విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 336, 337 / Vishnu Sahasranama Contemplation - 336, 337


🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 336/ Vishnu Sahasranama Contemplation - 336 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻336. అశోకః, अशोकः, Aśokaḥ🌻


ఓం అశోకాయ నమః | ॐ अशोकाय नमः | OM Aśokāya namaḥ

అశోకః, अशोकः, Aśokaḥ

హరిశ్శోకాదిషడూర్మివర్జితోఽశోక ఉచ్యతే క్షుద్బాధ (ఆకలి), పిపాస (దాహము), శోకము, మోహము లేదా అవివేకము, జరా (వార్ధక్యము) మరియూ మరణములనే షడూర్ములు (ఆరు వికారాలు) లేనివాడుగనుక ఆ హరికి అశోకః అని పేరు.


:: పోతన భాగవతము - దశమ స్కంధము, ఉత్తరభాగము ::

సీ. అవ్యయు ననఘు ననంతశక్తిని బరు లై నట్టి బ్రహ్మ రుద్రామరేంద్ర
వరుల కీశ్వరుఁ డైనవాని సర్వాత్మకు జ్ఞానస్వరూప సమానరహితు
వరదుని జగదుద్భవ స్థితి సంహార హేతుభూతుని హృశీకేశు నభవు
బ్రహ్మచిహ్నంబులై పరఁగు సుజ్ఞాన శ క్త్యాదుల నొప్పు బ్రహ్మంబు నీశు
ఆ. నజు షడూర్మరహితు నిజయోగమాయా వి, మోహితాఖిలాత్ము ముఖ్యచరితు
మహితతేజ నాదిమధ్యాంతహీనునిఁ, జిన్మయాత్ము నిను భజింతుఁ గృష్ణ! (429)

అవ్యయుడవు, అనంత శక్తియుతుడవు, బ్రహ్మాది దేవతలకే అధీశ్వరుడవు, సర్వాత్మకుడవు, జ్ఞాన స్వరూపుడవు, అనుపమానుడవు, వరదుడవు, సృష్టిస్థితిలయకారకుడవు, హృశీకేశుడవు, అభవుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, షడుర్మిరహితుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, యోగమాయచేత సర్వజగత్తును సమ్మోహపరచువాడవు, మహనీయతేజుడవు, ఆదిమధ్యాంత రహితుడవు, చిన్మయాత్ముడవు అయిన ఓ కృష్ణా! నిన్ను ప్రార్ధిస్తున్నాను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 336🌹

📚. Prasad Bharadwaj

🌻336. Aśokaḥ🌻


OM Aśokāya namaḥ

Hariśśokādiṣaḍūrmivarjito’śoka ucyate / हरिश्शोकादिषडूर्मिवर्जितोऽशोक उच्यते Since Lord Hari is free of six six waves of material disturbance viz., hunger, thirst, decay, death, grief and illusion, He is called Aśokaḥ.

🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥

అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥

Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥

Continues....

🌹 🌹 🌹 🌹🌹



🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 337 / Vishnu Sahasranama Contemplation - 337 🌹

📚. ప్రసాద్ భరద్వాజ

🌻337. తారణః, तारणः, Tāraṇaḥ🌻


ఓం తారణాయ నమః | ॐ तारणाय नमः | OM Tāraṇāya namaḥ

తారణః, तारणः, Tāraṇaḥ

భూతాని యస్తారయతి విష్ణుస్సంసార సాగరాత్ ।
స తారణ ఇతి ప్రోక్తో విద్వద్భిర్వేదపారగైః ॥

సంసారసాగరమునుండి జీవులను తరింపజేయును గనుక ఆ విష్ణునకు తారణః అని నామము.

:: శ్రీమద్భగవద్గీత - భక్తియోగము ::

యే తు సర్వాణి కర్మాణి మయి సన్న్యస్య మత్పరాః ।
అనన్యేనైవ యోగేన మాం ధ్యాయన్త ఉపాసతే ॥ 6 ॥
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసారసాగరాత్ ।
భవామి న చిరాత్పార్థ మయ్యావేశితచేతసామ్ ॥ 7 ॥

ఓ అర్జునా! ఎవరు సమస్తకర్మములను నా యందు సమర్పించి, నన్నే పరమగతిగ దలంచినవారై, అనన్య చిత్తముతో నన్నే ధ్యానించుచు ఉపాసించుదురో, నాయందు చిత్తమునుజేర్చిన అట్టివారిని మృత్యురూపమగు ఈ సంసార సముద్రమునుండి నేను శీఘ్రముగా బాగుగ లేవదీయుచున్నాను.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 337 🌹

📚. Prasad Bharadwaj

🌻337. Tāraṇaḥ🌻


OM Tāraṇāya namaḥ

Bhūtāni yastārayati viṣṇussaṃsāra sāgarāt,
Sa tāraṇa iti prokto vidvadbhirvedapāragaiḥ.

भूतानि यस्तारयति विष्णुस्संसार सागरात् ।
स तारण इति प्रोक्तो विद्वद्भिर्वेदपारगैः ॥

Since Lord Viṣṇu uplifts beings from the ocean of saṃsāra or material existence, He is known by the name Tāraṇaḥ.


Śrīmad Bhagavad Gīta - Chapter 12

Ye tu sarvāṇi karmāṇi mayi sannyasya matparāḥ,
Ananyenaiva yogena māṃ dhyāyanta upāsate. 6.

Teṣāmahaṃ samuddhartā mr̥tyusaṃsārasāgarāt,
Bhavāmi na cirātpārtha mayyāveśitacetasām. 7.


:: श्रीमद्भगवद्गीत - भक्तियोगमु ::

ये तु सर्वाणि कर्माणि मयि सन्न्यस्य मत्पराः ।
अनन्येनैव योगेन मां ध्यायन्त उपासते ॥ ६ ॥

तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् ।
भवामि न चिरात्पार्थ मय्यावेशितचेतसाम् ॥ ७ ॥


Those who venerate Me, giving over all activities onto Me (thinking of Me as the Sole Doer), contemplating Me by single-minded yoga - remaining thus absorbed in Me - indeed, O offspring of Pr̥tha (Arjuna), for these whose consciousness is fixed in Me, I become before long their Redeemer to bring them out of the sea of mortal births.


🌻 🌻 🌻 🌻 🌻

Source Sloka

अशोकस्तारणस्तारः शूरश्शौरिर्जनेश्वरः ।अनुकूलश्शतावर्तः पद्मी पद्मनिभेक्षणः ॥ ३७ ॥

అశోకస్తారణస్తారః శూరశ్శౌరిర్జనేశ్వరః ।అనుకూలశ్శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౩౭ ॥

Aśokastāraṇastāraḥ śūraśśaurirjaneśvaraḥ ।Anukūlaśśatāvartaḥ padmī padmanibhekṣaṇaḥ ॥ 37 ॥


Continues....
🌹 🌹 🌹 🌹🌹


13 Mar 2021

No comments:

Post a Comment