2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 288, 289 / Vishnu Sahasranama Contemplation - 288, 289🌹
3) 🌹 Daily Wisdom - 58🌹
4) 🌹. వివేక చూడామణి - 22🌹
5) 🌹Viveka Chudamani - 22🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 32🌹
7) 🌹. మరుగు పోవాల్సిందే ! 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 209 / Sri Lalita Chaitanya Vijnanam - 209🌹
9) 🌹 శ్రీమద్భగవద్గీత - 550 / Bhagavad-Gita - 550🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 639 / Bhagavad-Gita - 639 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 56 🌴*
56. సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ: |
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ||
🌷. తాత్పర్యం :
అన్ని రకములైన కర్మల యందు నియుక్తుడైనను నా శుద్ధభక్తుడు నా రక్షణలో నిలిచి శాశ్వతమును, అవ్యయమును అగు పదమును నా అనుగ్రహముచే పొందగలడు.
🌷. భాష్యము :
“మద్వ్యపాశ్రయ:” అనగా శ్రీకృష్ణభగవానుని రక్షణమున అని భావము. భౌతికకల్మషముల నుండి విడివడుటకు శుద్ధభక్తుడైనవాడు శ్రీకృష్ణభగవానుని నిర్దేశమున లేదా ఆ భగవానుని ప్రతినిధియైన ఆధ్యాత్మికగురువు నిర్దేశమున వర్తించును. కాలపరిమితి యనునది లేకుండా ఇరువదినాలుగు గంటలు, నూటికినూరుపాళ్ళు భగవానుని నిర్దేశమున అతడు కర్మల యందు నియుక్తుడై యుండును.
ఆ విధముగా కృష్ణభక్తిభావనలో కర్మల యందు నియుక్తుడైన భక్తుని యెడ శ్రీకృష్ణభగవానుడు పరమదయాళువు కాగలడు. తత్కారణముగా ఎట్టి కష్టములెదురైనను అంత్యమున అతడు కృష్ణలోకమున చేరగలడు.
అతడు కృష్ణలోకమును నిశ్చయముగా చేరుననుటలో ఎట్టి సందేహము లేదు. అట్టి కృష్ణలోకమునందు ప్రతిదియు మార్పురహితము, శాశ్వతము, అవ్యయము, జ్ఞానపూర్ణమై యుండును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 639 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 56 🌴*
56. sarva-karmāṇy api sadā
kurvāṇo mad-vyapāśrayaḥ
mat-prasādād avāpnoti
śāśvataṁ padam avyayam
🌷 Translation :
Though engaged in all kinds of activities, My pure devotee, under My protection, reaches the eternal and imperishable abode by My grace.
🌹 Purport :
The word mad-vyapāśrayaḥ means under the protection of the Supreme Lord. To be free from material contamination, a pure devotee acts under the direction of the Supreme Lord or His representative, the spiritual master.
There is no time limitation for a pure devotee. He is always, twenty-four hours a day, one hundred percent engaged in activities under the direction of the Supreme Lord. To a devotee who is thus engaged in Kṛṣṇa consciousness the Lord is very, very kind.
In spite of all difficulties, he is eventually placed in the transcendental abode, or Kṛṣṇaloka. He is guaranteed entrance there; there is no doubt about it. In that supreme abode, there is no change; everything is eternal, imperishable and full of knowledge.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 288, 289 / Vishnu Sahasranama Contemplation - 288, 289 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻288. జగతః సేతుః, जगतः सेतुः, Jagataḥ setuḥ🌻*
*ఓం జగతః సేతవే నమః | ॐ जगतः सेतवे नमः | OM Jagataḥ setave namaḥ*
జగతః సేతుః, जगतः सेतुः, Jagataḥ setuḥ
సముత్తరణ హేతుర్వాజ్జగతోఽబు నిధేర్హరేః ।
వర్ణాశ్రమాద్యసంభేదహేతుత్వాద్వేతి సేతుతా ॥
జగత్తునకు సేతువు లేదా వంతెన. సంసారము దాటుటకు హేతు భూతుడు. బ్రాహ్మణాది వర్ణ ధర్మములును బ్రహ్మచర్యాద్యాశ్రమ ధర్మములును మరి ఇతరములగు ధర్మములును తమ యందలి పరస్పర భేధములను వదలక పరస్పరము మిశ్రితములు కాక ఉండునట్లు అడ్డు కట్టగ నిలిచి రక్షచేయువాడు.
వ. మనువు లి ట్లనిరి
క. దుర్ణయుని దైత్యుఁ బొరిగొని, వర్ణాశ్రమ ధర్మ సేతు వర్గము మరలం
బూర్ణముఁ జేసితి వేమని, వర్ణింతుము కొలిచి బ్రదుకువారము దేవా! (322)
(నృసింహస్వామితో) మనువులు ఇలా మనవి చేశారు. దేవా! వర్ణాశ్రమ ధర్మాలు ఈ దానవుని వల్ల ధ్వంసమైనాయి. ఆ దుష్టుని సంహరించి ధర్మసంస్థాపన చేశావు. నిన్ను ఏమని నుతించ గలము? నిన్ను ఆరాధించటమే మాకు జీవనాధారము ప్రభూ!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 288🌹*
📚. Prasad Bharadwaj
*🌻288. Jagataḥ setuḥ🌻*
*OM Jagataḥ setave namaḥ*
Samuttaraṇa heturvājjagato’bu nidherhareḥ,
Varṇāśramādyasaṃbhedahetutvādveti setutā.
समुत्तरण हेतुर्वाज्जगतोऽबु निधेर्हरेः ।
वर्णाश्रमाद्यसंभेदहेतुत्वाद्वेति सेतुता ॥
One who is means of crossing samsāra or worldly existence. Or by reason of His emancipation of the world and by His non-destruction of differences of varnās & āśramās and being like a setu or embankment preserving them - He is Jagataḥ setuḥ.
Śrīmad Bhāgavata - Canto 10, Chapter 58
Yatpādapaṅkajarajaḥ śirasā bibharti
Śrr̥īrabyajaḥ sagiriśaḥ saha lokapālaiḥ
Līlātanuḥ svakr̥tasetuparīpsayā yaḥ
Kāle’dadhatsa bhagavānmama kena tuśyet. (37)
:: श्रीमद्भागवते दशम स्कन्धे, उत्तरार्धे, अष्टपञ्चाशत्तमोऽध्यायः ::
यत्पादपङ्कजरजः शिरसा बिभर्ति
श्रृईरब्यजः सगिरिशः सह लोकपालैः ।
लीलातनुः स्वकृतसेतुपरीप्सया यः
कालेऽदधत्स भगवान्मम केन तुश्येत् ॥ ३७ ॥
Goddess Lakṣmī, Lord Brahma, Lord Śiva and the rulers of the various planets place the dust of His lotus feet on their heads and to protect the codes of religion, which He has created, He assumes pastime incarnations at various times. How may that Supreme God become pleased with me?
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृतांशूद्भवो भानुः शशबिन्दुस्सुरेश्वरः ।औषधं जगतस्सेतु स्सत्यधर्मपराक्रमः ॥ ३१ ॥
అమృతాంశూద్భవో భానుః శశబిన్దుస్సురేశ్వరః ।ఔషధం జగతస్సేతు స్సత్యధర్మపరాక్రమః ॥ ౩౧ ॥
Amr̥tāṃśūdbhavo bhānuḥ śaśabindussureśvaraḥ ।Auṣadhaṃ jagatassetu ssatyadharmaparākramaḥ ॥ 31 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 289 / Vishnu Sahasranama Contemplation - 289🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻289. సత్య ధర్మపరాక్రమః, सत्य धर्मपराक्रमः, Satya dharmaparākramaḥ🌻*
*ఓం సత్య ధర్మపరాక్రమాయ నమః | ॐ सत्य धर्मपराक्रमाय नमः | OM Satya dharmaparākramāya namaḥ*
సత్య ధర్మపరాక్రమః, सत्य धर्मपराक्रमः, Satya dharmaparākramaḥ
యస్య సత్యా అవితథా ధర్మా జ్ఞానాదయోగుణాః ।
పరాక్రమశ్చ యస్య స సత్యధర్మపరాక్రమః ॥
సత్యములు, నిష్ఫలములు కాని ధర్మములును అనగా జ్ఞానాదిగుణములును, సత్యమగు పరాక్రమమును ఎవనికి కలవో అట్టివాడు సత్య ధర్మపరాక్రమః.
