✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. పంచభూతాలు - 1 🍀
74. పంచభూతాలతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రతి భూతము రెండు భాగాలై, ఒక భాగములో ఆ భూతము యొక్క సగ భాగము, మిగిలిన సగము మిగిలిన నాల్గు భాగములలోని ఎనిమిదవ భాగములతో కూడి ఉన్నది.
ప్రతి భూతములో ఐదు భూతాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు భూమిలో పదార్థము సగము, మిగిలిన సగము మిగిలిన నాలుగు భూతములతో కూడినవి. ఈ స్థూల శరీరము ఐదు భూతములతో పైన తెల్పినట్లు రూపొంది స్థూలమైనది.
ఈ స్థూల శరీరము ఐదు తన్మాత్రలతో కూడినది. భూమి యొక్క తన్మాత్ర వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశానికి శబ్దము. ఈ ఐదు తన్మాత్రల ద్వారా జీవాత్మ తత్‌సంబంధమైన ఆనందాలను, దుఃఖాలను పొందుచున్నది.
75. ఎవరైతే ఈ జ్ఞానేంద్రియములకు చెందిన వస్తు సముదాయములతో చిక్కుకుని ఉన్నారో వారు పిచ్చివారు. వారు జన్మ, మరణ, దుఃఖముల నుండి బయటపడలేరు.
వారిలో మంచి పనులు చేసిన వారు దివ్యాత్మలుగా స్వర్గ సుఖాలను అనుభవించి మరల మానవ జన్మ ఎత్తవలసి వస్తుంది. చెడు పనులు చేసిన వారు నరకములో దుఃఖాలను అనుభవించి చెట్లు, చేమలుగా జన్మించి మరల మానవ జన్మ ఎత్తవలసి ఉంటుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 18 🌹
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
🌻 Five Elements- 1 🌻
74. Being united with parts of one another and becoming gross, (they) form the gross body. And their subtle essences form sense-objects –the group of five such as sound, which conduce to the happiness of the experiencer, the individual soul.
75. Those fools who are tied to these sense-objects by the stout cord of attachment, so very difficult to snap, come and depart, up and down, carried amain by the powerful emissary of their past action.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
10 Feb 2021
No comments:
Post a Comment