వివేక చూడామణి - 71 / Viveka Chudamani - 71


🌹. వివేక చూడామణి - 71 / Viveka Chudamani - 71🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 19. బ్రహ్మము - 11 🍀


252. మనం కలల్లో చూసే ప్రదేశం, సమయము, వస్తువులు తెలుసుకొనేవాడు మొదలగునవన్నియూ అసత్యములే, అదే విధముగా మనము ఎఱుక స్థితిలో అనుభవించే ఈ ప్రపంచము అంతా ఆ వ్యక్తి యొక్క అజ్ఞాన ఫలితమే.

ఎందువలనంటే ఈ శరీరము, శరీర భాగాలు, ప్రాణాలు, అహం అనునవి కూడా అసత్యములే. అందువలన నీవు పవిత్రమైన, స్వచ్ఛమైన, ఉన్నతమైన బ్రహ్మానివే కాని రెండవది ఏదీ కాదని గ్రహించాలి.

253. ఏదైతే తప్పుగా భావించటం జరుగుతుందో, ఒక వస్తువులో నిజమైనది ఏది అని తెలుసుకొనినపుడు, అది ఒక మూల పదార్థమని దానికి వేరుగా ఏమి కాదని అర్థమవుతుంది. మార్పులతో కూడిన కలలో ఒకటి కనిపించి మాయమవుతుందో అది మెలుకల స్థితిలో ఆ వస్తువు లేనిదే అని, అది తన ఆత్మ కంటే వేరు కాదని తెలుస్తుంది.

254. కుల, మతాలకు, కుటుంబము, వంశము అలానే పేరు, ఆకారము, ఎక్కువ, తక్కువ, మార్పు చెందే ఆకాశము, సమయము, మనం గ్రహించే వస్తు సముదాయము అయిన దంతయూ బ్రహ్మమే అయి ఉన్నది. అట్టి బ్రహ్మమును గూర్చి నీవు నీ మనస్సులో ధ్యానించుము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 71 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj



🌻 19. Brahman - 11 🌻

252. As the place, time, objects, knower, etc., called up in dream are all unreal, so is also the world experienced here in the waking state, for it is all an effect of one’s own ignorance. Because this body, the organs, the Pranas, egoism, etc., are also thus unreal, therefore art thou that serene, pure, supreme Brahman, the One without a second.

253. (What is) erroneously supposed to exist in something, is, when the truth about it has been known, nothing but that substratum, and not at all different from it: The diversified dream universe (appears and) passes away in the dream itself. Does it appear on waking as something distinct from one’s own Self ?

254. That which is beyond caste and creed, family and lineage; devoid of name and form, merit and demerit; transcending space, time and sense-object – that Brahman art thou, meditate on this in thy mind.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


09 May 2021

No comments:

Post a Comment