మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 21
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 21 🌹
✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. సామ్రాజ్య పరిపాలనము, (రాచరికము), సామ్యవాద పరిపాలనము 🌻
సామ్రాజ్య పరిపాలనము, (రాచరికము), సామ్యవాద పరిపాలనము నరజాతి చరిత్రలో తరంగములవలె పర్యాయములగు చుండును.
సామ్రాజ్య పాలక విధానమున (రాచరికము) ప్రభువు హృదయమువలె కేంద్రము, మంత్రి సామంతాదులు మనోబుద్ధ్యహంకారాదులవలె ఉపకరణములు.
రాజ్య సంపద రక్తమువలె జీవనాడియై ప్రవహించుచుండును. ప్రజా సమూహము దేహధాతువులవలె పోషణము నొందుచుండును. ఇట్టిది ఆరోగ్యవంతమైన దేహస్థితి వంటిది రాజ్యాంగము.
అందు ఆహారపానీయముల వలె సంపదలు ఆవశ్యకతను బట్టి వినిమయమగుచు ఎపుడు ఆచరించ వలసిన దానిని అపుడు కాలమే నిర్దేశించుచుండును. దానిని ఆచరించుటకన్నా మరియొక సత్యము లేదు.
సంశయములు తర్కము వలనగాని, ప్రశ్నోత్తరముల వలన గాని తొలగవు.
ప్రజ్ఞలోని మడతలు విచ్చుకొని విశాలత్వము ఏర్పడినపుడు మాత్రమే తొలగిపోవును. కారణమేమనగా ప్రశ్నలు స్వభావము నుండి పుట్టినవిగాని, జవాబుల కొరకు పుట్టినవి కావు.
🌹 🌹 🌹 🌹 🌹
03 May 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment