🌹. వివేక చూడామణి - 68 / Viveka Chudamani - 68 🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 19. బ్రహ్మము - 8 🍀
243. పైన తెల్పిన రెండింటి మధ్య భేదమును వ్యక్తము చేయుట అనేది నిజము కాదు. ఈశ్వరుని గూర్చి చెప్పిన ఈ విషయము మహత్తుకు చెందినది. మిగిలిన జీవము అనగా వ్యక్తి ఆత్మ ఐదు పొరలతో నిర్మింపబడినది. ఇది మాయ యొక్క ఫలితమే.
244. ఈ రెండింటిని (జీవేశ్వరుడు) తొలగించినపుడు ఆ రెండు లేవు. మిగిలింది బ్రహ్మమే. రాజుకు గుర్తింపు రాజ్యము. కవచాలను తొలగించినపుడు రాజు లేడు సైనికుడు లేడు. మిగిలినది మనిషి మాత్రమే. అలానే ఈశ్వరునిలోని విజ్ఞానమును మరియు జీవునిలోని అజ్ఞానము తొలగించిన మిగిలినది బ్రహ్మమే. అదే రెండింటి యొక్క మూలము.
245. వేదములలోని పదాలైన ఇపుడు, అపుడు అనేవి బ్రహ్మములో ద్వంద్వాన్ని పలుకుచున్నవి. సాధకుడు జ్ఞానము పొంది ఆ రెండింటి భేదమును తొలగించినపుడు ఆ రెండు ఒక్కటే అని తెలుస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 68 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 19. Brahman - 8 🌻
243. This contradiction between them is created by superimposition, and is not something real. This superimposition, in the case of Ishwara (the Lord), is Maya or Nescience, which is the cause of Mahat and the rest, and in the case of the Jiva (the individual soul), listen – the five sheaths, which are the effects of Maya, stand for it.
244. These two are the superimpositions of Ishwara and the Jiva respectively, and when these are perfectly eliminated, there is neither Ishwara nor Jiva. A kingdom is the symbol of a king, and a shield of the soldier, and when these are taken away, there is neither king nor soldier.
245. The Vedas themselves in the words "now then is the injunction" etc., repudiate the duality imagined in Brahman. One must needs eliminate those two superimpositions by means of realisation supported by the authority of the Vedas.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
02 May 2021
No comments:
Post a Comment