దేవాపి మహర్షి బోధనలు - 82
🌹. దేవాపి మహర్షి బోధనలు - 82 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 63. యోగవిద్య 🌻
శబ్దము నుచ్చరించు శాస్త్రము వ్యాకరణ మనబడును. దేవతలీ శాస్త్రమును దర్శించి మానవులయందు ఉచ్చారణశక్తి నేర్పరచి నాలుకపై వాక్కును స్థిరపరచిరి. మానవులకు దేవతల వలన కలిగిన శక్తియే వాక్కు. దేవతలకు శబ్ద శాస్త్ర దర్శనము జరుగుటకు వారి యందలి అంతర్యామి ప్రజ్ఞయే కారణము.
దేవుడే శ్వాసగా జీవుని రూపమున దిగివచ్చు చున్నాడు. లోక సంహితార్థము కొరకు దేవుడే తన్ను తాను వేరుగా గుర్తించి మనస్సుగా దిగివచ్చు చున్నాడు. అట్లు దిగివచ్చిన వెనుక శ్వాస వేరుగ, మనస్సు వేరుగ ఉచ్చారణ శక్తి, వాకశక్తి వినియోగించుచున్నవి. వాణ్నియమముతో మనస్సును మరల శ్వాసతో కూర్చి తనను తాను తెలియుటయే యోగవిద్య.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
09 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment