వివేక చూడామణి - 72 / Viveka Chudamani - 72


🌹. వివేక చూడామణి - 72 / Viveka Chudamani - 72 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 19. బ్రహ్మము - 12 🍀


255. అత్యున్నతమైన ఆ బ్రహ్మము మాటకు అందనిది. అయితే అది స్వచ్ఛమైన దివ్య దృష్టికి పూర్తి జ్ఞానము వలన మాత్రమే తెలుసుకొన బడుతుంది. ఆది అంతము అనేది లేని సత్యము అయిన ఆ బ్రహ్మమును నీవు నీ మనస్సులో ధ్యానించుము.

256. ఆరు విధములైన మార్పులకు అనగా క్షీణించుట, చావు, ఆకలి, దప్పిక, విచారము, మాయ అను వాటికి అంటని యోగి యొక్క హృదయము జ్ఞానేంద్రియములకు అందనిది, బుద్దికి తెలియనిది, మరియు శుద్ద తత్వమైన బ్రహ్మానివే నీవు. అట్టి నీవు నీ మనస్సులో బ్రహ్మాన్ని ధ్యానించుము.

257. మాయచే సృష్టించబడిన విశ్వములోని వివిధ పదార్థముల వివిధ దశలు, వాటికి ఏ విధమైన ఆధారము లేదు. ఈ సృష్టి మొత్తానికి ప్రత్యేకమైనది, ఏవిధమైన విభజన లేనిది, దేనితోనూ పోల్చలేనిది అయిన ఆ బ్రహ్మానివే నీవు. నీ మనస్సులో ఆ బ్రహ్మాన్ని ధ్యానించుము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 72 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 19. Brahman - 12 🌻


255. That Supreme Brahman which is beyond the range of all speech, but accessible to the eye of pure illumination; which is pure, the Embodiment of Knowledge, the beginningless entity – that Brahman art thou, meditate on this in thy mind.

256. That which is untouched by the sixfold wave; meditated upon by the Yogi’s heart, but not grasped by the sense-organs; which the Buddhi cannot know; and which is unimpeachable – that Brahman art thou, meditate on this in thy mind.

257. That which is the substratum of the universe with its various subdivisions, which are all creations of delusion; which Itself has no other support; which is distinct from the gross and subtle; which has no parts, and has verily no exemplar – that Brahman art thou, meditate on this in thy mind.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹


11 May 2021

No comments:

Post a Comment