మన మహర్షులు - 1 : అగస్త్య మహర్షి


మన మహర్షులు - 1

🍁🍁🍁🍁🍁🍁🍁

అగస్త్య మహర్షి:

🍁🍁🍁🍁🍁🍁🍁



శ్రీలు పొంగిన పుణ్యభూమి, భారతావనిలో అనితర సాధ్యమైన మహత్కార్యాలు చేసిన మహాత్ముడు. అగస్త్య మహర్షి.

ఈయన పుట్టడం కూడా చాలా విచిత్రంగా పుట్టాడు అగ్నిదేవుడూ, వాయుదేవుడూ ఈ ఇద్దరి అంశతో నిండుగా నీళ్ళున్న ఒక పాత్రలోంచి పుట్టాడు అగస్త్య మహర్షి అందుకే ఆయనకు కలశజుడు, కుంభసంభవుడు ఔర్వశ్రేయుడు, మిత్రావరణ పుత్రుడు, వహ్నిమారుత సంభవుడు అని ఇంకా అనేక పేర్లున్నాయి అగస్త్య మహర్షికి చిన్నతనంలో ఉపనయనం, ప్రణవ పంచాక్షరీ మంత్రోపదేశం అన్ని దేవతలే చేసేశారు. ఆయన బ్రహ్మచర్యం తీసుకుని తపస్సు చేస్తూ ఉండేవాడు.

ఒకసారి అడవిలో తిరుగుతూ తలక్రిందులుగా వ్రేలాడుతూ ఉన్న మునులని చూసి మీరెందుకు ఇలా ఉన్నారని అడిగాడు అగస్త్య మహర్షి

ఆ మునులు.. నాయనా ! మమ్మల్ని పితృదేవతలంటారు. మాకు పుణ్యలోకం రావాలంటే నువ్వు పెళ్ళి చేసుకోవాలి లేకపోతే మా గతి ఇంతే అన్నారు

అగస్త్యుడు ఇది విని మరి పెళ్ళి చేసుకోవాలంటే మంచి వధువు కావాలి కదా అందుకని తన తపోబలంతో పుత్రకాముడనే పేరున్న విదర్శరాజుకి ఒక చక్కటి కుమార్తె పుట్టాలని వరం ఇచ్చాడు

ఆ అమ్మాయి పేరు లోపాముద్ర .ఆ లోపాముద్రని అగస్త్యుడు పెళ్ళి చేసుకుని తనతో ఆశ్రమానికి తీసుకువచ్చాడు.

మణిమతీ పురానికి రాజు 'ఇల్వలుడు' అయనకి 'వాతాపి' అనే తమ్ముడుండే వాడు. ఇల్వలుడు తన తమ్ముడు వాతాపిని చంపి బ్రాహ్మణులకి వండి పెట్టేవాడు. తర్వాత వాతాపిని పిలవగానే వాతాని బ్రాహ్మణులు కడుపులో నుంచి బయటకి వచ్చేవాడు, ఈ విధంగా అన్నదమ్ములిద్దరూ కలిసి బ్రాహ్మణులని చంపేసేవాళ్ళు,

అగస్త్యుడు ధనం కోసం ఇల్వలుడి ఇంటికి వెళ్ళాడు. మామూలుగానే ఇల్వలుడు. ఇల్వలుడు వాతాపి చంపి, వండి పెట్టి, మళ్ళీ వాతాపిని పిలిచాడు. కానీ అగస్త్యుడు భోజనం చెయ్యగానే జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం' అన్నాడు. వాతాని జీర్ణం అయిపోయాడు. ఇల్వలుడు ఎంత పిలిచినా వాలాకు బయటికి రాలేదు. ఉంటే కదా ... రావడానికి.

ఇల్వలుడు అగస్త్యుడికి ధనం, బంగారం, ఆవులు ఇన్ని ఇచ్చి పంపించాడు, తర్వాత అగస్తుడికి ధృడస్యుడు అనే కొడుకు, తేజస్వి అనే మనుమడు కలిగారు. పితృదేవతలు పుణ్యలోకాలకి వెళ్ళిపోయారు.

వృత్రుడు అనే రాక్షసుడు ఇంద్రుణ్ణి జయించి ధర్మచరిత్ర గల మహర్షులందరినీ రాత్రి సమయంలో చంపి పగటి సమయంలో సముద్రంలో దాక్కుని ఉండేవాడు

మహర్షిలందరూ కలిసి ఆ సముద్రజలాన్ని అగస్త్య మహర్షికి దానమిచ్చారు. అగస్త్యుడు ఆ సముద్రాన్ని తన కమండలంలో పట్టి ఒక్క గుటకలో త్రాగేశాడు. వృత్రాసురుడు బైటపడ్డాడు. దధీచి దేహాన్ని ఆయుధాలుగా చేసుకుని దేవతలు వృత్రుణ్ణి చంపేశారు.

అగస్త్య మహర్షి దండకారణ్యంలో నివసిస్తూ ఉండగా శ్రీరాముడు అరణ్యవాసం చెయ్యడానికి వెడుతూ అగస్త్య మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. ఖడ్గము విల్లు బాణాలు అక్షయమైన అమ్ములపాటి రాముడికి ఇచ్చి దీవించాడు. అగస్త్యుడు కొంతకాలం తర్వాత రామరావణ యుద్ధం అప్పుడు ఆదిత్యహృదయం అనే మహాస్తవం ఉపదేశించాడు.

పూర్వం సహుషుడనే రాజు సూరు అశ్వమేధ యాగాలు చేసి ఇంద్రపదవిని పొందాడు. కానీ, ఐశ్వర్యం ఉందన్న అహంకారంతో శచీదేవిని తనతో ఉండమని అడిగాడు. శచీదేవి మునులను వాహనంగా చేసుకుని రమ్మంది. నహుషుడు శచీదేవి రగ్గరికెడుతూ మునులని రథం మొయ్యమని చెప్పాడు. పూర్వాచార్యులు మంత్రాల్ని, బ్రాహ్మణుల్నీ నిందించటం తప్పని చెప్పిన అగస్త్యుడి తల మీద తన్నాడు సహుషుడు, సహుఘడిని క్రూరసర్పముగా మారమని శపించాడు అగస్త్యుడు. తర్వాత నహుషుడి కోరిక మీద పూర్వజ్ఞానం ఉండేలా కరుణించాడు అగస్త్యుడు

అగస్త్యుడు 'ద్వాదశ వార్మిక యజ్ఞం' చేశాడు. అంటే ఆ యజ్ఞం వన్నెండు సంవత్సరాలు జరిగింది. దానికి ఇంద్రుడు సహకరించలేదు. అప్పుడు అగస్త్యుడు తానే ఇంద్రపదవి పొంది వర్షాలు కురిపించి నిధులు తెచ్చుకుంటాను అన్నాడు. మునులు ఇంద్రుడు భయపడి కుంభవృష్టి కురిపించాడు.

సూర్యుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తిరగడం లేదని వింధ్యపర్వతం కోపగించి సూర్య, చంద్ర, నక్షత్రాల గమనం ఆపేసినప్పుడు 'మేం తిరిగి వచ్చే వరకు నువ్వు భూమికి సమానంగా ఉండు. మేమిప్పుడు దక్షిణాపథం వెడుతున్నామని ' చెప్పాడు. ఈ విధంగా వింధ్య పర్వతానికి సహజంగా ఉండే పెరుగుదల కూడా లేకుండా దాని గర్వాన్ని ఆడిగించాడు అగస్త్యుడు .

అగస్త్యుడు భార్యతో కలసి యాత్రలు చేస్తూ గోదావరీ తీరంలో ఉన్న పంపానరోవరం, దండకారణ్యం, గోదావరీ తీరం, కోటిపల్లి, పలివెల, భీమేశ్వరం ద్రాక్షారామం, వీరభద్రశేఖరం మొదలయినవి చూసి కొల్హాపురం చేరి అక్కడ లక్ష్మీదేవికి స్తోత్రం చేశాడు.

లక్ష్మీదేవి అగస్త్యుణ్ణి ద్వాపర యుగంలో వేదవ్యాసుడవై పుట్టి వారణాశిలో ఉంటావని దీవిస్తుంది.

పరశురాముడు అగస్త్యుడు అచ్చిన కృష్ణకవచాన్ని ధరించే ఇరవై ఒక్కసార్లు రాజుల్ని చంపగలిగాడు.

ఒకప్పుడు ఇన్ద్రద్యుమ్నుడు విష్ణుమూర్తిని ధ్యానిస్తూ అగస్త్యుడు రావడం చూడలేదు, అగస్త్యుడికి కోపం వచ్చి ఏనుగునై పుట్టమని పించాడు, శ్రీమద్ భాగవతం లో గజేంద్రమోక్షంలో ఉన్న గణేంద్రుడే ఈ ఇంద్రద్యుమ్నుడు.

అగస్త్యుడు రాసిన గ్రంథాలు 'అగస్త్యగీత అగస్త్యసంహిత",

అగస్త్య మహర్షి ఎప్పుడూ లోకం కోసమే పాలుపడ్డాడు. ఎంతో మందికి విద్యాదానంచేశాడు. ఎంత చెప్పినా అయిపోని గొప్పతనం ఆయనది.


🍁🍁🍁🍁🍁🍁

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మనమహర్షులు

Join and Share

భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom

www.facebook.com/groups/maharshiwisdom/

www.facebook.com/groups/chaitanyavijnanam/

https://t.me/ChaitanyaVijnanam


26 Mar 2021

No comments:

Post a Comment