శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 209 / Sri Lalitha Chaitanya Vijnanam - 209


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 209 / Sri Lalitha Chaitanya Vijnanam - 209 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀. పూర్తి శ్లోకము :

సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖



🌻 209. 'మహాదేవీ" 🌻

అనంతమగు వెలుగుతో కూడిన శరీరము కలది శ్రీదేవి అని అర్థము. అనంతముగ పూజింపదగిన వెలుగు శరీరము కలది శ్రీదేవి అని అర్థము. శ్రీదేవి శరీర మనంతము. అనగా అంతము లేనిది. సృష్టియే ఆమె శరీరము. ఎన్ని సృష్టులు ఆమె నుండి జరుగుచున్నవో బ్రహ్మాదుల కైనను అంతు పట్టదు. కావున ఆమె శరీరము మొత్తము త్రిమూర్తులకు కూడ తెలియదని దేవీ పురాణము తెలుపుచున్నది. అట్టి శరీరము కలది కనుక ఆమె మహాదేవి.

ఆమె వెలుగుకూడ అట్టిదియే కనుక మహాదేవి అని తెలియనగును. త్రిమూర్తులు సహితము ఆమె మొత్తము వెలుగును చూడజాలరు. ఇక దేవతల మాట ఏల? సర్వదేవతలకు ఆమె దేవి కనుక మహాదేవి. ఆమె శరీరము కొలతలే తెలియలేము. అంతియే కాదు, ఆమెకు అంతము లేదు. అనగా స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమమూయై యుండును.

అపారమగు ఆమె శరీరము ఎట్టి కొలతల చేతను కొలవబడనిది అని దేవీ పురాణము కీర్తించును. అట్టి మహత్వము కల దేవి మహతీదేవి లేక మహాదేవి. మహత్వమనగా ప్రమాణముచే తెలియ దగనిది లేక పొంద దగనిది. మహా అను పదమునకు ఆరాధన అని కూడ అర్థము కలదు. ఆమె అనంతముగ పూజింపదగిన దేవి. రోహిణీదేవిని కూడ మహాదేవి అని పిలుతురు.

సోమాత్మకుడైన మహాదేవుని భార్య రోహిణి, సృష్టి యందు అత్యంత సౌమ్యము, కోమలము, సుందరముగ రోహిణీ దేవి ప్రకాశించు చుండును. శ్రీకృష్ణుని శరీర సౌందర్యము, కోమలత్వము ఋషులు కూడ వర్ణింపలేరైరి. దానికి కారణము అతడు మహాదేవి యగు రోహిణి నుండి దిగివచ్చుటయే.

బ్రహ్మ నిష్ఠాగరిష్టులైన ఋషులు కూడ శ్రీకృష్ణుని జూచి మోహ పరవశులైరి. ఇది మహాదేవి రోహిణి మహత్తు. పున్నమి చంద్రుని కాంతికే జీవులు పరవశు లగుదురు. అట్టి చంద్రుని కోమలత, సౌమ్యత, సుందరతల కన్న ఎనిమిది రెట్లు ఎక్కువైనది రోహిణి అని వాయు పురాణము తెలుపుచున్నది. మహాదేవిని అనంతముగ పూజించుచునే యుండవలెను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 209 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Mahādevī महादेवी (209) 🌻

Śiva is also known as Mahādeva, His moon form (this is said to be the eighth form of Śiva. His wife is Rohinī and their son is Budha, the planet Mercury) and his wife is Mahādevi. Maha also means the Supreme. She is the Supreme and hence called Mahādevi.

Śiva has eight forms and they are – 1. Sarva – earth form, 2. Bhava-water form, 3. Rudra – fire form, 4. Ugra – wind form, 5. Bhīma- ākāśa form, 6. Paśupati – soul form, 7. Īśāna – sun form and 8. Mahādeva –moon form. These eight forms of Śiva are His cosmic forms (Liṅga Purāṇa).

It is pertinent to note that both Śiva and Śaktī have moon in their crowns. Moon indicates two qualities, one is its coolness and another is intelligence.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


14 Feb 2021

No comments:

Post a Comment