నిర్మల ధ్యానాలు - ఓషో - 19


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 19 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం గతంలోకి, భవిష్యత్తులోకి పోవడం ఆపితే ద్వందం మాయం అవుతుంది. 🍀


మనం అస్తిత్వానికి ఎంతో సన్నిహితంగా వున్నాం. కానీ పక్క పక్కనే నడుస్తున్నాం. పక్కన సాగే దారిలో నడుస్తున్నాం. ఆ రెండు దారులు కలవ్వు. మనం గతంలోకి, భవిష్యత్తులోకి పోవడం ఆపితే ఆ రెండుదార్లూ క్రమంగా దగ్గరవుతాయి. ఒకటవుతాయి. ఒక రోజు హఠాత్తుగా ఒకే దారి మిగుల్తుంది. రెండుదార్లూ అదృశ్యమవుతాయి.

అక్కడ గొప్ప ఆనందం క్షణం, గొప్ప ఆరాధనా క్షణం ఆవిష్కారమవుతుంది. ప్రతి ఒక్కరూ ఆ క్షణం కోసమే ఆరాటపడతారు. అన్వేషిస్తారు. కానీ జనం దారి తప్పుతారు. బాధలు పడతారు. సిద్ధం కా. సిద్ధం కావడమంటే ఈ క్షణంలో జీవించడానికి సిద్ధపడడం. అప్పుడు నువ్వు అస్తిత్వానికి ఆశ్రయమవుతావు. అదే జీవితానికి పరిపూర్ణతను యిచ్చేది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


20 May 2021

No comments:

Post a Comment