శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 244 / Sri Lalitha Chaitanya Vijnanam - 244


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 244 / Sri Lalitha Chaitanya Vijnanam - 244 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

🍀 60. చరాచర జగన్నాథా, చక్రరాజ నికేతనా ।
పార్వతీ, పద్మనయనా, పద్మరాగ సమప్రభా ॥ 60 ॥ 🍀

🌻 244. 'చరాచర జగన్నాథా' 🌻

చరించునవి, చరించనివి యగు జీవులతో కూడిన సమస్త జగత్తునకు నాథ, శ్రీదేవి అని భావము. ప్రాణముగల జీవులు చరించు జీవులు. ప్రాణము లేక కేవలము ప్రజ్ఞ మాత్రమే కల ఖనిజములు, పదార్థములు, వస్తువులు మరియు ప్రాణ ముండియు చరించలేని వృక్షాదులు, అన్నిటికినీ మూలము శ్రీదేవియే.

ప్రాణముగల జీవులు చరింతురు. వీరి యందు ప్రజ్ఞ కూడ కలదు. ప్రజ్ఞ ప్రభావమును చూపును; స్వభావమును చూపును. ప్రజ్ఞ చరాచర జీవుల యందు వారి వారి స్వభావముగ గోచరించును.

ఉప్పు యందు ఉప్పగను, పంచదార యందు తీపిగను, బంగారము నందు స్ఫూర్తి నిచ్చు మెఱుపుగను, కుక్కయందు కుక్కగను, సింహము నందు సింహముగను, జ్ఞానులుగను ప్రజ్ఞ భాసించు చుండును.

ఇచ్చట హెచ్చు తగ్గులు ఉపాధికి సంబంధించినవే కాని ప్రజ్ఞకు సంబంధించినవి కావు. పెద్ద దీపము, చిన్న దీపము పరిమాణ భేదము వలన వెలుగు పెద్దదిగను, చిన్నదిగను గోచరించును. వెలుగొక్కటే, ఉపాధిని బట్టి అది ప్రకాశించును. ఇట్టి అన్నిటి యందు గల వెలుగు శ్రీదేవి. ఆమె సాన్నిధ్యమున ఉపాధులు వాని వాని స్వభావములను ప్రకటించుచున్నవి.

స్వభావములను చూడక వాని కాధారమైన ప్రజ్ఞను చూచుట నిత్యము దేవీ దర్శనము చేయుట వంటిది. ప్రాణము శివ స్వరూపము కాగా ప్రజ్ఞ దేవీ స్వరూప మగు చున్నది. నిజమునకు ప్రాణ స్పందనము కూడ శ్రీదేవియే. ప్రాణము యొక్క హెచ్చుతగ్గులు కూడ ప్రజ్ఞను బట్టియే యుండును. ప్రజ్ఞ త్రిగుణాత్మకముగ పనిచేయును.

తమస్సు పాలు అధికముగ నున్నప్పుడు అచరము లేర్పడును. అందుండి రజస్సు మేల్కాంచినపుడు ప్రాణము సమవర్తనమై యుండును. సృష్టి నీ విధముగ నడిపించునది ప్రాణ, ప్రజ్ఞలే. రెంటికినీ శ్రీదేవియే ఆధారము. పరమశివుడు కేవలము అస్తిత్వముగ అన్నిటి యందుండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 244 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Cāracara-jagannāthā चारचर-जगन्नाथा (244) 🌻


She controls both sentient and insentient things of the world. She is the cause for both static and kinetic energies. Pure static energy is Śiva and Śaktī is predominantly kinetic energy, though static energy of Śiva is also present and their union is the cause for creation. Sentient and insentient means these two energies. She administers this universe as Śiva-Śaktī.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


30 Mar 2021

No comments:

Post a Comment