శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 267 / Sri Lalitha Chaitanya Vijnanam - 267


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 267 / Sri Lalitha Chaitanya Vijnanam - 267 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀

🌻267. 'గోవిందరూపిణీ'🌻


రక్షించు గుణముతో కూడిన విష్ణురూపము కలది శ్రీదేవి అని అర్థము. రక్షణము శ్రీదేవి రెండవ కృత్యము. మొదటి కృత్యము సృజనము. హరివంశము నందు నారదుడు ఇట్లు పలికెను. “ప్రకృతి యొక్క రెండవ తత్త్వము సర్వమయుడు. సర్వవ్యాప్తియైన విష్ణువు. విష్ణువు లోక రక్షకుడు, స్త్రీ సంజ్ఞ గలవాడు. ఇదియే శ్రీమాత జగన్మోహిని లేక జగన్మోహన రూపము.

రక్షకుడు గనుక గో శబ్దము అతనికే తగినది. పూర్వము భూమిని నశింపజేయుటకు అసుర శక్తులు ప్రయత్నింపగ శ్రీమాత విష్ణురూపమున భూమిని రక్షించెను. అప్పుడు దేవతలు విష్ణురూపిణియైన శ్రీమాతను గోవిందరూపిణి అని స్తుతించిరి. గాం + విందతి - గోవింద అయినది. 'గాం' అనగా భూమి. భూమిని రక్షించిన శక్తి అని గోవింద పదమున కర్ణము. గో అనిననూ భూమియే. భూమి, గోవు, ఇంద్రియములు, సూర్య కిరణములు వీటన్నిటిని గో శబ్దముతో పిలుతురు. స్రవించునవి అన్నియూ గోవులే. ఇట్టివాని నన్నింటినీ రక్షించువాడు గోవిందుడు.

మన శరీరము భూమి వంటిది గావున గోవు. వానిని నడిపించు ఇంద్రియములు గోవులు.

ఇంద్రియానుభవము వలన స్రవించు ఆనందము గోవు. మన యందలి గ్రంథులు గోవులు. అవి స్రవించినపుడే ఉత్తమ మగు ఆనందము కలుగును. ఇట్లు రసానుభూతి, రక్షణము నిచ్చు తత్త్వముగ గోవింద తత్త్వమున్నది. గోవింద రూపిణిగ యున్నది శ్రీదేవియే.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 267 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Govinda-rūpiṇī गोविन्द-रूपिणी (267) 🌻


Govinda is Viṣṇu. Viṣṇu is the protector of this universe. When one needs health, wealth and prosperity one has to worship Viṣṇu. Viṣṇu should not be worshipped alone to get material prosperity and should be worshipped along with His consort Lakṣmī and this form is known as Lakṣmī Nārāyana. This form is considered as the most auspicious form. If one needs to get rid of some difficulties, one has to pray Lakṣmī Nārāyaṇa form of Viṣṇu. Narasiṃha, also known as Nārasiṃha form of Viṣṇu is considered as the only terrible form; otherwise Viṣṇu is considered as the most auspicious God.

Viṣṇu is known through Veda-s and Upaniṣads. Go (गो) means vāc or words. Since the qualities of Viṣṇu cannot be described by words He is called Govinda. Go also means earth. Since He sustains the earth, He is called Govinda. When the great dissolution took place (refer nāma 232), Viṣṇu lifted and saved the earth (earth is only a part of the universe) from water that prevailed everywhere. Because He saved the earth, He is called Govinda.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


20 May 2021

No comments:

Post a Comment