వివేక చూడామణి - 10 / Viveka Chudamani - 10


🌹. వివేక చూడామణి - 10 🌹

✍️ రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ


🍀. ప్రశ్న, జవాబు - 1 🍀


48. శిష్యుడు గురువుగారిని ఈ విధముగా ప్రశ్నించును. దయయుంచి నేను అడిగే ఈ క్రింది ప్రశ్నకు సమాధానమును తమ నోటి ద్వారా వినాలని కోరుచున్నాను.

49. బంధనమనగా నేమి? అది ఎలా ఆత్మను పట్టి ఉంచింది? అది ఎలా కొనసాగుతుంది? ఎవరైన దాని నుండి ఎలా విముక్తి పొందగలరు? అనాత్మ అంటే ఏమిటి? ఉన్నతమైన ఆత్మ ఎవరు? ఆత్మ అనాత్మల భేదమును ఎలా తెలుసుకొనగలము? ఈ విషయములన్నింటిని వివరించవలసినదిగా కోరుచున్నాము.

50. గురువు ఈ విధముగా సమాధానము చెప్పుచున్నాడు.

ఇలాంటి ప్రశ్నలు అడిగినందుకు భగవంతుడు నిన్ను దీవించుగాక! నీవు జీవితములో ఉన్నత స్థితిని చేరుకున్నావు. నీ కుటుంబమును పవిత్ర పర్చినావు. అజ్ఞాన బంధనాల నుండి విడివడి బ్రహ్మత్వమును పొంది యున్నావు.

51. ఒక తండ్రి తన కుటింబీకులందరిని అప్పుల బంధనాల నుండి విముక్తి కలిగించుగాక. కాని తనను తాను తన బంధనాల నుండి విముక్తి పొందియుండలేదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 10 🌹

✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj


🌻 Question and Answer - 1 🌻

48. Condescend to listen, O Master, to the question I am putting (to thee). I shall begratified to hear a reply to the same from thy lips.

49. What is bondage, forsooth ? How has it come (upon the Self) ? How does itcontinue to exist ? How is one freed from it ? What is this non-Self ? And who is the Supreme Self ? And how can one discriminate between them ? -- Do tell me about all these.

50. The Guru replied: Blessed art thou ! Thou hast achieved thy life’s end and hastsanctified thy family, that thou wishest to attain Brahmanhood by getting free from the bondage of Ignorance !

51. A father has got his sons and others to free him from his debts, but he has got none but himself to remove his bondage.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


02 Feb 2021

No comments:

Post a Comment