దేవాపి మహర్షి బోధనలు - 20


🌹. దేవాపి మహర్షి బోధనలు - 20 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻 11. సూర్యచంద్ర లోకములు 🌻


సూః + యః = సూర్యః. ఎవడు వృద్ధి యగుచున్నాడో అతడే సూర్యుడు. అతడు సృష్టికి కేంద్రము. అనగా బీజప్రాయ మగు సంసార వృక్షమునకు మూలరూపము. ఇతడు తూర్పున ఉదయించును.

తూర్పు అనగా భూమి, ఆకాశములు కలిసిన చోటు అనగా కశ్యపుడు, అదితి కలిసిన చోటు. అచట సూర్యుడుగ ఉదయించును. అతడు చీకటినుండి పుట్టును గాని, యతడు పుట్టిన వెనుక చీకటి యుండదు. అతడు లోక చక్షువు.

అతడు పుట్టిన వెనుక లోకము లుండునుగాని, అంతకుముందు లోకముండదు. అంతకు ముందు లోకములు నిద్రలో ఉండును. అతడు నిన్న ఉదయించిన తావుననే ఉదయించినట్లు ఉండును కాని, ఏనాటికానాడు ఒక క్రొత్త శిశువు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


02 Feb 2021

No comments:

Post a Comment