10-FEB-2021 MORNING

1) 🌹 శ్రీమద్భగవద్గీత - 635 / Bhagavad-Gita - 635 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 280, 281 / Vishnu Sahasranama Contemplation - 280, 281🌹
3) 🌹 Daily Wisdom - 54🌹
4) 🌹. వివేక చూడామణి - 18🌹
5) 🌹Viveka Chudamani - 18🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 28🌹
7) 🌹. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 205 / Sri Lalita Chaitanya Vijnanam - 205🌹 
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 546 / Bhagavad-Gita - 546🌹 

 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 635 / Bhagavad-Gita - 635 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 52 🌴*

52. వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానస: |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత: ||

🌷. తాత్పర్యం : 
మితాహారము కలిగినవాడును, మనోవాక్కాయములను నియంత్రించువాడును, సమాధిస్థితి యందున్నవాడును, అసంగుడును, 

🌷. భాష్యము :
దేహాత్మభావన లేని కారణముగా మిథ్యాదర్పమునకు దూరుడై యుండు అతడు భగవానుడు ఒసగినదానిచే తృప్తుడగు చుండును. అట్టివాడు ఇంద్రియప్రీతి లభింపనప్పుడు క్రోధము చెందుట గాని, ఇంద్రియార్థములకై తీవ్రయత్నములు సలుపుట గాని చేయడు. 

ఈ విధముగా మిథ్యాహంకారము నుండి సంపూర్ణముగా విడివడినపుడు, భౌతికవిషయముల యెడ అతడు అనాసక్తుడగును. అదియే బ్రహ్మానుభవస్థితియై యున్నది. అట్టి స్థితియే “బ్రహ్మభూతస్థితి” యనబడును. 
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 635 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 52 🌴*

52. vivikta-sevī laghv-āśī
yata-vāk-kāya-mānasaḥ
dhyāna-yoga-paro nityaṁ
vairāgyaṁ samupāśritaḥ

🌷 Translation : 
who eats little, who controls his body, mind and power of speech, who is always in trance and who is detached,

🌹 Purport :
Because he has no bodily concept of life, he is not falsely proud. He is satisfied with everything that is offered to him by the grace of the Lord, and he is never angry in the absence of sense gratification. Nor does he endeavor to acquire sense objects. 

Thus when he is completely free from false ego, he becomes nonattached to all material things, and that is the stage of self-realization of Brahman. That stage is called the brahma-bhūta stage. 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 280, 281 / Vishnu Sahasranama Contemplation - 280, 281 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻280. మన్త్రః, मन्त्रः, Mantraḥ🌻*

*ఓం మన్త్రాయ నమః | ॐ मन्त्राय नमः | OM Mantrāya namaḥ*

శబ్దమూర్తిర్హరిర్మంత్రః ఋగ్యజుస్సామలక్షణః ।
అథవా మంత్ర బోధ్యత్వాన్మంత్ర ఇత్యుచ్యతే బుధైః ॥

ఋక్‍, యజుర్‍, సామ వేద మంత్రరూపుడు కావున 'మంత్రః' అనబడును. లేదా అట్టి వేదమంత్రములచేత తెలుపబడువాడు కావున 'ప్రతిపాద్య-ప్రతిపాదకతా' అనగా తెలుపబడునది, తెలుపునది అను సంబంధముచే విష్ణుడు 'మంత్రః' అనబడును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 280🌹*
📚. Prasad Bharadwaj 

*🌻280. Mantraḥ🌻*

*OM Mantrāya namaḥ*

Śabdamūrtirharirmaṃtraḥ r̥gyajussāmalakṣaṇaḥ,
Athavā maṃtra bodhyatvānmaṃtra ityucyate budhaiḥ.

शब्दमूर्तिर्हरिर्मंत्रः ऋग्यजुस्सामलक्षणः ।
अथवा मंत्र बोध्यत्वान्मंत्र इत्युच्यते बुधैः ॥

He is of the form of or One who manifests as the mantras of R̥k, Yajur and Sāma Vedas. Or as He is taught by the Vedas, He is Mantraḥ.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥

Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ ।Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 281 / Vishnu Sahasranama Contemplation - 281🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻281. చన్ద్రాంశుః, चन्द्रांशुः, Candrāṃśuḥ🌻*

*ఓం చన్ద్రాంశవే నమః | ॐ चन्द्रांशवे नमः | OM Candrāṃśave namaḥ*

చన్ద్రాంశుః, चन्द्रांशुः, Candrāṃśuḥ

సంసార తాప తిగ్మాంశు తాపతాపిత చేతసామ్ ।
స చంద్రాంశురివాహ్లాద కశ్చంద్రాంశు రుచ్యతే ॥

సూర్యుని తాపమువంటి సంసార తాపముచే తపింప చేయబడిన చిత్తము కలవారికి చంద్రకిరణమువలె ఆహ్లాదము కలిగించువాడు.

:: పోతన భాగవతము - దశమ స్కంధము, పూర్వభాగము ::
శా. నీ చుట్టాలకు నాపదల్ గలుగునే! నే మెల్ల నీవార; మ
     న్యాచారంబు లెరుంగ, మీశుఁడవు మా; కాభీలదావాగ్ని నేఁ
     డే చందంబున నింక దాఁటుదుము? మమ్మీక్షించి రక్షింప వ
     న్నా! చంద్రాభ! విపన్నులన్ శిఖివితానచ్ఛన్నులన్ ఖిన్నులన్‍. (745)

చందమామవలె చల్లనైన శ్రీకృష్ణా! నీ ఇష్టబంధువులకు ఇట్టి కష్టాలు కలుగవచ్చునా? మేమంతా నీవారమేగదా! ఇతరవిషయాలేమీ మాకు తెలియవు. మా ప్రభుడవు నీవే! ఈ దారుణమైన కారుచిచ్చును ఇప్పుడెలా దాటడం? మంటలలో తగుల్కొని అలమటిస్తున్న మమ్ము కన్నులెత్తి చూచి కాపాడు.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 281🌹*
📚. Prasad Bharadwaj 

*🌻281. Candrāṃśuḥ🌻*

*OM Candrāṃśave namaḥ*

Saṃsāra tāpa tigmāṃśu tāpatāpita cetasām,
Sa caṃdrāṃśurivāhlāda kaścaṃdrāṃśu rucyate.

संसार ताप तिग्मांशु तापतापित चेतसाम् ।
स चंद्रांशुरिवाह्लाद कश्चंद्रांशु रुच्यते ॥

Just as the moonlight gives relief to men scorched in the heat of sun, He gives relief and shelter to those who are subjected to the heat of saṃsāra or worldy existence.

Śrīmad Bhāgavata - Canto 7, Chapter 8
Divispr̥śatkāyamadīrghapīvara grīvoruvakṣaḥ sthalamalpamadhyamam,
Candrāṃśugauraiśchuritaṃ tanūruhairviṣvagbhujānīkaśataṃ nakhāyudham. (22)

:: श्रीमद्भागवत - सप्तमस्कन्धे, अष्टमोऽध्यायः ::
दिविस्पृशत्कायमदीर्घपीवर ग्रीवोरुवक्षः स्थलमल्पमध्यमम् ।
चन्द्रांशुगौरैश्छुरितं तनूरुहैर्विष्वग्भुजानीकशतं नखायुधम् ॥ २२ ॥

His entire body touched the sky. His neck was very short and thick, His chest broad, His waist thin, and the hairs on His body as white as the rays of the moon. His arms, which resembled flanks of soldiers, spread in all directions

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
ओजस्तेजोद्युतिधरः प्रकाशात्मा प्रतापनः ।बुद्धस्स्पष्टाक्षरो मन्त्र श्चन्द्रांशुर्भास्करद्युतिः ॥ ३० ॥

ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।బుద్ధస్స్పష్టాక్షరో మన్త్ర శ్చన్ద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౩౦ ॥

Ojastejodyutidharaḥ prakāśātmā pratāpanaḥ ।Buddhasspaṣṭākṣaro mantra ścandrāṃśurbhāskaradyutiḥ ॥ 30 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 54 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 23. Universal Self-Awareness 🌻*

There is a Universal Self-Awareness at this stage of the satisfaction that arises from consciousness in its essentiality. This joy-experience is sananda samapatti. The Self-Consciousness which is attending upon this joy universal is sasmita samapatti. Here the efforts of the individual do not continue. 

One need not have to struggle to meditate. There is no effort on the part of a person, because there is no person at all. Individuality is carried by the current of the universe, of God Himself, if we would call it so. 

One is possessed by a Power that is super-individual. One is no more oneself, and therefore one has no responsibility over oneself. Hence, there is nothing that one can or need do. The very question of ‘doing’ ceases, as the individual is not there as a person.  

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. వివేక చూడామణి - 18 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

*🍀. పంచభూతాలు - 1 🍀*

74. పంచభూతాలతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రతి భూతము రెండు భాగాలై, ఒక భాగములో ఆ భూతము యొక్క సగ భాగము, మిగిలిన సగము మిగిలిన నాల్గు భాగములలోని ఎనిమిదవ భాగములతో కూడి ఉన్నది. 

ప్రతి భూతములో ఐదు భూతాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు భూమిలో పదార్థము సగము, మిగిలిన సగము మిగిలిన నాలుగు భూతములతో కూడినవి. ఈ స్థూల శరీరము ఐదు భూతములతో పైన తెల్పినట్లు రూపొంది స్థూలమైనది. 

ఈ స్థూల శరీరము ఐదు తన్మాత్రలతో కూడినది. భూమి యొక్క తన్మాత్ర వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశానికి శబ్దము. ఈ ఐదు తన్మాత్రల ద్వారా జీవాత్మ తత్‌సంబంధమైన ఆనందాలను, దుఃఖాలను పొందుచున్నది.

75. ఎవరైతే ఈ జ్ఞానేంద్రియములకు చెందిన వస్తు సముదాయములతో చిక్కుకుని ఉన్నారో వారు పిచ్చివారు. వారు జన్మ, మరణ, దుఃఖముల నుండి బయటపడలేరు. 

వారిలో మంచి పనులు చేసిన వారు దివ్యాత్మలుగా స్వర్గ సుఖాలను అనుభవించి మరల మానవ జన్మ ఎత్తవలసి వస్తుంది. చెడు పనులు చేసిన వారు నరకములో దుఃఖాలను అనుభవించి చెట్లు, చేమలుగా జన్మించి మరల మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 VIVEKA CHUDAMANI - 18 🌹* 
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj 

*🌻 Five Elements- 1 🌻*

74. Being united with parts of one another and becoming gross, (they) form the gross body. And their subtle essences form sense-objects –the group of five such as sound, which conduce to the happiness of the experiencer, the individual soul.

75. Those fools who are tied to these sense-objects by the stout cord of attachment, so very difficult to snap, come and depart, up and down, carried amain by the powerful emissary of their past action.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. దేవాపి మహర్షి బోధనలు - 28 🌹* 
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 19. కుమారో బుధః 🌻*

సూర్యుడు సత్యలోకమును, బుధుడు రజోలోకమును, చంద్రుడు దృశ్యమాన జగత్తును అధిష్ఠించియున్న దేవతలు. వీరు వరుసగా సత్వము, రజస్సు, తమస్సు గుణములకు కూడ అధి దేవతలు. సూర్యుడు ప్రఖకు అధిదేవత, చంద్రుడు పదార్థమునకు అధిదేవత. వీరిద్దరి సంయోగము ఏర్పడు జీవులకు బుధుడు అధి దేవత. వారు సహజముగ రజోమూర్తులు. అనగా వెలుగు మూర్తులు. 

'కుమారో బుధః' అని వేదము తెలుపుచున్నది. సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి. సూర్యప్రజ్ఞ చంద్రునిద్వారా మరల పుట్టుటయే కుమారప్రజ్ఞ లేక బుధప్రజ్ఞ. బుధుడు మానససృష్టికి ప్రతీకగ
నిలబడును. తండ్రికి సమీపముగ నుండును. రాశి చక్రమున గూడ సూర్యునికి అత్యంత సమీపమున సంచరించు గ్రహము బుధుడే. 