:: శ్రీమద్రామాయణము – అరణ్యకాండము, సర్గ 37 ::
రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః ।
రాజా సర్వస్య లోకస్య దేవానాం మఘవానివ ॥ 13 ॥
శ్రీరాముడు ధర్మస్వరూపుడు, సాధు మూర్తి, నిరుపమాన పరాక్రమశాలి. దేవతలకు ఇంద్రునివలె అతడు సమస్తలోకములకును ప్రభువు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 289🌹*
📚. Prasad Bharadwaj
*🌻289. Satya dharmaparākramaḥ🌻*
*OM Satya dharmaparākramāya namaḥ*
Yasya satyā avitathā dharmā jñānādayoguṇāḥ,
Parākramaśca yasya sa satyadharmaparākramaḥ.
यस्य सत्या अवितथा धर्मा ज्ञानादयोगुणाः ।
पराक्रमश्च यस्य स सत्यधर्मपराक्रमः ॥
He whose dharmās i.e., principles based on righteousness, jñāna i.e., knowledge and other qualities and parākrama or valour are true, unfalsified is Satya dharmaparākramaḥ.
Śrīmad Rāmāyaṇa - Book 3, Canto 37
Rāmo vigrahavān dharamaḥ sādhuḥ satya parākramaḥ,
Rājā sarvasya lokasya devānāṃ maghavāniva. (13)
:: श्रीमद्रामायण - अरण्य कांड, सर्ग ३७ ::
रामो विग्रहवान् धरमः साधुः सत्य पराक्रमः ।
राजा सर्वस्य लोकस्य देवानां मघवानिव ॥ १३ ॥
Ráma is virtue's self in human mould; He is kind and of unfailing valor. He is sovereign of the world just as Indra rules upon gods.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
अमृतांशूद्भवो भानुः शशबिन्दुस्सुरेश्वरः ।औषधं जगतस्सेतु स्सत्यधर्मपराक्रमः ॥ ३१ ॥
అమృతాంశూద్భవో భానుః శశబిన్దుస్సురేశ్వరః ।ఔషధం జగతస్సేతు స్సత్యధర్మపరాక్రమః ॥ ౩౧ ॥
Amr̥tāṃśūdbhavo bhānuḥ śaśabindussureśvaraḥ ।Auṣadhaṃ jagatassetu ssatyadharmaparākramaḥ ॥ 31 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 58 🌹*
*🍀 📖 Philosophy of Yoga 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻27. Absolute Independence 🌻*
Moksha, known also as kaivalya, or Absolute Independence, is not one of the stages of experience. It is all-experience melted into one mass of Being. All that was there earlier will also be found there. It is not that the earlier stages are forgotten and one has gone to some new thing altogether.
We may wonder where are all these physical objects, these trees and mountains, these friends and relatives, this wealth and status, all these wonderful and beautiful things in the world. Where are they? Have they been left out somewhere, down below? No, not so is the truth. They have not been left behind.
They have been transformed into the ‘reality’ that they are, and they will be seen as they are, and not as they appeared earlier. This is the great solacing message to all Doubting Thomases who imagine that they, perhaps, lose something valuable as they reach God, or attain liberation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 22 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. పంచభూతాలు - 5 🍀*
85. అందువలన విముక్తి పొందిన సాధకుడు దేహాభిమానము కలిగి ఉన్న, లేక దేహమే తానని భావించిన అది బయంకరమైన చావుతో సమానము. ఎవరైతే పూర్తిగా శారీరక వ్యామోహమును జయిస్తాడో అతడే పూర్తిగా స్వేచ్ఛను పొందగలడు.
86. ఘోరమైన చావును జయించాలంటే శరీరమే తానను భావన, భార్య, పిల్లలు మొదలగు భౌతిక బంధనాలను జయించి ఉన్నతమైన దైవ స్థితిని పొందాలి.
87. ఈ శరీరము మొత్తము నికృష్టమైనది. ఎందువలనంటే అది చర్మము, మాంసము, రక్తము, నరాలు, క్రొవ్వు, మజ్జ, ఎముకలు, వీర్యములతోనూ మరియు ఇతరమైన అసహ్యకరమైన పదార్థములతో నిండివున్నది.
88. ఈ శరీరము తమ యొక్క గత జన్మల కర్మ విశేషములతో, పంచభూతముల పంచీకరణతో తయారై ఆత్మకు ప్రపంచానుభూతులను కల్గించుటకు ఏర్పడిది. అదే ఈ శరీరము యొక్క నిర్మాణము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 22 🌹*
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj
*🌻 Five Elements - 5 🌻*
85. So for a seeker after Liberation the infatuation over things like the body is a dire death. He who has thoroughly conquered this deserves the state of Freedom.
