వివేక చూడామణి - 22 / VIVEKA CHUDAMANI - 22


🌹. వివేక చూడామణి - 22 🌹

✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. పంచభూతాలు - 5 🍀


85. అందువలన విముక్తి పొందిన సాధకుడు దేహాభిమానము కలిగి ఉన్న, లేక దేహమే తానని భావించిన అది బయంకరమైన చావుతో సమానము. ఎవరైతే పూర్తిగా శారీరక వ్యామోహమును జయిస్తాడో అతడే పూర్తిగా స్వేచ్ఛను పొందగలడు.

86. ఘోరమైన చావును జయించాలంటే శరీరమే తానను భావన, భార్య, పిల్లలు మొదలగు భౌతిక బంధనాలను జయించి ఉన్నతమైన దైవ స్థితిని పొందాలి.

87. ఈ శరీరము మొత్తము నికృష్టమైనది. ఎందువలనంటే అది చర్మము, మాంసము, రక్తము, నరాలు, క్రొవ్వు, మజ్జ, ఎముకలు, వీర్యములతోనూ మరియు ఇతరమైన అసహ్యకరమైన పదార్థములతో నిండివున్నది.

88. ఈ శరీరము తమ యొక్క గత జన్మల కర్మ విశేషములతో, పంచభూతముల పంచీకరణతో తయారై ఆత్మకు ప్రపంచానుభూతులను కల్గించుటకు ఏర్పడిది. అదే ఈ శరీరము యొక్క నిర్మాణము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 22 🌹

✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj


🌻 Five Elements - 5 🌻


85. So for a seeker after Liberation the infatuation over things like the body is a dire death. He who has thoroughly conquered this deserves the state of Freedom.

86. Conquer the dire death of infatuation over thy body, wife, children etc., -conquering which the sages reach that Supreme State of Vishnu.

87. This gross body is to be deprecated, for it consists of the skin, flesh, blood, arteries and veins, fat, marrow and bones, and is full of other offensive things.

88. The gross body is produced by one’s past actions out of the gross elements formed by the union of the subtle elements with each other, and is the medium of experience for the soul. That is its waking state in which it perceives gross objects.

Continues.....

🌹 🌹 🌹 🌹 🌹


14 Feb 2021

No comments:

Post a Comment