తండ్రియే కొడుకుగ దిగివచ్చెనని, తల్లి ద్వారమున దిగివచ్చెనని అందుచే దిగివచ్చిన వాడు స్వతస్సిద్ధముగ తండ్రియే అని తెలియ వలెను. 'ఆత్మావైపుత్రనామాసి' అను వాక్యమున ఈ సూత్రము తెలుపబడినది. పై త్రిభుజమును ధ్యానించినచో ఈ సత్యము తెలియనగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్‌, 📚. ప్రసాద్ భరద్వాజ

భయం, అపరాధం ఒకటి కాదు. అంగీకరించిన భయం స్వేచ్ఛగా మారుతుంది. ఖండించిన, తిరస్కరించిన, నిరాకరించిన భయం అపరాధంగా మారుతుంది.

నిజానికి, భయం పరిస్థితిలో ఒక భాగం మాత్రమే. అలాగే, ఈ సువిశాల సర్వస్వంలో మనిషి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. అంటే, ఈ సర్వస్వమంతా సముద్రమైతే మనిషి అందులో ఒక చిన్న నీటి బొట్టన్నమాట. 

అందుకే ‘‘నేను నా గుర్తింపును కోల్పోయి ఈ సర్వస్వంలో లీనమై నాశనమవుతానేమో’’ అనే భయం మీలో కలుగుతుంది. అదే మృత్యుభయం. అందుకే మీలో వణుకుపుడుతుంది. కాబట్టి, అన్ని భయాలు మృత్యుభయాలే.
మనిషి అలా భయంతో వణికిపోవడం సహజమే. 

ఆ సహజత్వాన్ని మీరు సంపూర్ణంగా అంగీకరించినట్లైతే వెంటనే మీ వణుకు తగ్గిపోతుంది, మీ భయం స్వేచ్ఛగా మారుతుంది. అప్పుడు నీటిబొట్టు సముద్రంలో కలిసినా ‘‘అది అక్కడే ఉంది’’అనే భావన మీలో కలుగుతుంది. నిజానికి, ఆ నీటి బొట్టే సముద్రమయింది. అలా మృత్యువు నిర్వాణమవుతుంది. అప్పుడు నాశనమయేందుకు మీరు ఏమాత్రం భయపడరు.

‘‘జీవితాన్ని కాపాడుకుంటే మీరు దానిని కోల్పోతారు. జీవితాన్ని కోల్పోతే మీరు దానిని కాపాడుకుంటారు’’ అని చెప్పిన జీసస్ మాటలు అప్పుడు మీకు అర్థమవుతాయి. 

కాబట్టి, మృత్యువును అధిగమించేందుకున్న ఏకైక మార్గం దానిని అంగీకరించడమే. అప్పుడే అది అదృశ్యమవుతుంది. అలాగే, భయాన్ని అధిగమించేందుకున్న ఏకైక మార్గం దానిని అంగీకరించడమే. అప్పుడే మీలో ఉన్న భయం అదృశ్యమవుతుంది. అప్పుడు మీలో ఉన్న శక్తి విడుదలై స్వేచ్ఛగా మారుతుంది. కానీ, మీరు మీలోని భయాన్ని ఖండిస్తూ, అణిచేస్తూ, మీరు భయపడుతున్న నిజాన్ని దాచేస్తూ, మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నప్పుడు మీలో ‘‘అపరాధం’’ పుడుతుంది.

మీరు అంగీకరించనిది, ప్రకృతికి విరుద్ధంగా అణచి వేయబడ్డదేదైనా మీలో అపరాధాన్ని సృష్టిస్తుంది. అప్పుడు మీరు ‘‘మీకు, ఇతరులకు’’ అబద్ధాలు చెప్తున్నట్లు తెలియడంతో మీరు అపరాధ భావనకు గురి అవుతారు. మీలోని ఆ అప్రమాణికతే అపరాధం.

‘‘భయం, అపరాధం ఒకటేనా?’’అని మీరు అడుగుతున్నారు. అవి రెండూ ఒకటికాదు. ఒకవేళ భయం అపరాధంగా కనిపించినా అది అలాంటిది కాకపోవచ్చు. అది మీరు భయపడుతూ చేసే దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు భయపడుతూ ఏదైనాతప్పుచేస్తే అది అపరాధంగా మారుతుంది. కానీ, మీరు మీ భయాన్ని అంగీకరిస్తూ ఏ తప్పుచెయ్యకుండా ఉన్నట్లైతే- నిజానికి చేసేందుకేమీ ఉండదు-అది స్వేచ్ఛగా, నిర్భయత్వంగా మారుతుంది.

మీరు చాలా వికారంగా ఉన్నారని, తప్పులుచేసిన పాపాత్ములని భావిస్తూ మిమ్మల్ని మీరు ఎప్పుడూ నిందించుకోకండి. మీరెలాంటివారైనా మీరు మీరే. కాబట్టి, మీరు ఎప్పుడూ అపరాధిగా భావించకండి. ఆ భావనలో ఉండకండి. ఒకవేళ మీరు తప్పుచేసినా అది మీ తప్పుకాదు. బహుశా, మీరు అలా నటించి ఉండవచ్చు. అంతమాత్రాన, మీరు తప్పుచేసినట్లు కాదు. కొన్ని చర్యలు తప్పుకావచ్చు. కానీ, మీ ఉనికి ఎప్పుడూ ఒప్పుగానే ఉంటుంది.

‘‘నాకు చాలా శక్తి ఉందని, నేను చాలా ముఖ్యమైన వాడినని’’ ఇతరులను ఒప్పించేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తున్నట్లుగా నా గురించి నేను తెలుసుకున్నాను. అందుకుగల కారణాలపై నేను ధ్యానం చేశాను. అది భయమని నేననుకుంటున్నాను.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 205 / Sri Lalitha Chaitanya Vijnanam - 205 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀. పూర్తి శ్లోకము :*
*సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |*
*మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖*

*🌻 205. 'సర్వ యంత్రాత్మికా' 🌻*

అన్ని యంత్రముల మూలము శ్రీదేవి అని అర్థము.

యంత్రములు సృష్టి వ్యూహములు. అవి వరుసగా బిందువు, వృత్తము, త్రిభుజము, చతుర్భుజము, పంచభుజము, షష్ఠభుజము, అష్టభుజము ఆదిగా ఏర్పడుచుండును. ఈ వ్యూహముల నుండియే శ్రీదేవి సమస్త సృష్టిగ ప్రకాశించును. 

యంత్రముల రూపములు కూడ పై తెలిపిన ఆకారములతో యుండును. ఈ యంత్ర వ్యూహము లన్నియూ కూడ శ్రీదేవి నుండియే దిగివచ్చినవి. మంత్రము లాధారముగ యంత్రము లేర్పడును. 

యంత్రము లాధారముగ మంత్రములు సిద్ధించును (అవతరించును). ఈ యంత్రములకు ఆత్మగ శ్రీదేవియే యున్నది. కావున ఆమె యంత్రాత్మికా, శబ్దముల ద్వారా యంత్రముల నుండి అవతరించి రూపు కట్టుకొనునది కూడ శ్రీదేవియే. అందువలన ఆమె మంత్ర స్వరూపిణి. మంత్రము రూపముగను, యంత్రము ఆత్మగను కూడ విరాజిల్లు చున్నది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 205 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 Sarva-yantrātmikā सर्व-यन्त्रात्मिका (205) 🌻*

She is in all the yantra-s. Different gods and goddesses have different yantra-s. Yantra is normally a metallic plate made out of gold, silver or copper or a combination of these, wherein several lines are drawn to crisscross each other. The potency of a mantra is infused into a yantra by means of rituals. 

These yantra-s represent the respective gods. A properly consecrated yantra becomes powerful and its power increases along with the increase in the counts of mantra-s. Since She is sarva-mayī (nāma 203), She is said to be in all yantra-s. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత - 546 / Bhagavad-Gita - 546 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 9 🌴*

09. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయ: |
ప్రభవన్త్యుగ్రకర్మాణ: క్షయాయ జగతోహితా: ||

🌷. తాత్పర్యం : 
నష్టాత్ములును, అల్పబుద్దులును అగు అసురస్వభావము గలవారు ఇట్టి అభిప్రాయములనే అనుసరించుచు ఆహితములును, జగద్వినాశకరములును అగు ఘోరకర్మలలో నియుక్తులగుదురు.

🌷. భాష్యము :
అసురస్వభావము గలవారు ప్రపంచనాశకర కర్మల యందే నియుక్తులై యుందురు. అట్టివారిని శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట అల్పబుద్ధులని తెలుపుచున్నాడు. భగవద్భావన ఏమాత్రము లేనటువంటి ఆ భౌతికవాదులు తాము పురోభివృద్ది చెందుచున్నట్లు తలచినను భగవద్గీత ప్రకారము వారు అల్పబుద్ధులు మరియు జ్ఞానము లేనట్టివారే యగుదురు. 

భౌతికజగము నందు సాధ్యమైనంతవరకు సుఖము ననుభవింపవలెనని యత్నింపగోరుటచే ఇంద్రియతృప్తికి ఏదియో ఒక క్రొత్తదానిని కనిపెట్టుట యందు వారు సదా నిమగ్నులై యుందురు. అట్టి భౌతికపరిశోధన ఫలితములు మాత్రము జనులు మరింత హింసాప్రాయులుగా, క్రూరులుగా తయారగుచున్నారు. జనులు హింసామనస్కులై జంతువుల యెడ, ఇతర మానవుల యెడ హింసాప్రవృత్తిని వృద్దిచేసికొనుచున్నారు. 

ఇతర జీవులయెడ ఏ విధముగా వర్తించవలెనో వారు ఎరుగజాలకున్నారు. అట్టి అసురస్వభావుల యందు జంతుహింస మిక్కిలి ప్రముఖమై యుండును. తమ పరిశోధనల ద్వారా సర్వులకు వినాశనము కూర్చునదేదో తయారుచేయనున్నందున లేదా కనిపెట్టకున్నందున అట్టివారు ప్రపంచమునకు శత్రువులుగా పరిగణింపబడుదురు. అనగా అణ్వాయుధముల సృష్టి నేడు సమస్త ప్రపంచమునకు గర్వకారణమైనను, యుద్దారంభమైనంతనే అవి ఘోరవిపత్తును సృష్టింపగలవు. 

అట్టి యుద్ధము ఏ క్షణమునందైనను కలుగవచ్చును. అట్టివి కేవలము ప్రపంచ వినాశనముకే సృష్టింపబడునని ఇచ్చట పేర్కొనబడినది. భవద్భావన లేకపోవుట చేతనే అట్టి మారణాయుధములు మానవసమాజమున సృష్టింపబడుచున్నవి. అవి ఎన్నడును ప్రపంచ శాంతి, పురోగతులకు దోహదములు కాజాలవు.
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 546 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 09 🌴*

09. etāṁ dṛṣṭim avaṣṭabhya
naṣṭātmāno ’lpa-buddhayaḥ
prabhavanty ugra-karmāṇaḥ
kṣayāya jagato ’hitāḥ

🌷 Translation : 
Following such conclusions, the demoniac, who are lost to themselves and who have no intelligence, engage in unbeneficial, horrible works meant to destroy the world.

🌹 Purport :
The demoniac are engaged in activities that will lead the world to destruction. The Lord states here that they are less intelligent. The materialists, who have no concept of God, think that they are advancing. But according to Bhagavad-gītā, they are unintelligent and devoid of all sense. They try to enjoy this material world to the utmost limit and therefore always engage in inventing something for sense gratification. 

Such materialistic inventions are considered to be advancement of human civilization, but the result is that people grow more and more violent and more and more cruel, cruel to animals and cruel to other human beings. They have no idea how to behave toward one another. Animal killing is very prominent amongst demoniac people. Such people are considered the enemies of the world because ultimately they will invent or create something which will bring destruction to all. 

Indirectly, this verse anticipates the invention of nuclear weapons, of which the whole world is today very proud. At any moment war may take place, and these atomic weapons may create havoc. Such things are created solely for the destruction of the world, and this is indicated here. Due to godlessness, such weapons are invented in human society; they are not meant for the peace and prosperity of the world.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment