శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 205 / Sri Lalitha Chaitanya Vijnanam - 205

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 205 / Sri Lalitha Chaitanya Vijnanam - 205 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

మూల మంత్రము : 
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖

🌻 205. 'సర్వ యంత్రాత్మికా' 🌻

అన్ని యంత్రముల మూలము శ్రీదేవి అని అర్థము.

యంత్రములు సృష్టి వ్యూహములు. అవి వరుసగా బిందువు, వృత్తము, త్రిభుజము, చతుర్భుజము, పంచభుజము, షష్ఠభుజము, అష్టభుజము ఆదిగా ఏర్పడుచుండును. ఈ వ్యూహముల నుండియే శ్రీదేవి సమస్త సృష్టిగ ప్రకాశించును. 

యంత్రముల రూపములు కూడ పై తెలిపిన ఆకారములతో యుండును. ఈ యంత్ర వ్యూహము లన్నియూ కూడ శ్రీదేవి నుండియే దిగివచ్చినవి. మంత్రము లాధారముగ యంత్రము లేర్పడును. 

యంత్రము లాధారముగ మంత్రములు సిద్ధించును (అవతరించును). ఈ యంత్రములకు ఆత్మగ శ్రీదేవియే యున్నది. కావున ఆమె యంత్రాత్మికా, శబ్దముల ద్వారా యంత్రముల నుండి అవతరించి రూపు కట్టుకొనునది కూడ శ్రీదేవియే. అందువలన ఆమె మంత్ర స్వరూపిణి. మంత్రము రూపముగను, యంత్రము ఆత్మగను కూడ విరాజిల్లు చున్నది. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 205 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

🌻 Sarva-yantrātmikā सर्व-यन्त्रात्मिका (205) 🌻

She is in all the yantra-s. Different gods and goddesses have different yantra-s. Yantra is normally a metallic plate made out of gold, silver or copper or a combination of these, wherein several lines are drawn to crisscross each other. The potency of a mantra is infused into a yantra by means of rituals. 

These yantra-s represent the respective gods. A properly consecrated yantra becomes powerful and its power increases along with the increase in the counts of mantra-s. Since She is sarva-mayī (nāma 203), She is said to be in all yantra-s. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

10 Feb 2021

No comments:

Post a Comment