✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 23. పూర్వకథ -1 🌻
ప్రస్తుత కాలమున ఏడడుగుల మనిషి అరుదుగ కని పించును. తొమ్మిది నుండి పదకొండు అడుగుల మనుషులు కూడ భూమిపై అక్కడక్కడ నున్నారు. పూర్వమున ఆర్యుల కాలముననే పదడుగుల మనుషులుండిరి. యుగములు మారుచున్నపుడు మనుషుల ఎత్తు, రూపముకూడ క్రమశః మారు చుండును. అటులనే భూభాగముపై కూడ మార్పులు జరిగినవి.
పెను ఆకారములుగల మానవులు దాదాపు 3వేల సంవత్సరములకు పూర్వమే కనుమరుగైనారు. ఒకానొక కాలమున మానవుడు దాదాపు 28 అడుగుల ఎత్తుకూడ నుండెను. క్రమశః యుగ యుగమునకు కురచ కాసాగిరి. మనమిపు డెరిగిన ఈస్టర్ దీప్వములలోగల స్థూపాకారపు మానవ శిల్పములు ఈ సత్యము నకు అద్దము పట్టును.
మానవాకారములు ఎపుడును ఇపుడున్నట్లే ఉన్నవని భావించుటకూడ పరిమిత భావమే. ఒకానొక సమయమున భూమిపై 6 నెలలు మేల్కాంచి యుండి, 6 నెలలు నిద్రించిన మానవులు కూడ కలరు. భారతీయు లెరిగిన కుంభకర్ణుడట్టివాడే!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
14 Feb 2021
No comments:
Post a Comment