మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 24


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 24 🌹

✍️. సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚. ప్రసాద్ భరద్వాజ


🌻. శ్వేత ద్వీపము 🌻


🌻జగత్తులన్నిటినీ వెలిగించే అచ్చమయిన వెలుగే శ్వేతమంటారు. ఈ వెలుగే సర్వతారకా‌ వ్యూహాలకు మూలమయినది.

ఈ వెలుగు నుండి వెలువడుచున్న కాంతిధారయే ఆకాశగంగయై శింశుమార చక్రాన్నంతా తడుపుచు, సప్తర్షిమండలం, ఆపై సూర్యమండలం, చంద్రమండలం ఇలా సమస్తానికి ఆధారమయిన కాంతిగా విస్తరిస్తూ వస్తోంది.

ఇట్టి అచ్చమయిన తెల్లని వెలుగు యొక్క, కొలతలకందని ముద్దయే "శ్వేతద్వీపం".

ఈ వెలుగు ప్రవాహంలో మునకలెత్తుచు, తామంటూ లేక ఆ వెలుగుగానే జీవించే మహాత్ముల నివాసమొకటి ఈ‌ భూమిపై‌ కలదు. అదియు శ్వేతద్వీపమే.

అచ్చమయిన వెలుగు యొక్క అనుభూతి ఈ శ్వేతద్వీపవాసుల ద్వారమున మంద్రస్పర్శగా పరమ గురువులకు అందుచుండును.

పరమగురువుల ద్వారమున, వారి ప్రణాళికలో పనిచేయుటకు సంసిద్దపడు సాధకోత్తములకు దివ్యప్రబోధ తరంగములుగా అందుచుండును. ఇవి బ్రహ్మజ్ఞానమను అమృత ప్రవాహముగా మానవాళిని చేరుచున్నది.

ఈ ప్రవాహము ఒక జీవనది. ఇది ఆగదు, ఎండదు. దీనికి మొదలు తుద లేవు. దీనికి కర్త ఎవడును లేడు.

ఇది ఈశ్వరుని కళామయ రూపమయి ఉన్నది. వాల్మీక, వ్యాసాది ఋషుల ద్వారమున ఈ జ్ఞానసుధా ప్రవాహము శ్రుతిస్మృతి పురాణేతిహాసాదులుగా గడ్డలు కట్టుకొన్నది.

ఈ మొత్తమునకు ఆది యగు తెల్లదీవి వెలుగుగా అనుభూతియై వర్తించువానికే బ్రహ్మ జ్ఞానము యొక్క సమగ్రదర్శనము లభించును.......

🌹 🌹 🌹 🌹 🌹


10 May 2021

No comments:

Post a Comment