దేవాపి మహర్షి బోధనలు - 62
🌹. దేవాపి మహర్షి బోధనలు - 62 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 43. సూచనలు-1 🌻
1. సుముఖత లేనివారికి సత్యమును గురించి, సద్గురువును గురించి, సధ్రంథములను గురించి వివరింపకుము. వారి అవహేళన, విముఖత - సత్యమునకవమానకరము.
.
2. తన వారి కొరకై పాటుపడని వానిని దరిచేర నీయకుము. అట్టివాడు బాధ్యత లెరుగనివాడు. భక్తి లేనివాడు, దేశభక్తి లేనివాడు, బాధ్యత నెరుగనివాడు - స్నేహమునకు పనికిరాడు.
3. తెలిసిన వారు, తెలివిగల వారందరును మంచివారు కానక్కర లేదు. సంబంధములు పెంచుకొనుటలో ఈ విచక్షణను కలిగి యుండవలెను.
4. శ్రేయోదాయకమైన కార్యమును నిర్వర్తించుటలో అవహేళనకు, అపనిందలకు, నష్టమునకు గురియైనను తప్పులేదు. కాలక్రమమున అది అమూల్యమైన ఫలములను కొనితేగలదు.
5. సత్పురుష దర్శనము, సద్ధంథ పఠనము, సత్య భాషణము ఎన్నటికిని నిరర్థకములు కావు. సత్పురుషుల యెడల చూపినత్యాగనిరతి ఉత్తమోత్తమ ఫలములనందించగలదు.
6. మిమ్ములను మీరు సంస్కరించుకొను మార్గమున మమ్ములను దర్శించుట ఉత్తమము. కేవలము మా దర్శనము కోరువారు, వారి సంకల్ప బలమున దర్శించినను అది అపాయకరము కాగలదు. మా దర్శనమున మీలోని సంస్కారము లన్నియు ఒక్కసారిగ అలజడి చెందగలవు. అది కారణముగ కొన్ని నీచప్రవృత్తులు బైటపడు అవకాశము గలదు. పిచ్చి యెక్కు అవకాశములు కూడ గలవు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
26 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment