మబుద్ధిని, శుభ జీవనాన్ని ప్రసాదిస్తుంది.

శ్రీ మార్కండేయపురాణంలో సావర్ణిమన్వంతరంలో “దేవీ మాహాత్మ్యము” లోని "ఫలశ్రుతి” అనే ద్వాదశాధ్యాయము సమాప్తం.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Devi Mahatyam - Durga Saptasati - 46 🌹

✍️. P. R. Ramachander
📚 Prasad Bharadwaj


CHAPTER 12

🌻 Eulogy of the Merits - 4 🌻


The Rishi said:

31-32. Having spoken thus the adorable Chandika, fierce in prowess, vanished on that very spot even as the Devas were gazing one.

33. Their foes having been killed, all the devas also were delivered from fear; all of them resumed their own duties as before and participated in their shares of sacrifices.

34-35. When the exceedingly valorous Shumbha and Nishumbha, the most fierce foes of devas, who brought ruin on the world, and who were unparalleled in prowess had been slain by the Devi in battle, the remaining daityas went away to Patala.

36. Thus O King, the adorable Devi, although eternal, incarnating again and again, protects the world.

37. By her this universe is deluded, and it is she who creates this universe. And when entreated, she bestows supreme knowledge, and we propitiated, we bestows prosperity.

38. By her, the Mahakali, who takes the form of the great destroyer at the end of time, all this cosmic sphere is pervaded.

39. She indeed takes the form of the great destroyer at the (proper) time. She, the unborn, indeed becomes this creation (at the time proper for re-creation), She herself, the eternal Being, sustains the beings at (another) time.

40. In times of prosperity, she indeed is Lakshmi, who bestows prosperity in the homes of men; and in times of misfortune, she herself becomes the goddess of misfortune, and brings about ruin.

41. When praised and worshipped with flowers, incense, perfumes, etc., she bestows wealth and sons, and a mind bent on righteousness and prosperous life.

Here ends the twelfth chapter called ‘Eulogy of the Merits’ of Devi-mahatmya in the period of Markandya-purana, during the period of Savarni, the Manu.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


27 Nov 2020

No comments:

Post a Comment