86. Conquer the dire death of infatuation over thy body, wife, children etc., -conquering which the sages reach that Supreme State of Vishnu.
87. This gross body is to be deprecated, for it consists of the skin, flesh, blood, arteries and veins, fat, marrow and bones, and is full of other offensive things.
88. The gross body is produced by one’s past actions out of the gross elements formed by the union of the subtle elements with each other, and is the medium of experience for the soul. That is its waking state in which it perceives gross objects.
Continues.....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 32 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 23. పూర్వకథ -1 🌻*
ప్రస్తుత కాలమున ఏడడుగుల మనిషి అరుదుగ కని పించును. తొమ్మిది నుండి పదకొండు అడుగుల మనుషులు కూడ భూమిపై అక్కడక్కడ నున్నారు. పూర్వమున ఆర్యుల కాలముననే పదడుగుల మనుషులుండిరి. యుగములు మారుచున్నపుడు మనుషుల ఎత్తు, రూపముకూడ క్రమశః మారు చుండును. అటులనే భూభాగముపై కూడ మార్పులు జరిగినవి.
పెను ఆకారములుగల మానవులు దాదాపు 3వేల సంవత్సరములకు పూర్వమే కనుమరుగైనారు. ఒకానొక కాలమున మానవుడు దాదాపు 28 అడుగుల ఎత్తుకూడ నుండెను. క్రమశః యుగ యుగమునకు కురచ కాసాగిరి. మనమిపు డెరిగిన ఈస్టర్ దీప్వములలోగల స్థూపాకారపు మానవ శిల్పములు ఈ సత్యము నకు అద్దము పట్టును.
మానవాకారములు ఎపుడును ఇపుడున్నట్లే ఉన్నవని భావించుటకూడ పరిమిత భావమే. ఒకానొక సమయమున భూమిపై 6 నెలలు మేల్కాంచి యుండి, 6 నెలలు నిద్రించిన మానవులు కూడ కలరు. భారతీయు లెరిగిన కుంభకర్ణుడట్టివాడే!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మరుగు పోవాల్సిందే ! 🌹*
*🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
నా నిజాలు తెలిపేందుకు నేనెందుకంత భయపడుతున్నాను? మీరే కాదు, ఆ పని చేసేందుకు ఎవరైనా భయపడతారు. అది సహజం. యుగయుగాలుగా, అనేక జన్మలనుంచి మీ మనసులో పేరుకున్న ఎందుకూ పనికిరాని చెత్తను బయట పెట్టాలంటే మీకు భయంగానే ఉంటుంది. ఎందుకంటే, అప్పుడు మీ దుర్భలత్వం, తప్పులు, బలహీనతలు బయటపడతాయి.
అంటే, మీ నగ్నత్వం పూర్తిగా బయటపడి మీరు ఖాళీ అయినట్లే. అది మృత్యువుతో సమానం. అందుకే మీరు భయపడతారు. మీ మనసులో పేరుకున్న చెత్త, రణగొణ ధ్వనుల వెనకాల ‘‘పరమ శూన్యం’’ అనే కోణముంది. దేవుడు లేకపోతే ఎవరైనా ఏమీలేని ఖాళీ డొల్లే. ఆ వికారమైన తమ దిగంబర రూపం ఎవరికీ తెలియ కూడదనే ఎవరైనా కోరుకుంటారు.
అందుకే వారు దానిని అందమైన అలంకరణలతో కప్పేసి, తమ ప్రత్యేకతను చాటుకుంటూ నటిస్తారు. వారే కాదు, అన్నిచోట్ల అందరూ అలాగే చేస్తారు. ‘‘అందరూ ఏమనుకుంటారు?’’ అనే భయంలో ఉంటారే కానీ, ఎవరూ తెరిచిన పుస్తకంలా ఉండరు. మీ చిన్నప్పటి నుంచి మీకు అందమైన ముసుగులు ఎలా వేసుకోవాలో నేర్పారు.
కాబట్టి, మీకు అందమైన ముఖం ఉండవలసిన అవసరంలేదు. అందమైన ముసుగులు ఉంటే చాలు. పైగా, అవి చాలా చవక. ముఖాన్ని మార్చడం చాలా కష్టమైన పని. కానీ, దానికి రంగు వెయ్యడం సులభమే. ఉన్నపళంగా మీరు మీ ముసుగు తీసి మీ ముఖాన్ని బయట పెట్టాలంటే మీ ఉనికి అంతర్గత కేంద్రంలో విపరీతమైన వణుకు పుడుతుంది.
ఎందుకంటే, మీ ముఖం అందరికీ నచ్చుతుందో, నచ్చదో, మునుపటిలా అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారో, ప్రేమించరో, గౌరవిస్తారో, గౌరవించరో ఎవరికి తెలుసు? ఇంతవరకు అందరూ మీ అందమైన ముసుగునే ప్రేమించారు, గౌరవించారు, కీర్తించారు. అందుకే ఆ ముసుగు తీసి, మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టాలంటే మీకు చాలా భయంగానే ఉంటుంది.
ఎందుకంటే, ‘‘ఒకవేళ మీ నిజ స్వరూపం నచ్చకపోతే, అందరూ మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారేమో’’ అనేదే మీ భయం. అందుకే అందరూ నకిలీ మనస్తత్వంతో నటిస్తూ ఉంటారు. కేవలం భయం నుంచే నటన, నకిలీ మనస్తత్వాలు పుట్టుకొస్తాయి. కాబట్టి, నిర్భయులుగా ఉండాలంటే ఎవరైనా వాస్తవంగా ఉండక తప్పదు.
మీరు దేనిని దాచినా అది ఎదుగుతూనే ఉంటుంది. కాబట్టి, మీరు ఎలా బయటపడ్డా అందులో సత్యముంటే రాణిస్తారు, అసత్యముంటే పతనమవుతారు. ఇదే జీవిత సత్యాలలోని ప్రాథమిక సూత్రం.
అందువల్ల అసత్యానికి ఎప్పుడూ సహకరించకండి. అప్పుడే అది నిదానంగా అదృశ్యమవడం ప్రారంభిస్తుంది. అందరూ తమ వాస్తవాలతో అలమటిస్తూ, అవాస్తవాలతో కొవ్వెక్కిపోతున్నారు.
మీ అవాస్తవ ముఖాలకు అబద్ధాలే ఆహారం. అందువల్ల వాటి కోసం మీరు అనేక అబద్ధాలు కనుక్కోవలసి వస్తుంది. ఒక అబద్ధాన్ని కాపాడేందుకు మీరు వంద అబద్ధాలు కనుక్కోవలసి వస్తుంది. ఒక అబద్ధాన్ని కాపాడేందుకు మీరు వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే, ఒక అబద్ధాన్ని దానికన్నా పెద్ద అబద్ధాలు మాత్రమే కాపాడగలవు. కాబట్టి, మీరు మీ ముఖాల వెనకాల దాక్కున్నప్పుడు మీ వాస్తవం మరణించడం ప్రారంభిస్తుంది. మీ అవాస్తవం మరింత బలపడుతూ కొవ్వెక్కిపోతుంది.
ఒకవేళ మీరు మీ వాస్తవాన్ని బయటపెడితే మీ అవాస్తవం మరణించక తప్పదు. ఎందుకంటే, అవాస్తవం మీ అచేతనత్వం చీకట్లో రహస్యంగా దాగి ఉంటుందే కానీ, వెలుపల వెలుగులోకి రాలేదు. ఒకవేళ మీ అవాస్తవాన్ని మీరు మీ సచేతనంలోకి తెస్తే అది ఆవిరవడం ప్రారంభిస్తుంది.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 209 / Sri Lalitha Chaitanya Vijnanam - 209 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀. పూర్తి శ్లోకము :*
*సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |*
*మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖*
*🌻 209. 'మహాదేవీ" 🌻*
అనంతమగు వెలుగుతో కూడిన శరీరము కలది శ్రీదేవి అని అర్థము. అనంతముగ పూజింపదగిన వెలుగు శరీరము కలది శ్రీదేవి అని అర్థము. శ్రీదేవి శరీర మనంతము. అనగా అంతము లేనిది. సృష్టియే ఆమె శరీరము. ఎన్ని సృష్టులు ఆమె నుండి జరుగుచున్నవో బ్రహ్మాదుల కైనను అంతు పట్టదు. కావున ఆమె శరీరము మొత్తము త్రిమూర్తులకు కూడ తెలియదని దేవీ పురాణము తెలుపుచున్నది. అట్టి శరీరము కలది కనుక ఆమె మహాదేవి.
