దేవాపి మహర్షి బోధనలు - 79


🌹. దేవాపి మహర్షి బోధనలు - 79 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 60. సమదృష్టి - మెల్లకన్ను 🌻


సమదృష్టి కలవారికే కేంద్రము గోచరింప గలదు. ఇతరులకు కేంద్ర బిందువు కేంద్రమున కాక అటునిటుగ గోచరించు చుండును. సమదృష్టి లేనివారు, కేంద్రము చూడలేని వారు, మెల్లకన్ను గలవారిగ మేము భావింతుము.

అందరికిని కన్నులున్నను ఒకే వస్తువును చూచుచున్నను ఒక్కొక్కరికి ఒక్కొక్కటి గోచరించును. కాని వస్తువు కేంద్రము తద్వారా సమగ్ర రూపము మాత్రము గోచరించదు. నేతలు సమదృష్టి గల వారినే విశ్వసించవలెను. పక్షపాత దృష్టి కలిగిన వారందరు గ్రుడ్డివారే. ధృతరాష్ట్రుడు పుట్టు గ్రుడ్డి. అనగా జన్మతః పక్షపాత బుద్ధి కలవాడని అర్థము. పక్షపాతధోరణి గ్రుడ్డితనము కాగ, సత్యమును సమగ్ర దర్శనము చేయనివారు మెల్లకన్ను గలవారు. సమదృష్టి గలవారికే చూచుశక్తి స్పష్టముగ నుండును.

చూచుటయందు కుడి ఎడమలు ఉండవు. నిజమునకు వీరు కుడి ఎడమ కన్నులతో చూడరు. వానికి కేంద్రమైన జ్ఞాన నేత్రముతో చూచెదరు. వారి చూపు, వారి అవగాహన ఇతరుల కుండదు. ఉండదని గూడ వారు తెలిసి యుందురు. మెల్లకన్ను చూపులు, గ్రుడ్డి చూపులు, సమగ్ర దృష్టి వారి కవగతమే. మొదటి రెండు తెగల వారిని వీరు నిరసింపరు. వీరి యెడల మౌనము వహించి యుందురు. మూడవ తెగవారిని “కలాప”కు ఆహ్వానింతురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


02 May 2021

No comments:

Post a Comment