1) 🌹 శ్రీమద్భగవద్గీత - 592 / Bhagavad-Gita - 592 - 18-3 🌹
2) 🌹. భగవద్గీత యథాతథం - 1 - 44🌹
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 372 373 / Vishnu Sahasranama Contemplation - 372, 373🌹
4) 🌹 Daily Wisdom - 100🌹
5) 🌹. వివేక చూడామణి - 63🌹
6) 🌹Viveka Chudamani - 63🌹
7) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 74🌹
8) 🌹. నిర్మల ధ్యానములు - 6🌹
9) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 254 / Sri Lalita Chaitanya Vijnanam - 254🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 592 / Bhagavad-Gita - 592 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 03 🌴*
03. త్యాజం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణ: |
యజ్ఞదానతప:కర్మ న త్యాజ్యమితి చాపరే ||
🌷. తాత్పర్యం :
సర్వకామ్యకర్మలు దోషము వలె త్యాజ్యములని కొందరు విజ్ఞులు పలుకగా, యజ్ఞము, దానము, తపస్సనెడి కర్మలు ఎన్నడును విడువరానివని మరికొందరు మునులు పలుకుదురు.
🌷. భాష్యము :
వేదములందు వివాదాస్పాదములైన పలుకర్మలు కలవు. ఉదాహరణమునకు యజ్ఞమునందు జంతుబలిని ఒసగవచ్చునని తెలుపబడినది. అయినను కొందరు అట్టి బలి యనునవి అత్యంత హేయమని పలుకుదురు. వేదములందు యజ్ఞసమయమున జంతుబలి ఉపదేశింపబడినను వాస్తవమునకు జంతువు వధింపబడినట్లుగా భావింపబడదు. యజ్ఞవిధి జంతువునకు నూతనజన్మను గూర్చగలుగుటయే అందులకు కారణము. యజ్ఞమునందు వధింపబడిన పిమ్మట జంతువుకు కొన్నిమార్లు నూతన జంతుశరీరము కాని లేదా కొన్నిమార్లు వెంటనే మానవజన్మము కాని ఒసగబడుచుండును.
కాని ఈ విషయమున ఋషుల యందు పలు భేదాభిప్రాయములు కలవు. జంతుబలి సర్వదా నిషిద్దమని కొందరు పలుకగా, కొన్ని సమయములందు అది సబబైనదే యని మరికొందరు పలుకుదురు. యజ్ఞకర్మకు సంబంధించిన ఈ భిన్నాభిప్రాయములను శ్రీకృష్ణభగవానుడే స్వయముగా పరిష్కరింపనున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 592 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 03 🌴*
03. tyājyaṁ doṣa-vad ity eke karma prāhur manīṣiṇaḥ
yajña-dāna-tapaḥ-karma na tyājyam iti cāpare
🌷 Translation :
Some learned men declare that all kinds of fruitive activities should be given up as faulty, yet other sages maintain that acts of sacrifice, charity and penance should never be abandoned.
🌹 Purport :
There are many activities in the Vedic literature which are subjects of contention. For instance, it is said that an animal can be killed in a sacrifice, yet some maintain that animal killing is completely abominable. Although animal killing in a sacrifice is recommended in the Vedic literature, the animal is not considered to be killed. The sacrifice is to give a new life to the animal.
Sometimes the animal is given a new animal life after being killed in the sacrifice, and sometimes the animal is promoted immediately to the human form of life. But there are different opinions among the sages. Some say that animal killing should always be avoided, and others say that for a specific sacrifice it is good. All these different opinions on sacrificial activity are now being clarified by the Lord Himself.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. భగవద్గీత యథాతథం - 1 - 044 🌹*
AUDIO - VIDEO
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 1, శ్లోకం 44
44
అహో బ త మహత్ పాపం
కర్తుం వ్యవసితా వయమ్ |
యద్రాజ్యసుఖలోభేన
హంతుం స్వజనముద్యతా: ||
తాత్పర్యము : అహో ! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము ! రాజ్యసుఖమును అనుభవింపవలెననెడి కోరికతో మేము స్వజనమును చంపగోరుచన్నాము.
భాష్యము : స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు సొంత కుటుంబీకులైన సోదరుడినో, తండ్రినో లేదా తల్లినో సంహరించే కార్యాలకు పూనుకొనవచ్చును. చరిత్రలో అట్టి సంఘటనలు జరిగినవనటానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అయితే అర్జునుడు, భక్తుడు కనుక సత్ప్రవర్తన కలిగి, నీతి నియమాలకు కట్టుబడి ఉండే వ్యక్తి కనక అటువంటి సంఘటనలకు అవకాశము ఇవ్వకూడదని తగిన చర్యలు తీసుకుంటున్నాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ….
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #భగవద్గీత #BhagavadGita #గీతాసారం #GitaSaram
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 372, 373 / Vishnu Sahasranama Contemplation - 372, 373 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 372. అమితాశనః, अमिताशनः, Amitāśanaḥ 🌻*
*ఓం అమితాశనాయ నమః | ॐ अमिताशनाय नमः | OM Amitāśanāyanamaḥ*
సంహారసమయే విశ్వమశ్నాతీత్యమితాశనః అమితమగు లేదా అధికమగు పరిమాణము కల అశనము అనగా ఆహారము కలవాడు. ప్రళయకాలమున సమస్త విశ్వమును ఆహారముగా తినును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 372🌹*
📚. Prasad Bharadwaj
*🌻 372. Amitāśanaḥ 🌻*
*OM Amitāśanāyanamaḥ*
संहारसमये विश्वमश्नातीत्यमिताशनः / Saṃhārasamaye viśvamaśnātītyamitāśanaḥ He eats the entire universe during samhāra or dissolution. So amita i.e., not within limits, eater.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरस्सहः ।महीधरो महाभागो वेगवानमिताशनः ॥ ४० ॥
విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరస్సహః ।మహీధరో మహాభాగో వేగవానమితాశనః ॥ ౪౦ ॥
Vikṣaro rohito mārgo heturdāmodarassahaḥ ।Mahīdharo mahābhāgo vegavānamitāśanaḥ ॥ 40 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 373 / Vishnu Sahasranama Contemplation - 373🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 373. ఉద్భవః, उद्भवः, Udbhavaḥ 🌻*
*ఓం ఉద్భవాయ నమః | ॐ उद्भवाय नमः | OM Udbhavāya namaḥ*
ప్రపంచోత్పత్యుపాదానకారణత్వాద్య ఉద్గతః ।
భవాదస్మాద్ధి సంసారాదిత్యుద్భవ ఇతీర్యతే ॥
ఈతని నుండి సంసారము ఉద్భవించును. ప్రపంచమునకు కుండకు మన్నువలె ఉపాదానకారణముగా ఉన్నవాడు. లేదా సంసారము నుండి పైకి/వెలికి వచ్చినవాడు; జన్మరహితుడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 373🌹*
📚. Prasad Bharadwaj
*🌻373. Udbhavaḥ🌻*
*OM Udbhavāya namaḥ*
प्रपंचोत्पत्युपादानकारणत्वाद्य उद्गतः ।
भवादस्माद्धि संसारादित्युद्भव इतीर्यते ॥
Prapaṃcotpatyupādānakāraṇatvādya udgataḥ,
Bhavādasmāddhi saṃsārādityudbhava itīryate.
As He is the material cause of the utpatti or origination of the universe, He is Udbhavaḥ. Or because He is udgataḥ or free from bhava saṃsāra or material world, He is Udbhavaḥ.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥
Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 100 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 9. Happiness is Nowhere to be Found where Perfection is Absent 🌻*
Varna does not mean ‘colour’ referring to the Aryan or the Dravidian difference of skin, nor indicating anything like the superior and the inferior in the social organisation of human beings. To think so would be a total misconstruing of fact.
Varna is not a ‘colour’ visible to the eyes but a ‘degree’ conceivable by the mind; which means to say that by the term ‘varna’ we are to understand the degrees of expression of dharma in human society in such a way that their coming together or coordination will sustain human society and existence.
Though life is a continuous and single whole enshrining in its bosom knowledge, power, richness and energy, it cannot be manifest in any particular human individual in such a comprehensive fashion unless he is a Superman (ati-manava). In ordinary human beings, such a blending of the four factors is impossible. Happiness is nowhere to be found where perfection is absent.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #DailyWisdom #SwamiKrishnananda
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 63 / Viveka Chudamani - 63🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 19. బ్రహ్మము - 3 🍀*
226. అత్యున్నతమైన ఈ బ్రహ్మము ఒక్కటే నిజమైనది. వేరేది ఏది లేదు. ఆత్మ ఒక్కటే ఉన్నది. ముఖ్యముగా స్వతంత్రమైన ఏ ఇతర తత్వము, సత్యము గ్రహించిన తరువాత ఈ ఉన్నత సత్యానికి మించేది ఏది లేదు అని గ్రహిస్తుంది.
227. ఈ విశ్వమంతా అజ్ఞానము వలన వివిధ ఆకారాలలో కనిపిస్తుంది. అదంతా బ్రహ్మము మాత్రమే. దానికి ఏ విధమైన అడ్డంకులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో ఉంటుంది. మానవ పరిమితులకు లోనుకాదు.
228. ఒక జాడి మట్టితో చేయబడినప్పటికి మట్టి కంటే వేరు కాదు. ఎక్కడైన, ఎప్పుడైన అది మట్టి కంటే వేరు కాదు. అపుడు దానిని పాత్ర అని ఎందుకు పిలవాలి. అది కేవలము భావనతో పెట్టిన పేరు మాత్రమే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 63 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 19. Brahman - 3 🌻*
226. It is this Supreme Oneness which alone is real, since there is nothing else but the Self. Verily, there remains no other independent entity in the state of realisation of the highest Truth.
227. All this universe which through ignorance appears as of diverse forms, is nothing else but Brahman which is absolutely free from all the limitations of human thought.
228. A jar, though a modification of clay, is not different from it; everywhere the jar is essentially the same as the clay. Why then call it a jar ? It is fictitious, a fancied name merely.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #వివేకచూడామణి #VivekaChudamani
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 74 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 55. నూతన శంఖారావము 🌻*
అసత్యభాషణము చేయువాని జీవనము ముళ్ళ తివాచీవలె నుండును. దానిపై నడకగాని, పడకగాని సుఖము నీయదు. అసత్యభాషణము, ప్రవర్తనము ఆధారముగ నిర్మింపబడు జీవనము ఎప్పటికప్పుడు పేకమేడవలె కూలుటకు సిద్ధముగ నుండును. అసత్యభాషి తానుచ్చరించు వాక్యములపై విశ్వాసము కలిగి యుండడు. క్రమశః తనపై తనకు విశ్వాసము కోల్పోగలడు.
ప్రస్తుతమున కొందరు వ్యక్తులు, పీఠాధిపతులు, మతములు తామాడిన అసత్యముచే నిర్మించుకొనిన పేకమేడలను నిలుపుకొనుటకు నిర్విరామముగ కృషి చేయుచున్నారు. భయము చెందియున్నారు. ఇట్టివారు మతాధిపతులు గానే కాక శాస్త్రవేత్తలుగను, విద్యావేత్తలుగను, రాజకీయనాయకులుగను పెద్ద పెద్ద పదవుల నలంకరించి యున్నారు.
రాబోవు కాలము కుంభ చైతన్య సంబంధితమగుటచే వీరి ప్రవర్తనము లన్నియు ప్రజల ముందు కాలపురుషుడు ఎండగట్టుట జరుగును. దీనికి నాంది ఉపాసిక (H.P.B.) చేసిన శంఖారావమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 6 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. ప్రేమ సమగ్రమైనది. సంపూర్ణత నిస్తుంది 🍀*
ప్రేమ వున్న మనిషి సమగ్రంగా వుంటాడు కాబట్టి అతనికి సంపూర్ణంగా ఎట్లా జీవించాలో తెలుసు. అతని శరీరం ప్రేమతో నిండి వుంటుంది. అతని శరీరకణాలు ప్రేమతో నాట్యం చేస్తూ వుంటాయి. అతని మనసు ప్రేమతో తొణికిసలాడుతూ వుంటుంది.
తర్కంతో కాదు ప్రేమతో నిండి వుంటుంది. అతని హృదయం ప్రేమభరితమై వుంటుంది. అది కేవలం రక్తాన్ని పరిశుభ్రం చేసే ఉపకరణం మాత్రమే కాదు, శ్వాసించే పరికరం మాత్రమే కాదు. అతను ప్రేమని శ్వాసిస్తాడు. ప్రేమని వదులుతాడు. అతని ఆత్మ స్వచ్ఛమైన ప్రేమ. అది ప్రేమ సముద్రం.
అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించడానికి సంసిద్ధుడు. అట్లాంటి వ్యక్తిని కాదని ఉనికి ఎక్కడ దాక్కుంటుంది? నిజానికి అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించాల్సిన పన్లేదు. అస్తిత్వమే అన్వేషించుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అక్కడున్న సౌందర్యమదే. అస్తిత్వం అన్వేషిస్తూ పరిశోధిస్తూ నిన్ను సమీపించినపుడు అదట్లాగే వుంటుంది.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 254 / Sri Lalitha Chaitanya Vijnanam - 254 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀*
*🌻 254. 'ధ్యాన ధ్యాతృ ధ్యేయరూపా'🌻*
చింతనము, చింతన గమ్యము, చింతించు జీవుడు, అను మూడు రూపములుగ ఉండునది శ్రీదేవి అని అర్థము. చింతన గమ్యము శుద్ధ చైతన్యము. అందుండి చింతించు జీవుడు జన్మించును. అతని గమ్యము పుట్టిన చోటికి చేరుటయే. దీనినే స్వస్థానమున కేగుట అందురు. సత్య స్వరూపుడగు జీవుడు మేల్కాంచుట శ్రీదేవి కారణముగ జరుగును. మేల్కాంచిన జీవుడు చింతన మారంభించును.
చింతనము త్రివిధములుగ అవతరణము చెందును. అవియే ఇచ్ఛా, జ్ఞాన, క్రియలు. వాని ననుసరించు జీవుడు, మనస్సు, పంచేంద్రియముల ద్వారా పంచతత్త్వములతో కూడిన సృష్టియందు ప్రవేశించును. ఇట్లు త్రిగుణములను, పంచతత్త్వములను ఆధారము చేసికొని జీవుడు బహిరంగము జేరును. ఇట్టి జీవుడు మరల అంతరంగుడై స్వస్థానము చేరుటకు ధ్యానము అవసరము.
తాను పుట్టిన చోటికి చేరుటకే ఈ ధ్యానము. తాను పుట్టిన చోటును గూర్చి చింతన చేయుటయే అన్ని ధ్యానముల పర్యవసానము. ఈ ధ్యానమునే గాయత్రీ ధ్యాన మనిరి. తానెచ్చట పుట్టినాడు తన ఉత్పత్తికి మూలమేమి? తానున్నా డన్న భావము కలుగుటకు మూలమేమి? తన భావములకు తాను మూలము. తనకు మూలము? తన మూలమును ధ్యేయముగ ధ్యానము చేయుట నిజమగు గాయత్రీ ధ్యానము.
ఇది నిత్య చింతన మైనపుడు, నిరంతర చింతనమైనపుడు ధ్యాసగ మారును. ఇట్టి ధ్యాసయే ధ్యానము. ధ్యానము చేయుట యందు ధ్యాస కలుగుట స్వస్థానము చేరుటకు ప్రధానము. సాధన యందు ఇది తుది మెట్టు. ప్రకృతులు (త్రిగుణములు, పంచేంద్రియములు) ద్వారా బహిరంగము చేరిన జీవుడు త్రిగుణములయందు తన్ను తాను బంధించుకొనును.
ఇచ్ఛా పూర్ణమే కార్యక్రమముగ లక్షల జన్మలు సాగిపోవు చుండును. ఇచ్ఛా పూర్ణ కార్యక్రమములో భాగముగ ఇంద్రియాసక్తి, విషయాసక్తి తామర తంపరలుగ పెరిగి అందు జీవుని అగమ్యుని చేయును. గతిలేని జీవుడు చేయునది లేక మూలకారణము కొఱకు వెదకును. గతి లేకయే కదా, గజేంద్రుడు మూలకారణమును గూర్చి ప్రార్థన చేసెను.
ధ్యానించుటకు కూడ వలసిన ప్రేరణ శ్రీదేవి అనుగ్రహమే. అనుగ్రహము లేనివారు దైవమును గూర్చి ధ్యానము చేయలేరు. ప్రార్థనలు చేయలేరు. ప్రారబ్దము విఘ్నములు కలిగించు చుండగ ప్రార్థన లెట్లు జరుగగలవు? ధ్యానమునకు అనుగ్రహము శ్రీదేవి. ధ్యానము, ధ్యేయము శ్రీదేవి అని వివరింపబడినది. ధ్యానించు జీవుడు కూడ శ్రీదేవి నుండి ఏర్పడిన వాడే. జీవుడు స్వయముగ చైతన్య స్వరూపుడు. స్వయంప్రకాశకుడు.
అష్ట ప్రకృతుల లోనికి సంసరణము చెందినపుడు తనను గూర్చిన ఎఱుక కోల్పోవును. నిజమున కతడు కూడ సముద్రము నందు అలవలె శ్రీదేవి అంశ. అల సముద్రమే కదా! అట్లే మహాచైతన్యమగు శ్రీదేవి నుండి ఉద్భవించినవాడే జీవుడు. శ్రీదేవి సత్, చిత్ రూపిణి. జీవుడు కూడ సత్ చిత్ రూపుడే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 254 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻 Dhyāna-dhātṛ-dhyeya-rūpā ध्यान-धातृ-ध्येय-रूपा (254) 🌻*
She is the form of a triad – the meditation, the meditator and the object of meditation. This triad leads to another triad – the knower, the known and the knowledge. Higher level of spiritual knowledge can be attained only through dhyāna or meditation. Meditation is only a process of powerful concentration. Reading books and listening to sermons are not knowledge.
Knowledge is attained through internal quest and exploration. The store house of knowledge is not extraneous, but within. The store house is nothing but the Supreme Self. Please refer nāma 251 also.
Patañjali Yoga Sūtra (III.2) explains this further. “Unbroken flow of that concentration in that object is called dhyāna.”
Kashmiri Saivism has unique advaita philosophy known as trika, a triad formed out of Śiva, Śaktī and nara or soul.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #లలితాదేవి #LalithaDevi #లలితాసహస్రనామ #LalithaSahasranama
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment