నిర్మల ధ్యానాలు - ఓషో - 15


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 15 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. నిజమైన ఐశ్వర్యం అన్నది నీ లోపల వుంటుంది. అది ఆత్మాశ్రయమైంది. అది నీ ఆత్మకు సంబంధించింది. 🍀

దేవుడు నీలోనే వున్నాడు . నిద్ర లేచిన వాళ్ళ భోదనల సారాంశం అది . తప్పని సరయిన భోధన అది. ఎక్కడకీ వెళ్ళకు. ఎక్కడా వెతక్కు నీకు ఎక్కడా కనిపించదు. బాహ్యంలో నీకేమీ కనిపించదు. నువ్వు అట్లాంటి ప్రయత్నంలో ఫలితం అందుకోలేవు. అసంపూర్ణంగా అసహనంగా, శూన్యంగా మిగిలిపోతావు. కారణం నిజమైన ఐశ్వర్యం అన్నది నీ లోపల వుంటుంది. అది ఆత్మాశ్రయమైంది. అది నీ ఆత్మకు సంబంధించింది.

సాధారణ మానవుడు బహిర్ముఖుడు. నువ్వు పూర్తిగా దానికి వ్యతిరేకదిశలో సాగితే అది అంతర్ముఖత్వ మవుతుంది. నేను ప్రపంచానికి వ్యతిరేకిని కాను, వ్యక్తి ప్రమాదకారుడనీ అనను. ఒకసారి నిన్ను గూర్చి నువ్వు తెలుసుకుంటే నువ్వు ప్రపంచమంతా తిరగవచ్చు. నీ ఆనందాన్ని పంచుకోవచ్చు. నువ్వు ఆనందంలో జీవించవచ్చు. అప్పుడు సమస్య వుండదు.

నువ్వు నీ అస్తిత్వంలో పునాది కలిగి వుంటే నీకు యిష్టమయినంత బహిర్ముఖంగా వుండవచ్చు. ఏదీ నీకు అపకారం కలిగించదు. నువ్వు మార్కెట్ మధ్యలో వుండొచ్చు. కానీ నీ ధ్యానాన్ని ఏదీ ఆటంకపరచలేదు. మొదటి విషయం, ముఖ్యమయిన విషయం నీలో నువ్వు నిలదొక్కుకోవాలి.

నీలో నువ్వు నిలవాలి. నీ లోపలి వాస్తవంతో నిలవాలి. నా ప్రయత్నమంతా నీలో నిన్ను నిలపడానికే. నేను నీకు సత్యాన్ని యివ్వలేను. ఎవరూ అందివ్వలేరు. కానీ అదెక్కడ దొరుకుతుందో సూచన యివ్వగలను. అది చంద్రుడి మీద కనిపించదు, ఎవరెస్టు శిఖరం మీద కనిపించదు. అది నీలోనే కనిపిస్తుంది. కళ్ళు మూసుకుని నీ లోపలి దాన్ని చూడడం నేర్చుకో.

సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


11 May 2021

No comments:

Post a Comment