✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 14. శరీరము - 3 🍀
161. ఒక మూఢడు తాను చర్మము, మాంసము, క్రొవ్వు, వ్యర్థాలతో కూడిన శరీరమని భావించుట మాని, తాను ఒక అత్యున్నతమైన బ్రహ్మముగా, ఆత్మగానూ భావించుచుండిన అపుడు ఉన్నతమైన శాంతిని పొందును.
162. పుస్తక జ్ఞానము కల వ్యక్తి తాను శరీరమనే భావన తొలగించు కొననంత కాలము అది అసత్యములని గ్రహించక అతడు ఆత్మ పరంగా ఔన్నత్యమును సాధించలేడు.
163. నీవు శరీరము యొక్క నీడను నీ శరీరముగా భావించనట్లు, ఈ శరీరము కలలు కనే సూక్ష్మ శరీరము లేక నీవు నీ హృదయములో భావించే ఇతర ఊహలు అన్ని కూడా ఈ శరీరముతో పాటు నశించేవే అని గ్రహించాలి.
164. నీ జన్మ యొక్క దుఃఖాలకు మూల కారణము నీవు శరీరమనే భావన మాత్రమే. అసత్యమైన ఈ శరీరమే నీవను భావనను నీవు అతి జాగ్రత్తతో నాశనము చేయవలెను. ఎపుడైతే నీ మనస్సు నుండి ఈ శరీరమే నీవను భావనను తొలగిస్తావో అపుడే నీకు చావు, పుట్టుకలు లేని స్థితి ఏర్పడుతుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 45 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 The Body - 3 🌻
161. O foolish person, cease to identify thyself with this bundle of skin, flesh, fat, bones and filth, and identify thyself instead with the Absolute Brahman, the Self of all, and thus attain to supreme Peace.
162. As long as the book-learned man does not give up his mistaken identification with the body, organs, etc., which are unreal, there is no talk of emancipation for him, even if he be ever so erudite in the Vedanta philosophy.
163. Just as thou dost not identify thyself with the shadow-body, the image-body, the dream-body, or the body thou hast in the imaginations of thy heart, cease thou to do likewise with the living body also.
164. Identifications with the body alone is the root that produces the misery of birth etc., of people who are attached to the unreal; therefore destroy thou this with the utmost care. When this identification caused by the mind is given up, there is no more chance for rebirth.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
13 Mar 2021
No comments:
Post a Comment