✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 19. కుమారో బుధః 🌻
సూర్యుడు సత్యలోకమును, బుధుడు రజోలోకమును, చంద్రుడు దృశ్యమాన జగత్తును అధిష్ఠించియున్న దేవతలు. వీరు వరుసగా సత్వము, రజస్సు, తమస్సు గుణములకు కూడ అధి దేవతలు. సూర్యుడు ప్రఖకు అధిదేవత, చంద్రుడు పదార్థమునకు అధిదేవత. వీరిద్దరి సంయోగము ఏర్పడు జీవులకు బుధుడు అధి దేవత. వారు సహజముగ రజోమూర్తులు. అనగా వెలుగు మూర్తులు.
'కుమారో బుధః' అని వేదము తెలుపుచున్నది. సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి. సూర్యప్రజ్ఞ చంద్రునిద్వారా మరల పుట్టుటయే కుమారప్రజ్ఞ లేక బుధప్రజ్ఞ. బుధుడు మానససృష్టికి ప్రతీకగ
నిలబడును. తండ్రికి సమీపముగ నుండును. రాశి చక్రమున గూడ సూర్యునికి అత్యంత సమీపమున సంచరించు గ్రహము బుధుడే.
తండ్రియే కొడుకుగ దిగివచ్చెనని, తల్లి ద్వారమున దిగివచ్చెనని అందుచే దిగివచ్చిన వాడు స్వతస్సిద్ధముగ తండ్రియే అని తెలియ వలెను. 'ఆత్మావైపుత్రనామాసి' అను వాక్యమున ఈ సూత్రము తెలుపబడినది. పై త్రిభుజమును ధ్యానించినచో ఈ సత్యము తెలియనగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
10 Feb 2021
No comments:
Post a Comment