🌹. దేవాపి మహర్షి బోధనలు - 84 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 65. అవధూత దేహ ధర్మము 🌻
అపక్వాహారము, అల్పాహారము, అధికముగ జలములను సేవించుట వలన క్రోధాదులు తగ్గి సత్త్వగుణ మలవడును. మైపూతలు మాని కేవలము శుచికై జలస్నానము చేయుట, శరీరమునకు ఇతర సంస్కారములు అనగ, జుట్టు, గడ్డము, మంగలిపని చేయింపక విడచుట. యివి యతి ధర్మములు.
ఒక వయస్సు దాటి వార్ధక్యము సమీపించు కొలదియు తెలియకయే దేహమునకు సుఖించు కోరిక పెరుగును. దానివలన దేహము రోగాక్రాంత మగును. అవధూత ధర్మము వహించినచో చిట్ట చివరి క్షణము వరకు దేహము ఆరోగ్యముగ నిలబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
13 May 2021
No comments:
Post a Comment