వివేక చూడామణి - 51 / Viveka Chudamani - 51
🌹. వివేక చూడామణి - 51 / Viveka Chudamani - 51🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 15. మనస్సు - 5 🍀
180. అందువలన యోగులు రహస్యాలు దాచి మనస్సును అవిద్యగా వర్ణించిరి. అందువలనే ఈ ప్రపంచము గాలిలోని మేఘాల వలె ఊగు చున్నది.
181. ఆ కారణముగానే సాధకుడు విముక్తి పొందిన తరువాత జాగ్రత్తగా తన మనస్సును పవిత్రము చేసుకోవాలి. ఎపుడైతే మనస్సు పవిత్రమవుతుందో విముక్తి తేలిక అవుతుంది. అరచేతిలోని అరటి పండు వలె.
182. విముక్తి కొరకు ఏకీకృతమైన భక్తితో బంధనాలనే వేళ్ళను, జ్ఞానేంద్రియాలకు చెందిన భోగ వస్తువులను సమూలముగా తొలగించి వేయుటకు, నిజమైన బ్రహ్మ జ్ఞానము పై నమ్మకముతో నిరంతరము క్రమము తప్పకుండా సత్సంగములలో పాల్గొంటూ రాజసిక స్వభావ లక్షణాలను తొలగించుకోవాలి.
183. మానసిక కవచము ఉన్నతమైన ఆత్మ కాదు. ఎందువలనంటే దానికి మొదలు, అంతము కలదు. మార్పులకు అవకాశముకలదు. అది బాధ, నొప్పులతో కూడిన వస్తువు. దానిని జ్ఞానముతో కూడిన వస్తు సముదాయముతో పోల్చరాదు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 51 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Mind - 5 🌻
180. Hence sages who have fathomed its secret have designated the mind as Avidya or ignorance, by which alone the universe is moved to and fro, like masses of clouds by the wind.
181. Therefore the seeker after Liberation must carefully purify the mind. When this is purified, Liberation is as easy of access as a fruit on the palm of one’s hand.
182. He who by means of one-pointed devotion to Liberation roots out the attachment to sense-objects, renounces all actions, and with faith in the Real Brahman regularly practices hearing, etc., succeeds in purging the Rajasika nature of the intellect.
183. Neither can the mental sheath be the Supreme Self, because it has a beginning and an end, is subject to modifications, is characterised by pain and suffering and is an object; whereas the subject can never be identified with the objects of knowledge.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
26 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment