శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 239 / Sri Lalitha Chaitanya Vijnanam - 239
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 239 / Sri Lalitha Chaitanya Vijnanam - 239 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀
🌻239. 'చంద్రవిద్యా' 🌻
దేవి చంద్ర విద్యా స్వరూపిణి అని అర్థము. చంద్రుడనగా మనకు కనిపించు చందమామ మాత్రమే కాదు.
ప్రతిబింబించు శక్తి. మొలకెత్తించు శక్తి. పదార్థమును జనింపజేసి రూపముల నేర్పరచు శక్తి. దీనిని ఊర్ధ్వలోకములలో సోమశక్తి అందురు. మరియు ఆకర్షణ శక్తి, సృజనాత్మక శక్తి కూడను. సోమ మనగా ఉమతో కూడిన శివతత్త్వమని అర్థము (స + ఉమ). ఈ శక్తి లేనిదే ఏకమనేకమగుట జరుగదు.
అనేక అద్దములున్న గదిలో నిలబడినపుడు ఒకరే అనేకులై అనంతముగ గోచరింతురు కదా! అట్లే శ్రీదేవి మహా చైతన్యము నుండి, ఆమె చంద్రశక్తి కారణముగ అనేక గ్రహగోళాదులు అనేకానేక కోట్ల జీవుల రూపము లేర్పడుచున్నవి.
ఆమె మనస్సు నుండి పుట్టినది ఆమె చంద్రశక్తి, ఆ చంద్రశక్తి నుండి పుట్టినవి మనువుల మనస్సులు. ఈ కారణముగనే మన మనస్సులలో కూడ అసంఖ్యాకములైన భావములు పుట్టు చుండును. మనమా భావములకు రూపకల్పన చేయుచుందుము. చంద్రవిద్య బలముగ నున్నవారు భావములకు రూపమును అప్పటి కప్పుడేర్పరచగలరు. ఋషులట్టివారు.
మంత్రించిన జలముల నుండి స్మరించిన భావమును రూపు కట్టింపగలరు. ఊర్ధ్వలోక దర్శనమునకు, అంతర్దర్శనమునకు, బాహ్య దర్శనమునకు, అవగాహనకు కూడ మనస్సే ప్రధానము.
శ్రీమాత చంద్రవిద్యను పదహారు కళలుగ ఏర్పాటు చేసి యున్నది. ఈ పదహారు కళలు శూన్యముగ గోచరించు శివ తత్త్వము నుండి, పూర్ణముగ గోచరించు భౌతిక సృష్టి వరకు సృష్టి నిర్మాణమునకు శ్రీమాత ఉపయోగించు చంద్రవిద్య.
చంద్రవిద్యతోనే సృష్టి పురోగమనము, తిరోగమనము నిర్వర్తింపబడుచున్నది. పరిశీలించినచో మానవ జీవితమున కూడ బాహ్యములోనికి పురోగతి చెందుట, బాహ్యము నుండి తిరోగతి చెందుట చంద్రవిద్యపైనే ఆధారపడి యున్నవి.
చంద్రబలము బాగుండిననే యోగసాధన సులభమగును. శుక్ల పక్షమున చంద్రకళలు పెరుగుచుండగ బాహ్యములోనికి పురోగమించుట, కృష్ణ పక్షమున చంద్రకళలు తరుగుచుండగ అంతర్లోకములలోనికి తిరోగమించుట యోగులు చేయుదురు.
తిరోగమనమునకు శివుడు గమ్యము. పురోగమనమునకు అనుభూతి గమ్యము. తిరోగమన పురోగమనములకు శ్రీదేవి అనుగ్రహము గమ్యము.
చంద్రవిద్య అంతయూ చంద్రుని షోడశ కళలయందు యిమిడి యున్నది. షోడశీ మంత్రమును ఉపాసించువారు ఈ విద్యను గ్రహింపగలరు. మరియొక విషయమేమనగా ముందు తెలిపిన మనువిద్య, చంద్రవిద్య పరస్పర సంబంధితములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 239 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 Candra-vidyā चन्द्र-विद्या (239) 🌻
After Manu, the worship by Candra is referred in this nāma.
{There are fifteen main worshippers of Lalitāmbigai and each one of them worshipped Her with their own Pañcadaśī mantra-s without making any changes in the bīja-s. Hence, there are fifteen types of Pañcadaśī mantra-s. (However, different texts provide different versions.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
22 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment