1) 🌹 శ్రీమద్భగవద్గీత - 597 / Bhagavad-Gita - 597 - 18-9 🌹
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 382 383 / Vishnu Sahasranama Contemplation - 382, 383🌹
3) 🌹 Daily Wisdom - 105🌹
4) 🌹. వివేక చూడామణి - 68🌹
5) 🌹Viveka Chudamani - 68🌹
6) 🌹. దేవాపి మహర్షి బోధనలు - 79🌹
7) 🌹. నిర్మల ధ్యానములు - 11🌹
8) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 259 / Sri Lalita Chaitanya Vijnanam - 259 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 598 / Bhagavad-Gita - 598 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 09 🌴*
09. కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతేర్జున |
సఙ్గం త్యక్తా ఫలం చైవ స త్యాగ: సాత్త్వికో మత: ||
🌷. తాత్పర్యం :
ఓ అర్జునా! తప్పక ఒనరింపవలసియే యున్నందున తన స్వధర్మమును నిర్వహించుచు, సమస్త భౌతికసంగమును మరియు ఫలాసక్తిని విడుచువాని త్యాగము సాత్త్విక త్యాగమనబడును.
🌷. భాష్యము :
విధ్యుక్తధర్మములను ఇట్టి భావనలోనే నిర్వహింపవలెను. మనుజుడు ఫలమున యెడ ఆసక్తి లేకుండా వర్తింపవలెను. అంతియేకాక అతడు గుణముల నుండియు విడివడియుండవలెను.
కృష్ణభక్తిరసభావితుడైన వ్యక్తి ఏదేని కర్మాగారములలో పనిచేయుచున్నచో కర్మాగారపు పనినే సర్వస్వమని తలచి తాదాత్మ్యము చెందుట గాని, కర్మాగారమునందలి కార్మికులతో అనవసర సంగత్వమును కలిగియుండుట గాని చేయడు. కేవలము కృష్ణుని నిమిత్తమే అతడు కర్మనొనరించును.
ఫలమును కృష్ణునకే అర్పించినపుడు అతడి దివ్యముగా వర్తించినవాడగును.
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 598 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga - The Perfection of Renunciation - 09 🌴*
09. kāryam ity eva yat karma niyataṁ kriyate ’rjuna
saṅgaṁ tyaktvā phalaṁ caiva sa tyāgaḥ sāttviko mataḥ
🌷 Translation :
O Arjuna, when one performs his prescribed duty only because it ought to be done, and renounces all material association and all attachment to the fruit, his renunciation is said to be in the mode of goodness
🌹 Purport :
Prescribed duties must be performed with this mentality. One should act without attachment for the result; he should be disassociated from the modes of work.
A man working in Kṛṣṇa consciousness in a factory does not associate himself with the work of the factory, nor with the workers of the factory. He simply works for Kṛṣṇa. And when he gives up the result for Kṛṣṇa, he is acting transcendentally.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 382, 383 / Vishnu Sahasranama Contemplation - 382, 383 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 382. గహనః, गहनः, Gahanaḥ 🌻*
*ఓం గహనాయ నమః | ॐ गहनाय नमः | OM Gahanāya namaḥ*
గహనః, गहनः, Gahanaḥ
తస్య స్వరూపం సామర్థ్యం చేష్టితం వా న శక్యతే ।
జ్ఞాతు మిత్యేవ గహన ఇతి విద్వద్భిరీర్యతే ॥
ఈతని స్వరూపముగానీ, సామర్థ్యముగానీ, చేష్టితము అనగా చేయు పనిగానీ ఇట్టిది అని ఎరుగుట శక్యము కాదు. కావున గహనమగువాడు అని చెప్పబడును.
:: పోతన భాగవతము అష్ఠమ స్కంధము ::
క. అద్భుత వర్తనుఁడగు హరి, సద్భావితమైన విమలచరితము విను వాఁ
డుద్భట విక్రముఁడై తుది, నుద్భాసితలీలఁ బొందు నుత్తమ గతులన్. (688)
అత్యద్భుతమైన లీలలతో కూడిన విష్ణువును గురించి తెలిపే పుణ్యచరిత్రను వినేవాడు గొప్ప భాగ్యవంతుడవుతాడు. చివరికి ప్రకాశించే ప్రభావంతో దివ్య సుఖాలు పొందుతాడు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 382🌹*
📚. Prasad Bharadwaj
*382. Gahanaḥ*
*OM Gahanāya namaḥ*
Tasya svarūpaṃ sāmarthyaṃ ceṣṭitaṃ vā na śakyate,
Jñātu mityeva gahana iti vidvadbhirīryate.
तस्य स्वरूपं सामर्थ्यं चेष्टितं वा न शक्यते ।
ज्ञातु मित्येव गहन इति विद्वद्भिरीर्यते ॥
It is not possible to know His form, capacity or actions. So, He is Gahanaḥ i.e., inscrutable.
Śrīmad Bhāgavata - Canto 2, Chapter 4
Nūnaṃ bhagavato brahmanhareradbhutakarmaṇaḥ,
Durvibhāvyamivābhāti kavibhiścāpi ceṣṭitam. 8.
:: श्रीमद्भागवते द्वितीयस्कन्धे चतुर्थोऽध्यायः ::
नूनं भगवतो ब्रह्मन्हरेरद्भुतकर्मणः ।
दुर्विभाव्यमिवाभाति कविभिश्चापि चेष्टितम् ॥ ८ ॥
O learned brāhmaṇa, the activities of the Lord are all wonderful, and they appear inconceivable because even great endeavors by many learned scholars have still proved insufficient for understanding them.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥
Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 383 / Vishnu Sahasranama Contemplation - 383🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 383. గుహః, गुहः, Guhaḥ 🌻*
*ఓం గుహాయ నమః | ॐ गुहाय नमः | OM Guhāya namaḥ*
గుహః, गुहः, Guhaḥ
గూహతే సంవృణోతి స్వరూపాది నిజమాయయా ।
ఇతి విష్ణుర్గుహ ఇతి ప్రోచ్యతే విదుషాం చయైః ॥
తన స్వరూపము మొదలగువానిని తన మాయ చేతనే తెలియనీయక మూయుచున్నాడుగనుక ఆ విష్ణు దేవుని గుహః అని విద్వాంసులు భావిస్తారు.
:: శ్రీమద్భగవద్గీత - విజ్ఞాన యోగము ::
నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః ।
మూఢోఽయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్ ॥ 25 ॥
యోగమాయచే బాగుగ కప్పబడియుండుటచే నేను అందఱికిని కనుపించు వాడనుగాను. అవివేకులగు ఈ జనులు నన్ను పుట్టుకలేనివానినిగను, నాశరహితునిగను ఎరుగరు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 383🌹*
📚. Prasad Bharadwaj
*🌻383. Guhaḥ🌻*
*OM Guhāya namaḥ*
Gūhate saṃvr̥ṇoti svarūpādi nijamāyayā,
Iti viṣṇurguha iti procyate viduṣāṃ cayaiḥ.
गूहते संवृणोति स्वरूपादि निजमायया ।
इति विष्णुर्गुह इति प्रोच्यते विदुषां चयैः ॥
He conceals His real form under the veil of māyā or illusion hence He is Guhaḥ.
Śrīmad Bhagavad Gīta - Chapter 7
Nāhaṃ prakāśaḥ sarvasya yogamāyāsamāvr̥taḥ,
Mūḍo’yaṃ nābhijānāti loko māmajamavyayam. 25.
:: श्रीमद्भगवद्गीत - विज्ञान योग ::
नाहं प्रकाशः सर्वस्य योगमायासमावृतः ।
मूढोऽयं नाभिजानाति लोको मामजमव्ययम् ॥ २५ ॥
Being enveloped by yoga-māyā, I do not become manifest to all. This deluded world does not know Me who am birth-less and undecaying.
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
उद्भवः क्षोभणो देवः श्रीगर्भः परमेश्वरः ।
करणं कारणं कर्ता विकर्ता गहनो गुहः ॥ ४१ ॥
ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కరణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౪౧ ॥
Udbhavaḥ kṣobhaṇo devaḥ śrīgarbhaḥ parameśvaraḥ ।
Karaṇaṃ kāraṇaṃ kartā vikartā gahano guhaḥ ॥ 41 ॥
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group.
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 DAILY WISDOM - 105 🌹*
*🍀 📖 The Ascent of the Spirit 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
*🌻 14. The Faith of the Ignorant is not to be Shaken 🌻*
The basic psychology behind education should be “not to disturb the degree of reality involved in any state of experience.” The Bhagavadgita exhorts: “The faith of the ignorant is not to be shaken” while the wise one performs the function of imparting knowledge to the ignorant.
The standpoint of the student in any stage of education cannot be ignored, though it may be regarded as an inadequate standpoint in comparison with a higher level of knowledge. Education is similar to the artistic process of the blossoming of a flower bud, gradually and beautifully. The bud is not to be opened suddenly by exerting any undue force; else, it would not be a blossom, but a broken structure serving no purpose.
The teacher is always to be hidden behind the student, though he is with the student at all times. He is not to come to the forefront, either as a superior or an unpleasant ingredient among the constituents that go to form the feelings, aspirations and needs of the student at any particular level.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. Daily satsang Wisdom 🌹
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. వివేక చూడామణి - 68 / Viveka Chudamani - 68🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🍀. 19. బ్రహ్మము - 8 🍀*
243. పైన తెల్పిన రెండింటి మధ్య భేదమును వ్యక్తము చేయుట అనేది నిజము కాదు. ఈశ్వరుని గూర్చి చెప్పిన ఈ విషయము మహత్తుకు చెందినది. మిగిలిన జీవము అనగా వ్యక్తి ఆత్మ ఐదు పొరలతో నిర్మింపబడినది. ఇది మాయ యొక్క ఫలితమే.
244. ఈ రెండింటిని (జీవేశ్వరుడు) తొలగించినపుడు ఆ రెండు లేవు. మిగిలింది బ్రహ్మమే. రాజుకు గుర్తింపు రాజ్యము. కవచాలను తొలగించినపుడు రాజు లేడు సైనికుడు లేడు. మిగిలినది మనిషి మాత్రమే. అలానే ఈశ్వరునిలోని విజ్ఞానమును మరియు జీవునిలోని అజ్ఞానము తొలగించిన మిగిలినది బ్రహ్మమే. అదే రెండింటి యొక్క మూలము.
245. వేదములలోని పదాలైన ఇపుడు, అపుడు అనేవి బ్రహ్మములో ద్వంద్వాన్ని పలుకుచున్నవి. సాధకుడు జ్ఞానము పొంది ఆ రెండింటి భేదమును తొలగించినపుడు ఆ రెండు ఒక్కటే అని తెలుస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 VIVEKA CHUDAMANI - 68 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
*🌻 19. Brahman - 8 🌻*
243. This contradiction between them is created by superimposition, and is not something real. This superimposition, in the case of Ishwara (the Lord), is Maya or Nescience, which is the cause of Mahat and the rest, and in the case of the Jiva (the individual soul), listen – the five sheaths, which are the effects of Maya, stand for it.
244. These two are the superimpositions of Ishwara and the Jiva respectively, and when these are perfectly eliminated, there is neither Ishwara nor Jiva. A kingdom is the symbol of a king, and a shield of the soldier, and when these are taken away, there is neither king nor soldier.
245. The Vedas themselves in the words "now then is the injunction" etc., repudiate the duality imagined in Brahman. One must needs eliminate those two superimpositions by means of realisation supported by the authority of the Vedas.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#వివేకచూడామణి #VivekaChudamani #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. దేవాపి మహర్షి బోధనలు - 79 🌹*
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*🌻 60. సమదృష్టి - మెల్లకన్ను 🌻*
సమదృష్టి కలవారికే కేంద్రము గోచరింప గలదు. ఇతరులకు కేంద్ర బిందువు కేంద్రమున కాక అటునిటుగ గోచరించు చుండును. సమదృష్టి లేనివారు, కేంద్రము చూడలేని వారు, మెల్లకన్ను గలవారిగ మేము భావింతుము.
అందరికిని కన్నులున్నను ఒకే వస్తువును చూచుచున్నను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గోచరించును. కాని వస్తువు కేంద్రము తద్వారా సమగ్ర రూపము మాత్రము గోచరించదు. నేతలు సమదృష్టి గల వారినే విశ్వసించవలెను. పక్షపాత దృష్టి కలిగిన వారందరు గ్రుడ్డివారే. ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి. అనగా జన్మతః పక్షపాత బుద్ధి కలవాడని అర్థము. పక్షపాతధోరణి గ్రుడ్డితనము కాగ, సత్యమును సమగ్ర దర్శనము చేయనివారు మెల్లకన్ను గలవారు. సమదృష్టి గలవారికే చూచుశక్తి స్పష్టముగ నుండును.
చూచుటయందు కుడి ఎడమలు ఉండవు. నిజమునకు వీరు కుడి ఎడమ కన్నులతో చూడరు. వానికి కేంద్రమైన జ్ఞాన నేత్రముతో చూచెదరు. వారి చూపు, వారి అవగాహన ఇతరుల కుండదు. ఉండదని గూడ వారు తెలిసి యుందురు. మెల్లకన్ను చూపులు, గ్రుడ్డి చూపులు, సమగ్ర దృష్టి వారి కవగతమే. మొదటి రెండు తెగల వారిని వీరు నిరసింపరు. వీరి యెడల మౌనము వహించి యుందురు. మూడవ తెగవారిని “కలాప”కు ఆహ్వానింతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#దేవాపిమహర్షిబోధనలు #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 11 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
*🍀. అస్తిత్వం స్పందించే తత్వంతో వున్నపుడు మాత్రమే నీకు అన్నీ యిస్తుంది. 🍀*
మనుషులు గట్టిపడి వుంటారు. జీవితం వాళ్ళు బండబారి వుండేలా వాళ్ళను తయారుచేసింది. ఎందుకంటే జీవితం వాళ్ళని యుద్ధానికి సిద్ధం చేసింది. క్రమక్రమంగా వాళ్ళు తమ లోపలి మృదుత్వాన్ని కోల్పోయారు. రాతిలాంటి మనిషి చనిపోయిన వాడి కిందే లెక్క అతనికి పేరుంటుంది. అతను నిజంగా జీవించడు. నిజమైన జీవితం మృదుత్వంలో, ప్రతిస్పందించే గుణంలో, మనసు విప్పడంలో వుంది.
అస్తిత్వం గురించి భయపడకు. ఉనికి నిన్ను ప్రేమిస్తుంది. నీ గురించి జాగ్రత్త తీసుకుంటుంది అస్తిత్వంతో ఘర్షించాల్సిన పన్లేదు. నీ వూహకందని, నువ్వు అడిగిన దానికి మించి నీకందిస్తుంది.
ఐతే నువ్వు మృదువుగా వున్నపుడు, స్పందించే తత్వంతో వున్నపుడు మాత్రమే నీకు అన్నీ యిస్తుంది. అనంత అణుమార్గాల గుండా నువ్వు ఆహ్వానం పలికినపుడే అస్తిత్వం అన్ని దిక్కుల గుండా నీలోకి వస్తుంది. భయపడకు, భయపడాల్సిన పన్లేదు. మనం దానికి సంబంధించిన వాళ్ళమే. అది మనకు సంబంధించిదే!
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://pyramidbook.in/Chaitanyavijnanam
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 259 / Sri Lalitha Chaitanya Vijnanam - 259 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 62. ధ్యానధ్యాతృ ధ్యేయరూపా, ధర్మాధర్మ వివర్జితా ।
విశ్వరూపా, జాగరిణీ, స్వపంతీ, తైజసాత్మికా ॥ 62 ॥ 🍀*
*🌻259. ' తైజసాత్మికా ' 🌻*
తైజసాత్మిక అనగా ఆత్మల యందు తేజస్సుగనిండియున్నది శ్రీదేవి అని అర్థము. శ్రీదేవి అస్థిత్వము కారణముగనే జీవుడు తేజో వంతుడై త్రిగుణములను పొందును. వ్యక్తిగత ప్రజ్ఞ కలిగిన వాడగును. త్రిగుణము లపుడు అతనిని ఆవరించును.
తమస్సు అధికముగ ఆవరించినపుడు నిద్ర, తమస్సు నందు కొంత రజస్సు ప్రవేశించి నపుడు స్వప్నము, మెలకువ ఇత్యాదివి కలుగును. రజస్సు పాలు తమస్సులోనుండి పెరుగుచున్నకొలది ప్రజ్ఞ బహిర్ముఖమై విప్పారు
చుండును.
తైజసాత్మ క్రమముగ ప్రజ్ఞాత్మ అగును. ఈ తేజస్సు పురోగమనమే నిద్ర నుండి, స్వప్నమునుండి జీవుడు మేల్కాంచుటకు కారణము. ఈ తేజస్సు తిరోగమించినపుడు క్రమముగ విశ్రాంతి కోరుట, నిద్రించుట జరుగును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 259 🌹*
*1000 Names of Sri Lalitha Devi*
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
*🌻Taijasātmikā तैजसात्मिका (259) 🌻*
The individual soul associated with the dream state discussed in the previous nāma is called taijasa. In the state of awake, gross body is active and in the state of dream, subtle body (sūkṣma śarīra) is active. Taijas operates through the egoistic impulses with the aid of sense faculties and vital airs. Its consciousness turned inward, enjoying exquisite dream memories.
Because of its association with the subtle body, it remains associated with hiraṇyagarbha state, the aggregate of all subtle bodies. When the individual consciousness withdraws from the gross body and becomes identified with the subtle body, the waking state disappears and the dream state emerges.
In this state, the consciousness remains restricted to mind, intellect, consciousness and ego (these four together are called antaḥkaraṇa). Taijasa is the word derived from tejomaya (nāma 452), which means splendour or light, shining, brilliant. She manifests in this stage.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#లలితాసహస్రనామ #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment