దేవాపి మహర్షి బోధనలు - 60


🌹. దేవాపి మహర్షి బోధనలు - 60 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 41. సాధన - శరీరము 🌻


ఆత్మ సాధనము కొన్ని రోజులకు సంబంధించినది కాదు. ఆత్మానుభూతి కలుగుటకు సాధకుని పరిశుద్ధిని బట్టి కొన్ని సంవత్సర ములు లేదా కొన్ని జన్మలు పట్టవచ్చును. జీవితమున శిశు ప్రాయము ననే సాధన మొదలగువానికి, ఆ జన్మ యందే సిద్ధి లభించుట కవకాశము కలదు.

ఉత్తరార్థమున యోగసాధన గూర్చి తాపత్రయ పడువారు ఆ శుభవాసనను ముందు జన్మలలోనికి కొనిపోయి, మరుజన్మలో చిరుప్రాయముననే యోగానుష్ఠాన బుద్ధిని పొందుదురు.

మానవ శరీరము ఏడు సంవత్సరముల ప్రాయము నుండి యోగ మార్గము ననుసరించుటకు అనువుగ నుండును. ఇది శ్రేష్ఠమైన సమయము.

అచటి నుండి ప్రతి యేడు సంవత్సరములకు శరీర కణములు స్థూల మగుచుండగ శ్రేష్ఠమైన సాధనకు దేహము సహకారము నందించుట తగ్గును. ముప్పది. ఐదు సంవత్సరముల వరకు శరీరమున మార్దవ ముండుట కవకాశమున్నది.

నలభై రెండు సంవత్సరముల తరువాత శరీరము బిరుసెక్కి సాధనకు ఉపయుక్తము కాక యుండును. చిన్నతనముననే శరీరమునకు యోగాంగములైన యమ నియమములను నేర్పినచో జీవితమంతయు యోగ సాధనమునకు శరీరము అనుకూలముగ వరించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


22 Mar 2021

No comments:

Post a Comment