దేవాపి మహర్షి బోధనలు - 103
🌹. దేవాపి మహర్షి బోధనలు - 103 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 84. మూర్ఛత 🌻
అన్నిదేశముల సంస్కృతులయందు రక్షించు దేవతల కథలున్నవి. రక్షకులున్నారు. అన్ని బోధనలయందు రక్షకుల కథలు కోకొల్లలుగ యున్నవి. భూమిని, భూమి జీవులను రక్షించు వారున్నారు. గ్రహములను, సూర్య మండలములను రక్షించు దేవత లున్నారు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు వివిధ సమయములలో రక్షణ పొందిన సన్నివేశము లున్నవి. ఆధునిక యుగమున మానవుని కెందులకో రక్షకులపై నమ్మకము లేదు. ఇది దురదృష్ట కరము.
చీమ నుండి బ్రహ్మ వరకు వారి వారి పరిధులలో వారికి రక్షణ అందుచునే యున్నది. ఈ రక్షక తత్త్వమే దుర్గ. ఆమె సైన్యము లెక్కల కందనిది- ఆమె పుత్రులే సద్బోధకులు. వారు బోధించునది క్షేమకర మార్గము. జీవులకు స్వస్థతను కూర్చుట, స్వస్థానమునకు దారిచూపుట వారి పని. దిక్కు చూపు వారిని నిర్లక్ష్యము చేయుచు, దిక్కులేని వారమని వాపోవుట కలి సోకిన మానవుల వికారము.
ఇట్టి స్థితియందు మేమేమి చేయవలెను? దిక్కు చూపుచునే యుందుము. మీరు చూచు వరకు వేచియుందుము. మంకుపట్టు పట్టి ఏడ్చుచున్న పిల్లవానిని కొంత తడవు ఏడ్వనిచ్చినచో అటుపైన అతడే మంకు వదలి ప్రవర్తించగలడు. ఇది మీపై మాకు గల విశ్వాసము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
24 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment