నిర్మల ధ్యానాలు - ఓషో - 16


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 16 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అంతా దైవికమే. కేవలం దైవత్వమే వుంది. 🍀


అంతా దైవికమే. కేవలం దైవత్వమే వుంది. దేవుడు వ్యక్తి కాదు. ఒక లక్షణం, దేవుడు వ్యక్తి కాడు ఒక సామీప్యం. దేవుడు వ్యక్తి అన్నది మానవ పరిణామానికి సంబంధించిన భావన. ఆ వూహని మన వూహాలతో రూపొందించాం. మనిషిని పెద్ద చేసి చూపించడం తప్ప మరొకటి కాదు. అతను నిజమైన దేవుడు కాడు.

అందుకనే బుద్ధుడు దేవుడికి సంబంధించి ఏమీ మాట్లాడలేదు. మౌనంగా వుండిపోయాడు. బుద్ధుడు దైవత్వం గురించి మాట్లాడాడు. దేవుడి గురించి మాట్లాడలేదు. నా అనుభవం కూడా కచ్చితంగా అలాంటిదే. దేవుడు లేడు. దైవత్వముంది.

సమస్త అస్తిత్వం దైవత్వంతో పొంగిపొర్లుతోంది. దేవుడికి, ప్రపంచానికి మధ్య ఎట్లాంటి విభజన లేదు. అస్తిత్వమన్నది దైవత్వం. ఈ దృష్టిలో అస్థిత్వాన్ని చూడు. నువ్వు ఆశ్చర్యానికి లోనవుతావు. నువ్వు అంతకు ముందు చూడని వాటిని చూసి దిగ్రమకు లోనవుతావు.

నువ్వు ప్రతి రోజు వాటిని చూస్తూనే వున్నావు. అవే పక్షులు, అవే చెట్లు, అదే జనం దైవత్వం నిండిన దృష్టితో చూస్తే, ఆ కొత్త కాంతిలో వాటిని చూస్తావు. అపుడు ప్రపంచమొక పజిల్ కాదు, సమస్య కాదు, ప్రశ్న కాదు. ప్రపంచం పరిష్కరించాల్సిన ప్రశ్న కాదు. ప్రపంచం మనం జీవించాల్సిన రహస్యం.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


13 May 2021

No comments:

Post a Comment