దేవాపి మహర్షి బోధనలు - 64
🌹. దేవాపి మహర్షి బోధనలు - 64 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 45. సదాచారము 🌻
పరిశుద్ధ జీవనము ఒక్కటియే మార్గమున పురోగతి నివ్వజాలదు. సదాచారవంతు లెందరో గలరు. పాత్రను పరిశుద్ధి చేయుట సద్వినియోగపరచుటకే కదా! కేవలము ప్రతిదినము తోమి, కడిగి, భద్రముగ వుంచిన పాత్ర వలన వినియోగము లేదుకదా! ఆహార పదార్థములను వండుటకు పాత్రను వినియోగించినట్లే నీవు కూడ పరహితమను యజ్ఞమునకు సమర్పణము చెంది యుండవలెను.
పాత్ర అగ్ని తాకిడి భరించి, రుచికరమైన పదార్థములను తయారుచేసి పదిమందికి పోషణము కలిగించును. నీవును అట్లే జీవితపు ఆటుపోటులను భరించుచు, పదిమందికి వినియోగపడు పద్ధతిలో జీవించుట ముఖ్యము. కేవలము సదాచారమే సమస్తము అను భ్రమనందు జీవింపకుము. సదాచారమవసరమే. అది లేనివారు సత్కార్యములను నిర్వర్తించలేరు.
సత్కార్య నిర్వహణకు సదాచారముతో పాటు సత్సంకల్పము, తెగించు బుద్ధి (ధీరత) కూడ నుండవలెను. ఇట్టి గుణములు లేని సదాచారము డాంబికముగ నుండును. తెలియని అహంకారము నిన్నాశ్రయించి యుండును. పదిమందికి ఉపయోగ పడిన జీవనమే జీవనము. త్వరపడి పరహిత కార్యమున పాల్గొనుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
30 Mar 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment