దేవాపి మహర్షి బోధనలు - 87


🌹. దేవాపి మహర్షి బోధనలు - 87 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 68. బ్రహ్మచర్య వ్రతము 🌻

వ్రతములలోకెల్ల బ్రహ్మచర్య వ్రతము శ్రేష్ఠమైనది. మొదట శారీరక బ్రహ్మచర్యము, అటుపైన మానసిక బ్రహ్మచర్యము సాధించు కొనవలెను. మనసు బ్రహ్మమునందే చరించినచో బ్రహ్మచర్య వ్రతము పరిపూర్తి యగును. బ్రహ్మచర్యము, భోగజీవనము పరస్పర విరుద్ధములు. యోగి భోగియై కూడా నుండగలడు. కాని భోగి యోగి కానేరడు. యోగసిద్ధి కలుగునంత వరకు భోగజీవనమునకు ఉన్ముఖత్వము చూపరాదు.

కేవలము భౌతికమైన బ్రహ్మచర్య మవలంబించిన చాలదు. మనస్సును, బ్రహ్మమును మరల మరల జ్ఞప్తికి తెచ్చుకొనుచు, అరిషడ్వర్గములు చేరనివ్వని మనస్సు నేర్పరచుకొనవలెను. బ్రహ్మ భావమును ఊహించుచు, శ్లాఘించుచు అందరి సుఖమే ప్రధానముగ జీవించువాడు బ్రహ్మచర్య వ్రతదీక్షను అవలంబించిన వాడగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 May 2021

No comments:

Post a Comment