ఆమె వెలుగుకూడ అట్టిదియే కనుక మహాదేవి అని తెలియనగును. త్రిమూర్తులు సహితము ఆమె మొత్తము వెలుగును చూడజాలరు. ఇక దేవతల మాట ఏల? సర్వదేవతలకు ఆమె దేవి కనుక మహాదేవి. ఆమె శరీరము కొలతలే తెలియలేము. అంతియే కాదు, ఆమెకు అంతము లేదు. అనగా స్థూలము, సూక్ష్మము, సూక్ష్మతరము, సూక్ష్మతమమూయై యుండును.
అపారమగు ఆమె శరీరము ఎట్టి కొలతల చేతను కొలవబడనిది అని దేవీ పురాణము కీర్తించును. అట్టి మహత్వము కల దేవి మహతీదేవి లేక మహాదేవి. మహత్వమనగా ప్రమాణముచే తెలియ దగనిది లేక పొంద దగనిది. మహా అను పదమునకు ఆరాధన అని కూడ అర్థము కలదు. ఆమె అనంతముగ పూజింపదగిన దేవి. రోహిణీదేవిని కూడ మహాదేవి అని పిలుతురు.
సోమాత్మకుడైన మహాదేవుని భార్య రోహిణి, సృష్టి యందు అత్యంత సౌమ్యము, కోమలము, సుందరముగ రోహిణీ దేవి ప్రకాశించు చుండును. శ్రీకృష్ణుని శరీర సౌందర్యము, కోమలత్వము ఋషులు కూడ వర్ణింపలేరైరి. దానికి కారణము అతడు మహాదేవి యగు రోహిణి నుండి దిగివచ్చుటయే.
బ్రహ్మ నిష్ఠాగరిష్టులైన ఋషులు కూడ శ్రీకృష్ణుని జూచి మోహ పరవశులైరి. ఇది మహాదేవి రోహిణి మహత్తు. పున్నమి చంద్రుని కాంతికే జీవులు పరవశు లగుదురు. అట్టి చంద్రుని కోమలత, సౌమ్యత, సుందరతల కన్న ఎనిమిది రెట్లు ఎక్కువైనది రోహిణి అని వాయు పురాణము తెలుపుచున్నది. మహాదేవిని అనంతముగ పూజించుచునే యుండవలెను.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 209 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Mahādevī महादेवी (209) 🌻*
Śiva is also known as Mahādeva, His moon form (this is said to be the eighth form of Śiva. His wife is Rohinī and their son is Budha, the planet Mercury) and his wife is Mahādevi. Maha also means the Supreme. She is the Supreme and hence called Mahādevi.
Śiva has eight forms and they are – 1. Sarva – earth form, 2. Bhava-water form, 3. Rudra – fire form, 4. Ugra – wind form, 5. Bhīma- ākāśa form, 6. Paśupati – soul form, 7. Īśāna – sun form and 8. Mahādeva –moon form. These eight forms of Śiva are His cosmic forms (Liṅga Purāṇa).
It is pertinent to note that both Śiva and Śaktī have moon in their crowns. Moon indicates two qualities, one is its coolness and another is intelligence.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 550 / Bhagavad-Gita - 550 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 13 🌴*
13. ఇదమద్య మయా లబ్ధమిమం ప్రాప్స్యే మనోరథమ్ |
ఇదమస్తీదమపి మే భవిష్యతి పునర్ధనమ్ ||
🌷. తాత్పర్యం :
ఆసురీస్వభావుడగు మనుజుడు ఇట్లు తలచును : “ఈనాడు నా వద్ద ఇంత ధనమున్నది. నా ప్రణాళికలచే నేను మరింత ధనమును పొందుదురు. ఇదియంతయు నాది. భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధినొందగలదు.
🌷. భాష్యము :
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 550 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 13 🌴*
13. idam adya mayā labdham
imaṁ prāpsye manoratham
idam astīdam api me
bhaviṣyati punar dhanam
🌷 Translation :
The demoniac person thinks: “So much wealth do I have today, and I will gain more according to my schemes. So much is mine now, and it will increase in the future, more and more.
🌹 Purport :
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom Telegram group 🌹
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment