నిర్మల ధ్యానాలు - ఓషో - 14
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 14 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నువ్వు రెండింటికి అతీతమైన వాడివి. ఏది పుట్టదో, ఏది మరణించదో నువ్వు దానికి సంబంధించిన వాడివి. 🍀
శరీరం పుడుతుంది. శరీరం చనిపోతుంది. మనసు పుడుతుంది. మనసు చనిపోతుంది. ఐతే నువ్వు శరీరం కాదు. మనసు కాదు. నువ్వు రెండింటికి అతీతమైన వాడివి. ఏది పుట్టదో, ఏది మరణించదో నువ్వు దానికి సంబంధించిన వాడివి. నువ్వు ఎపుడూ యిక్కడే వున్నావు. ఇక్కడే వుండబోతున్నావు.
వ్యక్తి ఈ విషయాన్ని ఎప్పుడు అనుభూతి చెందుతాడో అపుడు జీవితం పట్ల అతని దృష్టి మారిపోతుంది. దృక్పథంలో పరివర్తన వస్తుంది. అప్పటిదాకా దేన్ని ముఖ్యమనుకుంటున్నాడో అది ప్రాధాన్యాన్ని కోల్పోతుంది. ధనం, అధికారం, గౌరవం అన్నీ పేలవమయిపోతాయి. అంతకు ముందు దేనిపట్ల నిర్లక్షంగా వుండేవాడో అది అపుడు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించు కుంటుంది.
ప్రేమ, అనురాగం, ధ్యానం, ప్రార్థన, దైవత్వం ముఖ్యమవుతాయి. నీలో ఒక శాశ్వతమయినది వుందని గుర్తించు.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
09 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment