దేవాపి మహర్షి బోధనలు - 83
🌹. దేవాపి మహర్షి బోధనలు - 83 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 64. అంతఃకరణములు 🌻
భగవంతుడు మానవుడుగా భూమిపై దిగివచ్చినపుడు అతని చతుర్వ్యూహము కూడ అతనితో దిగివచ్చును. తాను వాసుదేవుడుగ దిగివచ్చును. తన అహంకారము సంకర్షణుడుగ దిగివచ్చును. తన బుద్ధి ప్రద్యుమ్నుడుగ దిగివచ్చును. తన మనోశక్తి అనిరుద్ధుడుగ దిగివచ్చును.
శ్రీ కృష్ణావతారమున పై నాలుగు వ్యూహములు వరుసగ శ్రీకృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడుగా దేహమును ధరించిరి. శ్రీ రామావతారమున పై చతుర్వ్యూహములే, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడుగ దిగివచ్చిరి. పై వ్యూహము లన్నియు మానవుని యందు గూడ స్థితి గొన్నవి.
అందు మొదటిది మానవుని యందలి దైవము. రెండవది అతని అహంకారము. మూడవది అతని బుద్ధి, నాల్గవది అతని మనస్సు. ఈ చతుర్వ్యూహములే అంతఃకరణములు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
11 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment