✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 37. మహర్షి దేవాపి సాన్నిధ్యము - 11 -2 🌻
నా స్నేహితురాలితో "ఇట్టి పుణ్య పురుషుని ప్రపంచవ్యాప్తముగ నున్న నా మిత్రు లందరికీ పరిచయము చేసినచో ఎంత బాగుండును!” అని పలికితిని. మరునాడుదయము నా ఫోన్ మ్రోగినది.
ఒక వ్యక్తి “రష్యా దేశపు రాజవంశీయులు, రాజశ్రేష్టులు అయిన శ్రీ అలెగ్జాండర్ ప్రభువు మిమ్ములను 'రిడ్జ్' హోటల్ లో కలియుటకు సిద్ధముగా నుందురు. మీరు తప్పక రావలెను.” అని తెలిపి ఫోన్ పెట్టి వేసెను. నేనొక క్షణము బిత్తరపోతిని. 11 గంటలకు హోటల్ ప్రాంగణము చేరితిని.
అచట ప్రభువుగారి కార్యదర్శి నన్ను కలిసి, “మీకు రాజుగారితో ఏమిపని? వారి నుండి మీకేమి కావలయును?” అని ప్రశ్నించెను. నేను మరల బిత్తరపోతిని. వెంటనే మనసు సంబాళించుకొని, “నా కేమియూ పనిలేదని, రాజుగారే నన్ను చూచుటకు రమ్మనిరని తెలిసి వచ్చితినని, వారిని చూచుటకు గాని, వారితో సంభాషించుటకు గాని, నేనెట్టి ప్రయత్నమూ చేయలేదని” తెలిపితిని,
కార్యదర్శి కూడా ఆశ్చర్యపడి అలెగ్జాండర్ రాజు గారి వద్దకు నన్ను తీసుకొని పోయెను. రాజుగారు నన్ను చిరునవ్వుతో ఆహ్వానించి “నేను మీ కేమి చేయగలను?” అని ప్రశ్నించిరి. నాకు మరల ఆశ్చర్యము కలిగినది. నే నాయనను ఏమియూ కోరలేదు.
ఆయన, అమెరికాలో కొందరు వ్యక్తులను కలిసి జ్ఞాన విషయమై చర్చలు జరిపిన బాగుండునని తెలిపిరి. అటుపైన కొన్ని గంటలు మా మధ్య ఆధ్యాత్మిక విషయములు సంభాషణలలో దొర్లినవి. 'ప్రేమమతము' అని ఆయన రచించిన పుస్తకమును నా కందించినారు.
ఒక మిత్రుని ద్వారమున పరిచయమైన అలెగ్జాండర్ గారు ఒక విచిత్ర వ్యక్తిగను, చక్కని ఆత్మ సాధకునిగను గోచరించిరి. వారితో మరియొకమారు మాట్లాడవలెనని మరియొక పార్టీని ఏర్పాటు చేసితిని. మూడవ సమావేశమున అలెగ్జాండరుగారు నన్నిట్లు ప్రశ్నించిరి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 Mar 2021
No comments:
Post a Comment